Redmi 9i Sale: బడ్జెట్ ధరలో రెడ్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్లలో బెస్ట్ ఛాయస్ ఇదే....
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి ఇండియాలో రూ.10,000 బడ్జెట్ ధర విభాగంలో రెడ్‌మి 9 సిరీస్ ఫోన్లను విడుదల చేస్తున్నది. దీనికి కొనసాగింపుగా అతి తక్కువ ధరలోనే కొత్తగా మరొక స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి 9i ని విడుదల చేసింది. కేవలం పరిమిత సంఖ్యలో ఫ్లాష్ పద్దతిలో లభించే ఈ ఫోన్ యొక్క అమ్మకాలు ఈ రోజు మధ్యాహ్నం 12PM గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, Mi హోమ్, మరియు Mi.కామ్ ద్వారా మొదలుకానున్నాయి. వాటర్‌డ్రాప్ నాచ్ డిస్ప్లే, మీడియా టెక్ హెలియో G25 ప్రాసెసర్ చిప్‌సెట్ వంటి ఫీచర్లను కలిగి ఉన్న ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

షియోమి రెడ్‌మి 9i ధరల వివరాలు
రెడ్‌మి 9i స్మార్ట్‌ఫోన్ ను ఇప్పుడు బడ్జెట్ ధరలో రెండు వేరు వేరు స్టోరేజ్ వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. ఇందులో 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ మోడల్ ను రూ.8,299 ధర వద్ద మరియు 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ను రూ.9,299 ధర వద్ద ఫ్లిప్‌కార్ట్ మరియు Mi.కామ్ ద్వారా ఈ రోజు మధ్యాహ్నం 12PM గంటల నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బజ్ క్రెడిట్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేసిన వారికి 5% వరకు తగ్గింపు లభిస్తుంది.

రెడ్‌మి 9i మీడియాటెక్ హెలియో G25 చిప్‌సెట్ ఫీచర్స్
రెడ్‌మి 9i స్మార్ట్‌ఫోన్ 6.53-అంగుళాల LCD హెచ్‌డి + డిస్‌ప్లేను 720x1,600 పిక్సెల్స్ రిజల్యూషన్ తో 1,500: 1 కాంట్రాస్ట్ రేషియో మరియు 20: 9 కారక నిష్పత్తితో వస్తుంది. ఈ ఫోన్ MIUI 12 వెర్షన్‌లోని ఆండ్రాయిడ్10 OS అవుట్-ఆఫ్-బాక్స్‌తో రన్ అవుతుంది. అలాగే ఈ ఫోన్ మీడియాటెక్ హెలియో G25 ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ను కలిగి ఉండి 4GB ర్యామ్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ కలిగి ఉండి మెమోరిని మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా విస్తరించడానికి వీలుగా ఉంటుంది.

రెడ్‌మి 9i ఫోన్ సింగల్ రియర్ కెమెరా సెటప్
రెడ్‌మి 9i స్మార్ట్‌ఫోన్ ఇమేజింగ్ మరియు కెమెరా సెటప్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ సెన్సార్ తో ఒకే ఒక కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఫింగర్ ప్రింట్ రీడర్ లేకుండా వస్తుంది. రెడ్‌మి 9i డ్యూయల్ సిమ్ స్లాట్, 4G వోల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ 5.0, GPS మరియు IR బ్లాస్టర్‌లకు మద్దతు ఇస్తుంది.

రెడ్‌మి 9i స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఎంపికలు
రెడ్‌మి 9i స్మార్ట్‌ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో VoWiFi, 4G, VoLTE, బ్లూటూత్ 5.0, GPS / A-GPS మరియు ఛార్జింగ్ కోసం మైక్రో- USB పోర్ట్ ఉన్నాయి. ఫోన్ 10W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. అలాగే ఈ ఫోన్ 3.5mm ఆడియో జాక్‌కు మద్దతు ఇస్తుంది మరియు స్క్రీన్ కుడివైపు అంచున పవర్ బటన్లను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








