Home
News

షియోమి నుంచి అత్యంత తక్కువ ధరకే స్మార్ట్ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్

ఫోన్ల ప్రపంచంలో సంచలనం రేపిన చైనా మొబైల్ మేకర్ షియోమి గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లోనూ దుమ్మురేపుతోంది. మొన్నటికి మొన్నే.. టీవీలు రిలీజ్ చేసి.. ఇండియన్ టెలివిజన్ మార్కెట్ ను షేక్ చేసిన విషయం మ

ఫోన్ల ప్రపంచంలో సంచలనం రేపిన చైనా మొబైల్ మేకర్ షియోమి గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లోనూ దుమ్మురేపుతోంది. మొన్నటికి మొన్నే.. టీవీలు రిలీజ్ చేసి.. ఇండియన్ టెలివిజన్ మార్కెట్ ను షేక్ చేసిన విషయం మరువక ముందే ఇప్పుడు వాషింగ్ మెషీన్స్ రిలీజ్ చేస్తోంది. రెడ్‌మీ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌ను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.

షియోమి నుంచి అత్యంత తక్కువ ధరకే స్మార్ట్ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్

ఇప్పటికే చైనాలో మార్కెట్ లో దుమ్మురేపుతున్న ఈ సేల్స్.. అతి త్వరలోనే ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. షియోమీ (MI) వాషింగ్ మెషీన్స్ ధర కూడా చౌక అంటున్నారు.

వాషింగ్ మెషీన్ ధర

వాషింగ్ మెషీన్ ధర

ఈ రెడ్‌మీ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ ధర దాదాపు రూ.8,150 ఉండబోతోంది. చైనా మార్కెట్‌లో ఏప్రిల్ 9 నుంచి అందుబాటులోకి రానున్న ఈ వాషింగ్ మెషీన్‌లు భారత్‌ మార్కెట్‌లోకి ఎప్పుడు రానున్నాయి అనే విషయం ఇంకా తెలియలేదు.

హై ఎండ్ ధర

హై ఎండ్ ధర

అయితే కంపెనీ వీటిని మన మార్కెట్‌లోకి తీసుకువస్తుందనేది మాత్రం ఖచ్చితమైన సమాచారంగా ఉంది. ఇండియన్ కరెన్సీలో తక్కువలో తక్కువగా 9వేల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. హై ఎండ్ ధర రూ. 22వేల వరకు ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా.

సామర్థ్యం

సామర్థ్యం

దీని సామర్థ్యం 8 కేజీలు. 9 రకాల ఆప్షన్స్ ఇచ్చారు. ప్రస్తుతం భారత్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న 8 కేజీ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లతో పోలిస్తే దీని ధర చాలా తక్కువగానే ఉంటుందని అంచనా. కాగా మార్కెట్లో 6.5 కేజీల సామర్థ్యం ఉన్న వాషింగ్ మెషిన్ ధరలు కూడా రూ.16 వేలకు తక్కువ ఉండవు. అదే మంచి బ్రాండెడ్ వాషింగ్ మెషిన్ కొనాలంటే తక్కువలో తక్కువ రూ.20 వేలు పెట్టాల్సిందే.

 వాషింగ్ ఆప్షన్స్

వాషింగ్ ఆప్షన్స్

డబుల్ బ్లాక్ డిజైన్, స్ట్రాంగ్ వాటర్ బ్రో, ఎలాంటి మరక అయినా తొలగిస్తోంది. దుస్తుల రకాలను బట్టి వాషింగ్ ఆప్షన్స్ మార్చుకోవచ్చు. తక్కువ నీళ్లతో ఎక్కువ ఉతుకు, ఆటోమేటిక్ డ్రై ఉందని ఘనంగా ప్రచారం చేస్తోంది కంపెనీ.

కలర్స్

కలర్స్

టాప్ లోడ్ వాషింగ్ మెషీన్‌గా.. సింపుల్ డిజైన్‌తో తెలుపు రంగులో ఉండే ఈ మెషీన్... యాంటీ కొరోషన్ మెటల్ బాడీని కలిగి ఉండడం ఒక ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఇందులో సెల్ఫ్ క్లీనింగ్ డ్రై ఫంక్షన్, 10 గ్రేడ్ వాటర్ లెవెల్ అడ్జస్ట్‌మెంట్, 10 రకాల వాషింగ్ మోడ్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Redmi 1A Washing Machine with 8kg capacity announced for ¥799 (~$119)
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X