Home
News

Redmi 9 Sale: బడ్జెట్ ధరలో గేమింగ్ ‌ఫోన్‌ కోసం చూస్తున్నారా?? ఇదే బెస్ట్ ఛాయస్..

ఇండియాలో 4GB ర్యామ్ వంటి మంచి గేమింగ్ ఫీచర్లతో రూ.10,000 దరలోపు షియోమి సంస్థ గత నెలలో విడుదల చేసిన రెడ్‌మి 9 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడానికి ఈ రోజు మరొక అవకాశం అందిస్తున్నది. కేవలం ఫ్లాష్ పద్దతిలో లభించే ఈ ఫోన్ గేమింగ్ ప్రియులకు మంచి ఛాయస్. వాటర్‌డ్రాప్ నాచ్ డిస్ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా, వేగవంతమైన ఛార్జింగ్‌ మద్దతుతో 5,000mAh అతి పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తున్న ఫోన్ గురించి మరికొన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఇండియాలో రెడ్‌మి 9 ధరల వివరాలు

ఇండియాలో రెడ్‌మి 9 ధరల వివరాలు

రెండు వేరు వేరు వేరియంట్‌లలో లభించే రెడ్‌మి 9 స్మార్ట్‌ఫోన్‌ను ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ మరియు Mi.కామ్ ద్వారా కార్బన్ బ్లాక్, స్కై బ్లూ మరియు స్పోర్టి ఆరెంజ్ వంటి మూడు కలర్ ఎంపికలలో కొనుగోలు చెయవచ్చు. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ.8,999 కాగా 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఆప్షన్ యొక్క ధర రూ.9,999.

 

రెడ్‌మి 9 స్మార్ట్‌ఫోన్ నానో సిమ్ స్లాట్‌ స్పెసిఫికేషన్స్

రెడ్‌మి 9 స్మార్ట్‌ఫోన్ నానో సిమ్ స్లాట్‌ స్పెసిఫికేషన్స్

రెడ్‌మి 9 స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 మరియు MIUI 12 తో రన్ అవుతుంది. ఈ ఫోన్ 6.53-అంగుళాల HD + డాట్ వ్యూ డిస్ప్లేని 720x1,600 పిక్సెల్స్ పరిమాణం మరియు 20:9 కారక నిష్పత్తితో కలిగి ఉంటుంది. ఇది 4GB వరకు RAMను కలిగి ఉండి ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G35 SoC చేత జతచేయబడి వస్తుంది.

రెడ్‌మి 9 డెప్త్ సెన్సార్ కెమెరా సెటప్

రెడ్‌మి 9 డెప్త్ సెన్సార్ కెమెరా సెటప్

రెడ్‌మి 9 స్మార్ట్‌ఫోన్ యొక్క ఫోటోగ్రఫీ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ సెకండరీ డెప్త్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. ఇది రెడ్‌మి 9Cకి భిన్నంగా మూడు కెమెరా సెన్సార్లను కలిగి ఉంది. అలాగే ఫోన్ ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంది.

రెడ్‌మి 9 మైక్రో-USB కనెక్టివిటీ ఎంపికలు

రెడ్‌మి 9 మైక్రో-USB కనెక్టివిటీ ఎంపికలు

షియోమి సంస్థ రెడ్‌మి 9 ఫోన్ లో 64GB మరియు 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఆప్షన్లను అందించింది. ఇందులో గల అంకితమైన మైక్రో ఎస్‌డి కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించవచ్చు. ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో 4G ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ వి 5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, మైక్రో-యుఎస్‌బి మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi 9 Smartphone Flash Sales Start Today at 12PM in India Today via Amazon and Mi.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X