Home
News

షియోమి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ Redmi 9i లాంచ్!!! చాలా తక్కువ ధరలోనే...

షియోమి సంస్థ ఇండియాలో బడ్జెట్ ధరలో 4GB ర్యామ్ ఫీచర్లతో మరొక కొత్త స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. రెడ్‌మి 9i పేరుతో భారత్‌లో లాంచ్ అయిన ఈ ఫోన్ ప్రాథమికంగా గ్లోబల్ రెడ్‌మి 9A స్మార్ట్‌ఫోన్ యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ గా వస్తున్నది. షియోమి యొక్క తాజా ఈ బడ్జెట్ ఫోన్ వాటర్‌డ్రాప్ నాచ్ డిస్ప్లే, మీడియా టెక్ హెలియో G25 ప్రాసెసర్ చిప్‌సెట్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

షియోమి రెడ్‌మి 9i ధరల వివరాలు

షియోమి రెడ్‌మి 9i ధరల వివరాలు

చైనా కంపెనీ షియోమి తన తాజా ఫోన్ రెడ్‌మి 9i ను రెండు స్టోరేజ్ మోడళ్లలో విడుదల చేసింది. ఇందులో 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ .8,299 కాగా 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.9,299. ఈ రెడ్‌మి 9i బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ యొక్క మొదటి అమ్మకాలు ఇండియాలో సెప్టెంబర్ 18 న మధ్యాహ్నం 12:00 గంటలకు ఫ్లిప్‌కార్ట్, Mi హోమ్, మరియు Mi.కామ్ ద్వారా మొదలుకానున్నాయి. ఇది ఆఫ్‌లైన్ రిటైల్ దుకాణాల ద్వారా కూడా లభిస్తుంది.

షియోమి రెడ్‌మి 9i మీడియాటెక్ హెలియో G25 చిప్‌సెట్‌ స్పెసిఫికేషన్స్

షియోమి రెడ్‌మి 9i మీడియాటెక్ హెలియో G25 చిప్‌సెట్‌ స్పెసిఫికేషన్స్

రెడ్‌మి 9i స్మార్ట్‌ఫోన్ 6.53-అంగుళాల LCD డిస్‌ప్లేను హెచ్‌డి + రిజల్యూషన్ తో మరియు 20: 9 కారక నిష్పత్తితో వస్తుంది. ఈ ఫోన్ MIUI 12 వెర్షన్‌లోని ఆండ్రాయిడ్10 OS అవుట్-ఆఫ్-బాక్స్‌తో రన్ అవుతుంది. అలాగే ఈ ఫోన్ మీడియాటెక్ హెలియో G25 ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ను కలిగి ఉండి 4GB ర్యామ్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ కలిగి ఉండి మెమోరిని మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా విస్తరించడానికి వీలుగా ఉంటుంది.

రెడ్‌మి 9i కెమెరా సెటప్

రెడ్‌మి 9i కెమెరా సెటప్

రెడ్‌మి 9i స్మార్ట్‌ఫోన్ యొక్క ఇమేజింగ్ మరియు కెమెరా సెటప్ విషయానికి వస్తే ఫోన్ ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే రెడ్‌మి 9A ఫోన్ మాదిరిగానే వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ సెన్సార్ తో ఒకే ఒక కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఫింగర్ ప్రింట్ రీడర్ లేకుండా వస్తుంది. రెడ్‌మి 9i డ్యూయల్ సిమ్ స్లాట్, 4G వోల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ 5.0, GPS మరియు IR బ్లాస్టర్‌లకు మద్దతు ఇస్తుంది. అలాగే ఈ ఫోన్ 3.5mm ఆడియో జాక్‌కు మద్దతు ఇస్తుంది మరియు స్క్రీన్ కుడివైపు అంచున పవర్ బటన్లను కలిగి ఉంటుంది. 

Best Mobiles in India

English summary
Xiaomi Redmi 9i Budjet Smartphone Released in India: Price, Specs, Sale date and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X