Redmi 9 Sale: బడ్జెట్ ధరలో అద్భుతమైన ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ కోసం బెస్ట్ ఛాయస్..

|

ఇండియాలో 4GB ర్యామ్ ఫీచర్లతో రూ.10,000 దరలోపు బడ్జెట్ ధరలో షియోమి సంస్థ గత నెలలో విడుదల చేసిన రెడ్‌మి 9 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడానికి ఈ రోజు మరొక అవకాశం లభిస్తున్నది. ఈ సంస్థ ఇండియాలో బడ్జెట్ ధరలో రెడ్‌మి 9 ప్రైమ్‌ మరియు రెడ్‌మి 9i లను కూడా ఆవిష్కరించింది. వాటర్‌డ్రాప్ నాచ్ డిస్ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా, వేగవంతమైన ఛార్జింగ్‌ మద్దతుతో 5,000mAh అతి పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తున్న ఫోన్ గురించి మరికొన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఇండియాలో రెడ్‌మి 9 ధరల వివరాలు

ఇండియాలో రెడ్‌మి 9 ధరల వివరాలు

ఇండియాలో రెండు వేరియంట్‌లలో విడుదల అయిన రెడ్‌మి 9 స్మార్ట్‌ఫోన్‌ను ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ మరియు Mi.కామ్ లో కార్బన్ బ్లాక్, స్కై బ్లూ మరియు స్పోర్టి ఆరెంజ్ వంటి మూడు విభిన్న కలర్ ఎంపికలలో కొనుగోలు చెయవచ్చు. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ.8,999 కాగా 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఆప్షన్ యొక్క ధర రూ.9,999.

 

Also Read: Vodafone Idea(VI) ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ఉచితంగా Zee5 OTT ప్రయోజనాలు...Also Read: Vodafone Idea(VI) ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ఉచితంగా Zee5 OTT ప్రయోజనాలు...

రెడ్‌మి 9 మీడియాటెక్ హెలియో G35 SoC
 

రెడ్‌మి 9 మీడియాటెక్ హెలియో G35 SoC

రెడ్‌మి 9 స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 మరియు MIUI 12 తో రన్ అవుతుంది. ఈ ఫోన్ 6.53-అంగుళాల HD + డాట్ వ్యూ డిస్ప్లేని 720x1,600 పిక్సెల్స్ పరిమాణం మరియు 20:9 కారక నిష్పత్తితో కలిగి ఉంటుంది. ఇది 4GB వరకు RAMను కలిగి ఉండి ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G35 SoC చేత జతచేయబడి వస్తుంది.

రెడ్‌మి 9 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్

రెడ్‌మి 9 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్

రెడ్‌మి 9 స్మార్ట్‌ఫోన్ యొక్క ఫోటోగ్రఫీ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ సెకండరీ డెప్త్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. ఇది రెడ్‌మి 9Cకి భిన్నంగా మూడు కెమెరా సెన్సార్లను కలిగి ఉంది. అలాగే ఫోన్ ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంది.

రెడ్‌మి 9 మైక్రో-USB కనెక్టివిటీ ఎంపికలు

రెడ్‌మి 9 మైక్రో-USB కనెక్టివిటీ ఎంపికలు

షియోమి సంస్థ రెడ్‌మి 9 ఫోన్ లో 64GB మరియు 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఆప్షన్లను అందించింది. ఇందులో గల అంకితమైన మైక్రో ఎస్‌డి కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించవచ్చు. ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో 4G ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ వి 5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, మైక్రో-యుఎస్‌బి మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Redmi 9 Budget Smartphone Sales Start Today at 12PM in India Today via Amazon and Mi.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X