Redmi 9i ధరల వివరాలు వచ్చేసాయి!! ఎంతో తెలుసా??

|

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి ఇండియాలో సెప్టెంబర్ 15 న రెడ్‌మి 9i పేరుతో బడ్జెట్ ధరలో కొత్తగా మరొక స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేస్తున్నది. ఇది ఈ నెల ప్రారంభంలో ఇండియాలో రూ.6,799 ధర వద్ద లాంచ్ అయిన రెడ్‌మి 9A యొక్క బీఫ్-అప్ వేరియంట్ అవ్వవచ్చు. రెడ్‌మి 9i తో షియోమి సంస్థ బడ్జెట్ ధరలోనే వినియోగదారులకు 4GB ర్యామ్‌ను అందించాలనుకుంటుంది. ఇండియాలో లాంచ్ కు ముందే దీని స్పెసిఫికేషన్స్ మరియు ధరల వివరాలు లీక్ అయ్యాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రెడ్‌మి 9i స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

రెడ్‌మి 9i స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

రెడ్‌మి 9i స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ ధరలో కనిష్టంగా 4GB ర్యామ్‌తో వస్తుందని కొన్ని లీక్ లు సూచిస్తున్నాయి. ప్రయోగానికి ముందు లీక్ అయిన సమాచారం ప్రకారం రెడ్‌మి 9i 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ రూ.7,999 ధర వద్ద లాంచ్ కానున్నది. ఈ నెల ప్రారంభంలో రెడ్‌మి 9A రెండు వేరియంట్‌లలో రూ.6,799 మరియు రూ .7,499 ధర వద్ద లాంచ్ అయ్యాయి.

 

Also Read: Huawei మేట్‌ప్యాడ్ T8 కొత్త టాబ్లెట్ లాంచ్!!! తక్కువ ధరలోనే...Also Read: Huawei మేట్‌ప్యాడ్ T8 కొత్త టాబ్లెట్ లాంచ్!!! తక్కువ ధరలోనే...

రెడ్‌మి 9i స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్
 

రెడ్‌మి 9i స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

రెడ్‌మి 9i స్మార్ట్‌ఫోన్ డాట్ డ్రాప్ స్క్రీన్, 4GB ర్యామ్, 5000mAh పెద్ద బ్యాటరీని కలిగి ఉండడమే కాకుండా MIUI 12 అవుట్-ఆఫ్-బాక్స్‌తో రన్ అవుతున్నట్లు షియోమి ఇండియా యొక్క ప్రత్యేకమైన మైక్రోసైట్ వెల్లడించింది. ఈ ఫోన్ మిడ్నైట్ బ్లాక్, సీ బ్లూ, నేచర్ గ్రీన్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రాబోయే షియోమి రెడ్‌మి 9i స్మార్ట్‌ఫోన్ ను Mi.కామ్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ పెద్ద డిస్ప్లేతో లభిస్తుంది. అలాగే ఇది 64GB ఇంటర్నల్ మెమొరిని కలిగి ఉండి మైక్రో SD కార్డ్ ఉపయోగించి మెమొరిని మరింత విస్తరించడానికి మద్దతును ఇస్తుంది. ఇప్పటికి విడుదలైన టీజర్ ప్రకారం Xiaomi Redmi 9i ఫోన్ గేమింగ్-సెంట్రిక్ ఫీచర్లతో రాబోతుందని సూచించింది.

రెడ్‌మి 9i స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ ఫీచర్స్

రెడ్‌మి 9i స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ ఫీచర్స్

రెడ్‌మి 9i స్మార్ట్‌ఫోన్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే ఇది రెడ్‌మి 9A యొక్క టియర్‌డ్రాప్ నాచ్ స్క్రీన్, భారీ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 10 ఆధారిత MIUI12 మరియు 6.4-ఇంచ్ పెద్ద డిస్‌ప్లే ఫీచర్లకు సమానంగా ఉంటాయి. ప్రస్తుతానికి ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా మరియు ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అందిస్తుందో లేదో మాకు తెలియదు. రెడ్‌మి 8A డ్యూయల్ ఫోన్ విజయవంతం కావడానికి హ్యాండ్‌సెట్‌లో డ్యూయల్ రియర్ కెమెరాలు ఉన్నట్లు మనం చూడవచ్చు.

షియోమి రెడ్‌మి 9,9A , 9 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్లు

షియోమి రెడ్‌మి 9,9A , 9 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్లు

ఇండియాలో షియోమి సంస్థ గత కొన్ని వారాలలో రెడ్‌మి 9, రెడ్‌మి 9A మరియు రెడ్‌మి 9 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్లను సరసమైన రూ .10,000 సెగ్మెంట్ ధరల లోపు విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌లు సరసమైన ధర ట్యాగ్‌లతో అద్భుతమైన గేమింగ్ ఫీచర్లను కలిగి ఉన్నాయి. షియోమి రెడ్‌మి 9i యొక్క అసలైన ధర వివరాలు, ఫీచర్స్ మరియు అమ్మకపు వివరాలు సెప్టెంబర్ 15 న మధ్యాహ్నం 12:00 గంటలకు లాంచ్ ఈవెంట్‌లో తెలపనున్నాయి.

Best Mobiles in India

English summary
Redmi 9i Price and Specifications Leaked ahead of Launch in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X