Redmi మొబైల్ పేలుడు, ఒక‌రి మృతి: స్పందించిన Xiaomi కంపెనీ!

|

చైనాకు చెందిన ప్ర‌ముఖ మొబైల్ ఉత్ప‌త్తుల త‌యారీ కంపెనీ Redmi కి నెట్టింట‌ ప్ర‌తికూల ప్ర‌భావం ఎదురైంది. Redmi కంపెనీకి చెందిన Redmi 6A మొబైల్ పేలిపోయి, ఓ మ‌హిళ ప్రాణాలు కోల్పోయార‌ని వ‌చ్చిన వార్త‌లు క‌ల‌క‌లం సృష్టించాయి. ఈ మేర‌కు MD Talk YT అనే ఓ యూట్యూబ‌ర్ శుక్రవారం ట్విట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. Redmi 6A పేలిపోయిందని, ఈ ప్ర‌మాదంలో త‌న ఆంటీ ప్రాణాలు కోల్పోయింద‌ని ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే, అత‌ని ట్వీట్‌కు కంపెనీ స్పందించింది. అంతేకాకుండా, ప్ర‌మాదం గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ట్వీట్‌కు బ‌దులిచ్చింది.

Redmi

Redmi 6A పేలుడు:

యూట్యూబ‌ర్ ట్వీట్‌లో పేర్కొన్న ప్ర‌కారం ప్ర‌మాదానికి సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న తన బంధువు దిండుపై ప‌డుకుని ముఖం ద‌గ్గ‌ర Redmi 6A మొబైల్ ఉంచిన‌ట్లు తెలిపాడు. ఈ క్ర‌మంలో ఆమె నిద్ర లో ఉన్న‌ప్పుడు అది పేలిపోయిందని పేర్కొన్నాడు. ఈ దురదృష్టకర ఘటనలో ఆ మహిళ మృతి చెందిన‌ట్లు వెల్ల‌డించాడు. కాగా, ఆన్‌లైన్‌లో ఈ సంఘటన ఆన్‌లైన్‌లో నెటిజన్లను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది మరియు చాలా మంది ఈ ప్ర‌మాదాన్ని షేర్ చేసిన‌ట్లు స‌మాచారం.

Redmi

వార్తా నివేదిక‌ల ద్వారా అందిన స‌మాచారం ప్రకారం, ఈ ప్ర‌మాదంలో Redmi 6A మొబైల్‌కు సంబంధించిన బ్యాటరీ పేలుడుకు జ‌రిగిన‌ట్లు అంతా భావిస్తున్నారు. ప్ర‌మాదంలో మొబైల్‌ ఫ్రంట్ డిస్ప్లే పూర్తిగా ప‌గిలిపోగా, వెనుక ప్యానెల్ కూడా పూర్తిగా కాలిపోయిన‌ట్లు చిత్రాల ఆధారంగా తెలుస్తోంది. ఫొటోల‌ను బ‌ట్టి చూస్తే పేలుడు తీవ్రత ఎంత ఉందో అర్థమవుతోంది. అలాగే, ట్విటర్‌లో పంచుకున్న చిత్రాలలో బాధితురాలు రక్తపు మడుగులో పడి ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఫొటోల‌తో స‌హా ఈ విష‌యాన్నంత‌టినీ.. యూట్యూబర్ తన ట్వీట్‌లో ప్ర‌స్తావిస్తూ.. రెడ్‌మి ఇండియా, ఎగ్జిక్యూటివ్‌లు మను కుమార్ జైన్ మరియు అనుజ్ శర్మలను కూడా ట్యాగ్ చేశారు. అంతేకాకుండా, ఇలాంటి దుర‌దృష్టక‌ర సందర్భాలలో బాధితుల‌కు అండ‌గా ఉండ‌టం బ్రాండ్ యొక్క బాధ్యత అని పేర్కొన్నారు.

ఘ‌ట‌న‌ను సీరియ‌స్‌గా తీసుకుంటున్నాం: కంపెనీ
అయితే, ఈ ట్వీట్‌కు షియోమీ కంపెనీ కూడా స్పందించింది. "వినియోగదారుల భ‌ద్ర‌త మా ప్ర‌ధాన అంశం. మేం ఈ విష‌యాన్ని చాలా సీరియ‌స్‌గా తీసుకుంటున్నాం. ఈ సమస్యను గురించి పూర్తిగా తెలుసుకోవ‌డానికి Xiaomi బాధితుడి కుటుంబంతో చ‌ర్చించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం. ప్రభావితమైన కుటుంబ పరిస్థితిని, ప్ర‌మాదాన్ని గురించి పరిశోధించడానికి కృషి చేస్తున్న‌ట్లు" Xiaomi ట్వీట్‌కు బ‌దులిచ్చింది.

గ‌తంలో ఇటువంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి:
2021లో, Xiaomi ఫోన్‌లు పేలుడుకు గురి అవుతున్నాయని అనేక నివేదికలు ఆన్‌లైన్‌లో వెలువడ్డాయి. వాటిలో ఒకటి Poco X3 అయితే మరొకటి Redmi Note 9 Pro గా తెలిసింది. అదే కాకుండా, గ‌తంలో Redmi 8 మరియు Poco సి3 మొబైల్స్ కూడా పేలడంతో బాధితుడి కాలుకు కాలిన గాయాలయ్యాయని నివేదికలు వచ్చాయి. అప్పటి సంఘటనకు సంబంధించి డివైజ్ పేలినప్పుడు ఫోన్ యజమాని జేబులో ఉన్న‌ట్లు ట్విట‌ర్ ఫొటోల ద్వారా వ్య‌క్త‌మైంది. అయితే, ఛార్జింగ్ సమయంలో ఇలాంటి సంఘటనలు సంభవించిన సంద‌ర్భాలు ఉన్నాయి.

మ‌రోవైపు, Redmi కంపెనీ ఇటీవ‌లె Redmi A1, Redmi 11 Prime, మ‌రియు Redmi 11 Prime 5G మూడు మొబైల్స్‌ను భార‌త మార్కెట్లో లాంచ్ చేసిన విష‌యం తెలిసిందే.
Redmi A1 ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:
Redmi A1 డ్యూయల్ సిమ్ (నానో) ఫీచ‌ర్ క‌లిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ర‌న్ అవుతుంది. ఈ మొబైల్ వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌తో 6.52-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ 2GB RAMతో జతచేయబడిన ఆక్టా-కోర్ MediaTek Helio A22 SoC ప్రాసెస‌ర్ ద్వారా శక్తిని పొందుతుంది. Redmi A1 మొబైల్ 32GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీని క‌లిగి ఉంది. అంతేకాకుండా, మైక్రో SD కార్డ్ (512GB వరకు) ఎక్స్‌ప్యాండ‌బుల్ స‌పోర్టు ఇస్తుంది.

కెమెరాల విష‌యానికొస్తే, Redmi A1 మొబైల్ LED ఫ్లాష్‌తో డ్యూయల్ రియర్ AI బ్యాక్‌డ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ప్రైమ‌రీ కెమెరా 8-మెగాపిక్సెల్ క్వాలిటీ సెన్సార్‌తో కలిగి ఉంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం, ఫోన్ ముందు భాగంలో 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. ఇంకా, Redmi A1 20 కంటే ఎక్కువ భారతీయ భాషలకు మద్దతు ఇస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ పొడవు 164.67 మిమీ మరియు వెడల్పు 76.56 మిమీ ఉంటుంది.

Best Mobiles in India

English summary
Redmi 6A Explosion Allegedly Kills Woman; Xiaomi Responds

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X