Redmi 9A బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కొనడానికి మంచి తరుణం ఇదే!!! సూపర్ ఆఫర్స్ కూడా...
షియోమి కంపెనీ బడ్జెట్ ధరలో ఇటీవల తాజాగా విడుదల చేసిన రెడ్‌మి 9A స్మార్ట్‌ఫోన్ యొక్క అమ్మకాలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ మరియు కంపెనీ యొక్క వెబ్ సైట్ నుండి మరోసారి ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G25 SoC చిప్ సెట్, 5,000mAh బ్యాటరీ, సింగిల్ రియర్ కెమెరా వంటి అద్భుతమైన ఫీచర్లను దాని యొక్క ధరకు తగ్గట్టుగా కలిగి ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రెడ్‌మి 9A స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు
రెడ్‌మి 9A స్మార్ట్‌ఫోన్ ను రెండు వేరియంట్లలో కొనుగోలు చెయవచ్చు. ఇందులో 2GB ర్యామ్ + 32GB స్టోరేజ్ మోడల్ ను రూ.6,799 ధర వద్ద మరియు 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్ వేరియంట్ ను రూ.7,499 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ను మిడ్నైట్ బ్లాక్, నేచర్ గ్రీన్ మరియు సీ బ్లూ అనే మూడు కలర్ ఎంపికలలో కొనుగోలు చెయవచ్చు.

రెడ్‌మి 9A స్మార్ట్‌ఫోన్ సేల్ ఆఫర్స్
అమెజాన్ ఇండియా మరియు Mi.కామ్ ద్వారా మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న రెడ్‌మి 9A స్మార్ట్‌ఫోన్ ను HSBC కార్డులను కలిగిన వినియోగదారులు ఐదు శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు. అలాగే అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లకు కూడా ఐదు శాతం ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఎంచుకున్న కార్డులపై ఎటువంటి అదనపు ఖర్చులేకుండా EMI ఎంపికలను కూడా అందిస్తుంది.

రెడ్‌మి 9A ఆండ్రాయిడ్ 10 స్పెసిఫికేషన్స్
డ్యూయల్ సిమ్ నానో స్లాట్ గల రెడ్‌మి 9A స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత MIUI 12 పై రన్ అవుతుంది. ఈ ఫోన్ 6.53-అంగుళాల HD + LCD డాట్ డ్రాప్ డిస్ప్లేను 720x1,600 పిక్సెల్ పరిమాణంలో మరియు 20: 9 కారక నిష్పత్తితో కలిగి ఉంది. ఇది పట్టుకోవడానికి వీలుగా చుట్టూ మందపాటి నొక్కులను కలిగి ఉంది. ఇది మీడియాటెక్ హెలియో G25 SoC చేత రన్ అవుతూ 3GB వరకు RAM తో జత చేయబడి ఉంటుంది.

రెడ్‌మి 9A స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్
రెడ్‌మి 9A స్మార్ట్‌ఫోన్ యొక్క ఫొటోగ్రఫీ విషయానికి వస్తే దీని యొక్క వెనుక భాగంలో కేవలం ఒకే ఒక కెమెరాను కలిగి ఉంటుంది. అది కూడా ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో 12 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే సెల్ఫీలు మరియు వీడియో-కాలింగ్ కోసం ముందు భాగంలో వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ లోపల 5 మెగాపిక్సెల్ సెన్సార్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

ఇంటర్నల్ స్టోరేజ్
32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తున్న రెడ్‌మి 9A స్మార్ట్‌ఫోన్ లో గల ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించవచ్చు. ఈ ఫోన్ 10W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మద్దతుతో 5,000mAh అతి పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, వై-ఫై, బ్లూటూత్ 5.0, 3.5mm ఆడియో జాక్ మరియు మైక్రో-యుఎస్‌బి పోర్ట్ వంటివి ఉన్నాయి. ఈ ఫోన్ AI ఫేస్ అన్‌లాక్‌కు మద్దతు ఇస్తుంది. చివరిగా రెడ్‌మి 9A ఫోన్ 164.9x77.07x9mm కొలతల పరిమాణంతో 194 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications