Redmi 9i Sale: బడ్జెట్ ధరలో గేమింగ్ ఫీచర్లతో రెడ్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్ సేల్ నేడే....

|

షియోమి సంస్థ ఇండియాలో రెడ్‌మి 9 సిరీస్ లో భాగంగా గత వారంలో అతి తక్కువ ధరలోనే కొత్తగా మరొక స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి 9i ని విడుదల చేసింది. కేవలం పరిమిత సంఖ్యలో లభించే ఈ ఫోన్ యొక్క అమ్మకాలు ఈ రోజు మధ్యాహ్నం 12PM గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, Mi హోమ్, మరియు Mi.కామ్ ద్వారా మొదలుకానున్నాయి. వాటర్‌డ్రాప్ నాచ్ డిస్ప్లే, మీడియా టెక్ హెలియో G25 ప్రాసెసర్ చిప్‌సెట్‌ వంటి ఫీచర్లను కలిగి ఉన్న ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

షియోమి రెడ్‌మి 9i ధరల వివరాలు
 

షియోమి రెడ్‌మి 9i ధరల వివరాలు

రెడ్‌మి 9i స్మార్ట్‌ఫోన్ ను ఇండియాలో కేవలం రెండు స్టోరేజ్ మోడళ్లలో లభిస్తుంది. 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.8,299 కాగా 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.9,299. ఫ్లిప్‌కార్ట్ మరియు Mi.కామ్ ద్వారా కొనుగోలు అందుబాటులో ఉండే దీనిని ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బజ్ క్రెడిట్ కార్డు మీద కొనుగోలు చేసిన వారికి 5% వరకు తగ్గింపు లభిస్తుంది.

Also Read: Vi పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో రూ.125 MPL & రూ.200 జోమాటో విలువ గల ప్రయోజనాలు

రెడ్‌మి 9i LCD HD+ రిజల్యూషన్ డిస్‌ప్లే

రెడ్‌మి 9i LCD HD+ రిజల్యూషన్ డిస్‌ప్లే

రెడ్‌మి 9i స్మార్ట్‌ఫోన్ 6.53-అంగుళాల LCD డిస్‌ప్లేను హెచ్‌డి + రిజల్యూషన్ తో మరియు 20: 9 కారక నిష్పత్తితో వస్తుంది. ఈ ఫోన్ MIUI 12 వెర్షన్‌లోని ఆండ్రాయిడ్10 OS అవుట్-ఆఫ్-బాక్స్‌తో రన్ అవుతుంది. అలాగే ఈ ఫోన్ మీడియాటెక్ హెలియో G25 ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ను కలిగి ఉండి 4GB ర్యామ్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ కలిగి ఉండి మెమోరిని మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా విస్తరించడానికి వీలుగా ఉంటుంది.

రెడ్‌మి 9i IR బ్లాస్టర్‌ సపోర్ట్

రెడ్‌మి 9i IR బ్లాస్టర్‌ సపోర్ట్

రెడ్‌మి 9i స్మార్ట్‌ఫోన్ ఇమేజింగ్ మరియు కెమెరా సెటప్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ సెన్సార్ తో ఒకే ఒక కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఫింగర్ ప్రింట్ రీడర్ లేకుండా వస్తుంది. రెడ్‌మి 9i డ్యూయల్ సిమ్ స్లాట్, 4G వోల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ 5.0, GPS మరియు IR బ్లాస్టర్‌లకు మద్దతు ఇస్తుంది. అలాగే ఈ ఫోన్ 3.5mm ఆడియో జాక్‌కు మద్దతు ఇస్తుంది మరియు స్క్రీన్ కుడివైపు అంచున పవర్ బటన్లను కలిగి ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్ లో స్పీకర్లు, హెడ్ ఫోన్స్ మీద భారీ తగ్గింపు
 

ఫ్లిప్‌కార్ట్ లో స్పీకర్లు, హెడ్ ఫోన్స్ మీద భారీ తగ్గింపు

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ మొబైల్ హెడ్ ఫోన్స్ మరియు టీవీలకు సంబందించిన స్పీకర్ల కొనుగోలు మీద 60% వరకు తగ్గింపు లభిస్తుంది. ఇందులో JBL మరియు బోట్ కంపెనీలకు సంబందించిన స్పీకర్ల కొనుగోలు మీద భారీ తగ్గింపు లభిస్తుంది. ప్రస్తుతం బాగా పాపులర్ అయిన ట్రూ వైర్లెస్ ఎయిర్ బడ్స్ లను కూడా రూ.799 ప్రారంభ ధర వద్ద నుండి కొనుగోలు చెయవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Redmi 9i Smartphone Second Sale Start Today in India at 12PM via Flipkart and Mi.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X