4GB RAM ఫీచర్స్ Redmi స్మార్ట్‌ఫోన్‌లు బడ్జెట్ ధరలోనే!!త్వరపడండి!!!

|

షియోమి సంస్థ గత నెలలో 4GB ర్యామ్ + 64GB, 128GB స్టోరేజ్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్‌లను 10 వేల లోపు బడ్జెట్ ధరలో విడుదల చేసింది. బడ్జెట్ ధరలో 4GB ర్యామ్ ఫీచర్లతో వస్తున్న రెడ్‌మి 9 మరియు రెడ్‌మి 9 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ల యొక్క అమ్మకాలు నేడు మరో సారి ఇండియాలో మొదలుకానున్నాయి. ఈ ఫోన్‌ల యొక్క అమ్మకాలు నేడు ఇండియాలో Mi.కామ్ మరియు అమెజాన్ ఇండియా ద్వారా మధ్యాహ్నం 12 గంటలకు మరోసారి మొదలుకానున్నాయి. క్వాడ్ కెమెరా సెటప్ మరియు ట్రిపుల్ కెమెరా సెటప్‌లతో లభించే ఫోన్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

రెడ్‌మి 9 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ ధరల వివరాలు

రెడ్‌మి 9 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ ధరల వివరాలు

రెడ్‌మి 9 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ ఇండియాలో రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.9,999 కాగా 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఆప్షన్‌ ధర రూ.11,999. ఈ రెండు మోడల్స్ స్పేస్ బ్లూ, మింట్ గ్రీన్, మాట్టే బ్లాక్ మరియు సన్‌రైజ్ ఫ్లేర్ వంటి నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తాయి.

రెడ్‌మి 9 స్మార్ట్‌ఫోన్‌ ధరల వివరాలు
 

రెడ్‌మి 9 స్మార్ట్‌ఫోన్‌ ధరల వివరాలు

రెడ్‌మి 9 స్మార్ట్‌ఫోన్‌ గత నెలలో ఇండియాలో రెండు వేరియంట్‌లలో విడుదల అయింది. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ.8,999 కాగా 4GB ర్యామ్ +128GB స్టోరేజ్ ఆప్షన్ యొక్క ధర రూ.9,999. ఈ ఫోన్‌ కార్బన్ బ్లాక్, స్కై బ్లూ మరియు స్పోర్టి ఆరెంజ్ వంటి మూడు కలర్ ఎంపికలలో లభిస్తుంది.  

Also Read:Flipkart బిగ్ సేవింగ్ డేస్ సేల్ మొదలు కానున్నాయి!!! రూ.1తో ప్రీ-బుక్ చేసుకునే అవకాశం!!!Also Read:Flipkart బిగ్ సేవింగ్ డేస్ సేల్ మొదలు కానున్నాయి!!! రూ.1తో ప్రీ-బుక్ చేసుకునే అవకాశం!!!

రెడ్‌మి 9 మీడియాటెక్ హెలియో G35 SoC ఫీచర్స్

రెడ్‌మి 9 మీడియాటెక్ హెలియో G35 SoC ఫీచర్స్

రెడ్‌మి 9 స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 మరియు MIUI 12 తో రన్ అవుతుంది. ఈ ఫోన్ 6.53-అంగుళాల HD + డాట్ వ్యూ డిస్ప్లేని 720x1,600 పిక్సెల్స్ పరిమాణం మరియు 20:9 కారక నిష్పత్తితో కలిగి ఉంటుంది. ఇది 4GB వరకు RAMను కలిగి ఉండి ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G35 SoC చేత జతచేయబడి వస్తుంది.

రెడ్‌మి 9 స్మార్ట్‌ఫోన్ డెప్త్ సెన్సార్ కెమెరా సెటప్

రెడ్‌మి 9 స్మార్ట్‌ఫోన్ డెప్త్ సెన్సార్ కెమెరా సెటప్

రెడ్‌మి 9 స్మార్ట్‌ఫోన్ యొక్క ఫోటోగ్రఫీ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ సెకండరీ డెప్త్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. ఇది రెడ్‌మి 9Cకి భిన్నంగా మూడు కెమెరా సెన్సార్లను కలిగి ఉంది. అలాగే ఫోన్ ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంది.

రెడ్‌మి 9 ‌స్మార్ట్‌ఫోన్ మైక్రో-USB కనెక్టివిటీ

రెడ్‌మి 9 ‌స్మార్ట్‌ఫోన్ మైక్రో-USB కనెక్టివిటీ

షియోమి సంస్థ రెడ్‌మి 9 ఫోన్ లో 64GB మరియు 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఆప్షన్లను అందించింది. ఇందులో గల అంకితమైన మైక్రో ఎస్‌డి కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించవచ్చు. ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో 4G ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ వి 5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, మైక్రో-యుఎస్‌బి మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి.

రెడ్‌మి 9 ప్రైమ్ ఫోన్ 3D యూనిబోడీ డిజైన్‌

రెడ్‌మి 9 ప్రైమ్ ఫోన్ 3D యూనిబోడీ డిజైన్‌

రెడ్‌మి 9 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ 6.53-అంగుళాల ఫుల్-హెచ్‌డి + డిస్‌ప్లేను 19.5: 9 కారక నిష్పత్తితో మరియు 394ppi పిక్సెల్ డెన్సిటీతో  400 నిట్స్ బ్రైట్ నెస్ తో వస్తుంది. ఇది ఆరా 360 డిజైన్ మరియు అలల ఆకృతిని కలిగి ఉండి 3D యూనిబోడీ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G80 ప్రాసెసర్ మరియు మాలి-G52 GPU మద్దతుతో వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్‌ ద్వారా మెమొరిని మరింత విస్తరించవచ్చు.

రెడ్‌మి 9 ప్రైమ్ అల్ట్రా-వైడ్ సెన్సార్ కెమెరా సెటప్

రెడ్‌మి 9 ప్రైమ్ అల్ట్రా-వైడ్ సెన్సార్ కెమెరా సెటప్

రెడ్‌మి 9 ప్రైమ్‌ స్మార్ట్‌ఫోన్‌ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 2.2 ఎపర్చరుతో 13మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా మరియు ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 5 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరా మరియు ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో  2 మెగాపిక్సెల్ డీప్ సెన్సార్ కెమెరాలు అమర్చబడి ఉన్నాయి. అలాగే ఫోన్ యొక్క ముందు భాగంలో ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

రెడ్‌మి 9 ప్రైమ్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,020mAh బ్యాటరీ

రెడ్‌మి 9 ప్రైమ్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,020mAh బ్యాటరీ

షియోమి యొక్క కొత్త రెడ్‌మి ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,020mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. కానీ ఇది 10W ఛార్జర్‌తో మాత్రమే బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. ఫోన్ యొక్క కనెక్టివిటీ విషయానికి వస్తే ఇది డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 a / b / g / n / ac, బ్లూటూత్ 5.0, వై-ఫై డైరెక్ట్, FM రేడియో, NFC, GPS, AGPS మరియు ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌లకు మద్దతు ఇస్తుంది. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అమర్చబడి ఉంది. అలాగే 3.5mm ఆడియో జాక్ మరియు USB టైప్-సి పోర్ట్ కూడా ఉన్నాయి. 

Best Mobiles in India

Read more about:
English summary
Redmi 9 and 9 Prime Mobiles Sale Starts Today in India Today via Amazon and Mi.com  

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X