300W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ లాంచ్ చేయనున్న Redmi ! 5 నిమిషాల్లో పూర్తి ఛార్జ్!
రెడ్ మీ అధికారికంగా తమ కొత్త ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ధృవీకరించింది. ఈ టెక్నాలజీ ద్వారా 300W ఇమ్మోర్టల్ సెకండ్ ఛార్జర్, కేవలం ఐదు నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేస్తుందని పేర్కొంది. ఛార్జింగ్ టెక్నాలజీకి సంబంధించిన సాంకేతిక అంశాలను చైనా ఫోన్ తయారీ కంపెనీ ఇంకా నిర్ధారించాల్సి ఉంది.
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లలో ఫాస్ట్ ఛార్జింగ్ అనేది అత్యంత ప్రాముఖ్యత పొందిన ఫీచర్, ఇది వినియోగదారులు తమ పరికరాలను సాధారణంగా కంటే చాలా వేగంగా ఛార్జ్ చేయడానికి అనుమతిస్తుంది. మార్కెట్లో ఉన్న అన్ని ఫోన్లు లేదా పరికరాలు, బ్రాండ్‌లు ఒకే రకమైన ఫాస్ట్ ఛార్జింగ్‌ని ఉపయోగించవు మరియు అన్ని ఛార్జర్‌లు వేరు వేరు విభిన్న ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి.

రెడ్ మీ యొక్క ఇటీవలి ప్రకటన ప్రకారం Weibo పోస్ట్ లో ఈ విధంగా పేర్కొన్నారు, తమ కొత్త ఛార్జింగ్ టెక్నాలజీకి "300W ఇమ్మోర్టల్ సెకండ్ ఛార్జర్" అని పేరు పెట్టారు, ఇది ప్రత్యామ్నాయ ఛార్జింగ్ టెక్నాలజీ అని తెలుస్తోంది. ఈ ఛార్జింగ్ టెక్నాలజీ గురించి మరింత సమాచారం కంపెనీ ద్వారా త్వరలోనే వెల్లడి చేయబడుతుంది.
కొత్తగా ధృవీకరించబడిన ఈ ఛార్జింగ్ టెక్నాలజీ 4,100mAh బ్యాటరీని 43 సెకన్లలో 10 శాతం, రెండు నిమిషాల 13 సెకన్లలో 50 శాతం మరియు ఐదు నిమిషాల్లో 100 శాతం ఛార్జ్ చేయగలదని కంపెనీ పేర్కొంది. ఇది పూర్తిగా కొత్త టెక్నాలజీ ఏమీ కాదని, రెడ్ మీ నోట్ 12 ప్రో ప్లస్ వేరియంట్‌లో ఉన్న ఛార్జింగ్ టెక్నాలజీ కి ఇది ఒక మార్పు అని కంపెనీ పేర్కొంది.
రెడ్ మీ నోట్ 12 డిస్కవరీ ఎడిషన్, చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది, ఇప్పటి వరకు కంపెనీ యొక్క వేగవంతమైన ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్ ఇదే. ఇది 210W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది మరియు దాదాపు 10 నిమిషాల్లో ఫోన్ ను పూర్తిగా ఛార్జ్ చేస్తుందని సమాచారం.
స్మార్ట్ ఫోన్ మార్కెట్ యొక్క పోటీదారులలో, రియల్ మీ GT నియో 5 ఈ సంవత్సరం ప్రారంభంలో 240W ఛార్జింగ్‌తో ప్రపంచంలోని మొట్టమొదటి అత్యధిక వాట్స్ కలిగిన ఫాస్ట్ చార్జర్ టెక్నాలజీ గా ఈ స్మార్ట్‌ఫోన్ ప్రకటించబడింది. ఇది USB-C పోర్ట్ సపోర్ట్ చేయగల వేగవంతమైన ఛార్జింగ్ స్పీడ్ అని పేర్కొంది. 4,600mAh బ్యాటరీ మద్దతు ఉన్న ఫోన్‌ను 10 నిమిషాలలోపు పూర్తిగా ఛార్జ్ చేస్తుంది. పరికరం 20V/12A అడాప్టర్‌తో వస్తుంది.
అయితే,ఇప్పుడు రెడ్ మీ ప్రకటించిన 300W చార్జర్ లాంచ్ అయితే అప్పుడు రెడ్ మీ బ్రాండ్ నే ప్రపంచంలో అత్యధిక ఫాస్ట్ చార్జర్ ను కలిగి ఉంటుంది. అలాగే రియల్ మీ యొక్క GT Neo 5 కూడా 5,000mAh బ్యాటరీతో 150W ఫాస్ట్ ఛార్జింగ్ వేరియంట్‌తో తో కూడా లాంచ్ అయింది. ఇది బాక్స్‌లో 20V/8A అడాప్టర్‌తో వస్తుంది. ఇటీవల షియోమీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెడ్ మీ నోట్ 12 స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను భారతదేశంలో విడుదల చేసింది. చాలా హైప్ చేయబడిన ఈ సిరీస్‌లో రెడ్‌మి నోట్ 12 5G, రెడ్‌మి నోట్ 12 ప్రో మరియు రెడ్‌మి నోట్ 12 ప్రో+ వేరియంట్ మోడల్‌లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications