Redmi 9i First Sale: 4GB ర్యామ్ ఫీచర్లతో తక్కువ ధరలో రెడ్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్....
షియోమి సంస్థ ఇండియాలో గత వారంలో బడ్జెట్ ధరలో విడుదల చేసిన కొత్త స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి 9i యొక్క మొదటి అమ్మకాలు ఈ రోజు మధ్యాహ్నం 12PM గంటలకు ఫ్లిప్‌కార్ట్, Mi హోమ్, మరియు Mi.కామ్ ద్వారా మొదలుకానున్నాయి. ఈ కొత్త బడ్జెట్ ఫోన్ వాటర్‌డ్రాప్ నాచ్ డిస్ప్లే, మీడియా టెక్ హెలియో G25 ప్రాసెసర్ చిప్‌సెట్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

షియోమి రెడ్‌మి 9i ధరల వివరాలు
రెడ్‌మి 9i స్మార్ట్‌ఫోన్ ను నేడు రెండు స్టోరేజ్ మోడళ్లలో కొనుగోలు చేయవచ్చు. 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ మోడల్ ను రూ.8,299 ధర వద్ద మరియు 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ను రూ.9,299 ధర వద్ద ఫ్లిప్‌కార్ట్ మరియు Mi.కామ్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. దీనిని ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బజ్ క్రెడిట్ కార్డు మీద కొనుగోలు చేసిన వారికి 5% వరకు తగ్గింపు లభిస్తుంది.

షియోమి రెడ్‌మి 9i G25 ఆక్టా-కోర్ చిప్‌సెట్ SOC
రెడ్‌మి 9i స్మార్ట్‌ఫోన్ 6.53-అంగుళాల LCD డిస్‌ప్లేను హెచ్‌డి + రిజల్యూషన్ తో మరియు 20: 9 కారక నిష్పత్తితో వస్తుంది. ఈ ఫోన్ MIUI 12 వెర్షన్‌లోని ఆండ్రాయిడ్10 OS అవుట్-ఆఫ్-బాక్స్‌తో రన్ అవుతుంది. అలాగే ఈ ఫోన్ మీడియాటెక్ హెలియో G25 ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ను కలిగి ఉండి 4GB ర్యామ్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ కలిగి ఉండి మెమోరిని మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా విస్తరించడానికి వీలుగా ఉంటుంది.

రెడ్‌మి 9i GPS మరియు IR బ్లాస్టర్ ఫీచర్స్
రెడ్‌మి 9i స్మార్ట్‌ఫోన్ ఇమేజింగ్ మరియు కెమెరా సెటప్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ సెన్సార్ తో ఒకే ఒక కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఫింగర్ ప్రింట్ రీడర్ లేకుండా వస్తుంది. రెడ్‌మి 9i డ్యూయల్ సిమ్ స్లాట్, 4G వోల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ 5.0, GPS మరియు IR బ్లాస్టర్‌లకు మద్దతు ఇస్తుంది. అలాగే ఈ ఫోన్ 3.5mm ఆడియో జాక్‌కు మద్దతు ఇస్తుంది మరియు స్క్రీన్ కుడివైపు అంచున పవర్ బటన్లను కలిగి ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మొబైల్ ఆఫర్స్
ఇండియాలో నేడు 'ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్' మొదలయ్యాయి. ఇందులో స్మార్ట్‌ఫోన్ల మీద అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నది. సెప్టెంబర్ 18 నుండి సెప్టెంబర్ 20 మధ్య జరిగే ఈ అమ్మకంలో స్మార్ట్‌ఫోన్ల మీదనే కాకుండా అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ వస్తువుల మీద అద్భుతమైన తగ్గింపు ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ అమ్మకంలో రెడ్‌మి 9i స్మార్ట్‌ఫోన్ యొక్క మొదటి అమ్మకాల మీద గొప్ప తగ్గింపు లాంచ్ ఆఫర్లను అందిస్తున్నాయి.


Click it and Unblock the Notifications