Redmi 9A Flash Sale: రూ.6,000 బడ్జెట్ ధరలో మంచి ఛాయస్ ఇదే!!!

|

ఇండియాలో ఇప్పుడు ఎక్కువ మంది రూ.10,000 ధర లోపు కొత్త స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. బడ్జెట్ ధరలో షియోమి సంస్థ అద్భుతమైన ఫీచర్లతో ఇటీవల రెడ్‌మి 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. అందులో ఒకటైన రెడ్‌మి 9A స్మార్ట్‌ఫోన్ యొక్క అమ్మకాలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ మరియు కంపెనీ యొక్క వెబ్ సైట్ లో మరోసారి ప్రారంభం కానున్నాయి. ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G25 SoC చిప్ సెట్, 5,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగిఉన్న ఫోన్ గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రెడ్‌మి 9A స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు
 

రెడ్‌మి 9A స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

ఇండియాలో రెడ్‌మి 9A స్మార్ట్‌ఫోన్ ను రెండు వేరియంట్లలో కొనుగోలు చెయవచ్చు. 2GB ర్యామ్ + 32GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.6,799 కాగా 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.7,499. ఈ స్మార్ట్‌ఫోన్ ను మిడ్నైట్ బ్లాక్, నేచర్ గ్రీన్ మరియు సీ బ్లూ అనే మూడు కలర్ ఎంపికలలో కొనుగోలు చెయవచ్చు.

Also Read: Vodafone Idea(VI) ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ఉచితంగా Zee5 OTT ప్రయోజనాలు...

రెడ్‌మి 9A స్మార్ట్‌ఫోన్ సేల్ ఆఫర్స్

రెడ్‌మి 9A స్మార్ట్‌ఫోన్ సేల్ ఆఫర్స్

అమెజాన్ ఇండియా మరియు Mi.కామ్ ద్వారా మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న రెడ్‌మి 9A స్మార్ట్‌ఫోన్ ను HSBC కార్డులను కలిగిన వినియోగదారులు ఐదు శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు. అలాగే అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లకు కూడా ఐదు శాతం ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది.

రెడ్‌మి 9A మీడియాటెక్ హెలియో G25 SoC చిప్ సెట్

రెడ్‌మి 9A మీడియాటెక్ హెలియో G25 SoC చిప్ సెట్

రెడ్‌మి 9A స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ నానో స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 ఆధారిత MIUI 12 పై రన్ అవుతుంది. ఈ ఫోన్ 6.53-అంగుళాల HD + LCD డాట్ డ్రాప్ డిస్ప్లేను 720x1,600 పిక్సెల్ పరిమాణంలో మరియు 20: 9 కారక నిష్పత్తితో కలిగి ఉంది. ఇది పట్టుకోవడానికి వీలుగా చుట్టూ మందపాటి నొక్కులను కలిగి ఉంది. ఇది మీడియాటెక్ హెలియో G25 SoC చేత రన్ అవుతూ 3GB వరకు RAM తో జత చేయబడి ఉంటుంది.

రెడ్‌మి 9A స్మార్ట్‌ఫోన్ ఫొటోగ్రఫీ కెమెరా ఫీచర్స్
 

రెడ్‌మి 9A స్మార్ట్‌ఫోన్ ఫొటోగ్రఫీ కెమెరా ఫీచర్స్

రెడ్‌మి 9A స్మార్ట్‌ఫోన్ యొక్క ఫొటోగ్రఫీ విషయానికి వస్తే దీని వెనుక భాగంలో కేవలం ఒకే ఒక కెమెరాను కలిగి ఉంటుంది. అది కూడా ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో 12 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే సెల్ఫీలు మరియు వీడియో-కాలింగ్ కోసం ముందు భాగంలో వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ లోపల 5 మెగాపిక్సెల్ సెన్సార్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

రెడ్‌మి 9A 10W ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ ఫీచర్స్

రెడ్‌మి 9A 10W ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ ఫీచర్స్

32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఫీచర్ తో లభిస్తున్న రెడ్‌మి 9A స్మార్ట్‌ఫోన్ లో గల ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించవచ్చు. ఈ ఫోన్ 10W ఫాస్ట్ ఛార్జింగ్‌ టెక్నాలజీ మద్దతుతో 5,000mAh అతి పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, వై-ఫై, బ్లూటూత్ 5.0, 3.5mm ఆడియో జాక్ మరియు మైక్రో-యుఎస్‌బి పోర్ట్ వంటివి ఉన్నాయి. ఈ ఫోన్ AI ఫేస్ అన్‌లాక్‌కు మద్దతు ఇస్తుంది. చివరిగా రెడ్‌మి 9A ఫోన్ 164.9x77.07x9mm కొలతల పరిమాణంతో 194 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Redmi 9A Smartphone Goes Sale Today in India at 12PM via Amazon, Mi.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X