రెడ్‌మి మొట్టమొదటి స్మార్ట్‌వాచ్‌ విడుదలైంది!! తక్కువ ధరలోనే

|

చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి యొక్క సబ్ బ్రాండ్ రెడ్‌మి ఎట్టకేలకు భారతదేశంలో తన యొక్క రెడ్‌మి వాచ్ గా పిలువబడే మొట్టమొదటి స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. స్మార్ట్‌వాచ్ మార్కెట్ లో రియల్‌మి వాచ్, అమాజ్‌ఫిట్ బిప్ యు ప్రోలకు వ్యతిరేకంగా ఈ వాచ్ లాంచ్ అయింది. 11 స్పోర్ట్ మోడ్స్, 24/7 హృదయ స్పందన ట్రాకింగ్, స్లీప్ ట్రాకింగ్, అంతర్నిర్మిత GPS, 5ATM నీటి నిరోధకత వంటి అద్భుతమైన ఫీచర్లతో లభించే రెడ్‌మి వాచ్‌ తో పాటుగా కంపెనీ తన రెడ్‌మి నోట్ 10S స్మార్ట్‌ఫోన్‌ను కూడా దేశంలో విడుదల చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

రెడ్‌మి స్మార్ట్‌వాచ్‌ ధరల వివరాలు

రెడ్‌మి స్మార్ట్‌వాచ్‌ ధరల వివరాలు

రెడ్‌మి యొక్క మొట్టమొదటి స్మార్ట్‌వాచ్‌ కేవలం 20mm ఏకైక ఆప్షన్‌లో మాత్రమే లభిస్తుంది. ఈ రెడ్‌మి వాచ్ యొక్క ధర 3,999 రూపాయలు. ఇది mi.కామ్, ఫ్లిప్‌కార్ట్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా అందుబాటులోకి రానున్నది. ఈ స్మార్ట్‌వాచ్‌ మే 25 నుండి మొదటిసారి అమ్మకానికి అందుబాటులోకి రానున్నది. ఇది ఐవరీ, బ్లాక్ మరియు బ్లూ అనే మూడు వాచ్ కేస్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

రెడ్‌మి స్మార్ట్‌వాచ్‌ స్పెసిఫికేషన్స్

రెడ్‌మి స్మార్ట్‌వాచ్‌ స్పెసిఫికేషన్స్

రెడ్‌మి వాచ్ 1.4-అంగుళాల TFT ఎల్‌సిడి డిస్‌ప్లేను 320 × 320 పిక్సెల్‌ల రిజల్యూషన్ తో మరియు 2.5D కర్వ్డ్ గ్లాస్‌తో కవర్ చేయబడి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 350 నిట్ల గరిష్ట ప్రకాశంతో కలిగి ఉంటుంది. స్మార్ట్‌వాచ్‌కు శక్తినిచ్చే ప్రాసెసర్‌, ర్యామ్, స్టోరేజ్ వంటి వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ఆన్బోర్డ్ సెన్సార్లలో PPG హార్ట్ రేట్ సెన్సార్, త్రీ-యాక్సిస్ యాక్సిలరేషన్ సెన్సార్, జియోమాగ్నెటిక్ సెన్సార్, బేరోమీటర్, గైరోస్కోప్ మరియు యాంబియంట్ లైట్ సెన్సార్ వంటివి ఉన్నాయి. కనెక్టివిటీ ఎంపికలలో GPS, గ్లోనాస్ మరియు బ్లూటూత్ 5.1 వంటివి ఉన్నాయి.

రెడ్‌మి స్మార్ట్‌వాచ్‌ స్పోర్ట్స్ మోడ్‌ల ఫీచర్స్
 

రెడ్‌మి స్మార్ట్‌వాచ్‌ స్పోర్ట్స్ మోడ్‌ల ఫీచర్స్

రెడ్‌మి యొక్క కొత్త వాచ్‌లో రన్నింగ్, హైకింగ్, వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, క్రికెట్ వంటి మరిన్ని 11 రకాల స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. ఆరోగ్యం మరియు సంరక్షణ ఫీచర్లలో 24/7 హార్ట్ రేట్ డిడెక్షన్, స్లీప్ ట్రాకింగ్, గైడెడ్ శ్వాస, వాయు పీడన గుర్తింపు, స్టెప్ కౌంటర్ వంటివి మరిన్ని ఉన్నాయి. ఇతర ఫీచర్లలో 200 కి పైగా వాచ్ ఫేసెస్, 5 ATM వాటర్ రెసిస్టెన్స్, మ్యూజిక్ కంట్రోల్, అలారం, వెదర్ మరియు యాప్ నోటిఫికేషన్లు ఉన్నాయి. రెడ్‌మి వాచ్ ఒకే ఛార్జీతో 10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటుంది. స్మార్ట్ వాచ్‌ను రెండు గంటల్లోపు పూర్తిగా ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది.

రెడ్‌మి నోట్ 10s ధరల వివరాలు

రెడ్‌మి నోట్ 10s ధరల వివరాలు

రెడ్‌మి నోట్ 10s ఫోన్ ఇండియాలో రెండు వేరియంట్‌లలో విడుదలైంది. ఇందులో 6GB ర్యామ్ / 64GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ.14,999 కాగా 6GB ర్యామ్ / 128GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ.15,999. ఇది మే 18 నుండి mi.కామ్, అమెజాన్, ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా అందుబాటులోకి రానున్నది . ఈ ఫోన్ ఓషన్ బ్లూ, ఒనిక్స్ గ్రే మరియు పెబుల్ వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Redmi First Smartwatch Released in India: Price, Specs, Sale Date Features and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X