Just In
- 8 min ago
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- 1 hr ago
వివో X90 ప్రో స్మార్ట్ ఫోన్లు ఇండియాలో లాంచ్ అయింది! ధర ,స్పెసిఫికేషన్‌లు!
- 6 hrs ago
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు
- 19 hrs ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
Don't Miss
- Sports
Asia Cup 2023 : ఆసియా కప్ వేదిక మార్పుపై మీటింగ్.. గ్యారంటీ అంటున్న బీసీసీఐ!
- News
ఎన్టీఆర్ మృతిపై కేంద్ర,రాష్ట్రాల దర్యాప్తు-వివేకా కేసులో చంద్రబాబు,లోకేష్ నీ-కొడాలి నాని డిమాండ్
- Lifestyle
మీ వైఫ్ మిమ్మల్ని లవ్ చేస్తుందో లేదోనని డౌటా? ఇలా గుర్తించండి
- Finance
Vijaya Dairy: విజయ డైరీ నుంచి మరో 100 కొత్త ఉత్పత్తులు..
- Movies
Butta Bomma Review తెలుగుదనం ఉట్టిపడే బుట్టబొమ్మ.. ప్లస్, మైనస్‌లు ఏమిటంటే?
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Redmi K సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఇండియా లాంచ్ ప్రకటన!! ఫీచర్స్ లీక్...
భారతదేశంలోని స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనా యొక్క స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ షియోమి మరియు దాని యొక్క సబ్-బ్రాండ్ లకు మంచి మార్కెట్ కలిగి ఉంది. ఈ కంపెనీ మంచి అప్ డేట్ ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్‌లను తరచుగా మార్కెట్లో విడుదల చేస్తూనే ఉంది. భారతదేశంలో త్వరలో రెడ్‌మి K-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. "Redmi K IsBack" అని పేర్కొంటూ కంపెనీ చేసిన ట్వీట్ ద్వారా ఈ విషయం ధృవీకరించబడింది.

భారతదేశంలో రెడ్‌మి కంపెనీ ఇప్పుడు రెడ్‌మి K50iని లాంచ్ చేయడానికి సిద్ధమవుతోందని ఊహించవచ్చు. ఇటీవల దీనిని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కూడా గుర్తించబడింది. మేలో చైనాలో ప్రారంభించబడిన రెడ్‌మి నోట్ 11T ప్రో యొక్క రీబ్రాండెడ్ వెర్షన్‌గా రెడ్‌మి K50i కొత్త స్మార్ట్‌ఫోన్ లభిస్తుందని సూచించబడింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రెడ్‌మి కంపెనీ భారతదేశంలో K సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తున్నట్లు ట్వీట్ ద్వారా టీజ్ చేసింది. కంపెనీ యొక్క ట్విట్టర్ అకౌంట్ లో విడుదల చేసిన టీజర్‌లో "రెడ్‌మి K ఈజ్ బ్యాక్" అని క్యాప్షన్ ఉంది. ఇది భారతదేశంలో సరికొత్త K సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి కంపెనీ సన్నద్ధమవుతోందని సూచిస్తుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో మొదటిసారి కనిపించిన తరువాత ఇప్పుడు కంపెనీ యొక్క టీస్ తో భారతదేశంలో లాంచ్ యొక్క సమయం ఆసన్నమవుతున్నట్లు సూచిస్తుంది. ఇది మాత్రమే కాకుండా రాబోయే రెడ్‌మి K50i స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్‌లు కూడా ఇటీవల ఆన్‌లైన్‌లో కనిపించాయి.

రెడ్‌మి K50i స్పెసిఫికేషన్‌లు (అంచనా)
రెడ్‌మి K50i స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్‌ల వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఈ వివరాల ప్రకారం ఇది 144Hz రిఫ్రెష్ రేట్ మరియు డాల్బీ విజన్ సపోర్ట్‌తో 6.6-అంగుళాల ఫుల్-HD+ IPS డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 650 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ని కలిగి ఉన్నట్లు నివేదించబడింది. అలాగే ఇది హుడ్ కింద ఆక్టా-కోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 8100 SoC ద్వారా రన్ అవుతూ 8GB RAMతో జతచేయబడి వస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లోని ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు 8- మరియు 2-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ఫోన్ ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉందని చూపుతున్నాయి.

రెడ్‌మి K50i స్మార్ట్‌ఫోన్ స్టాండర్డ్‌గా 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ ఫోన్‌లో డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో కూడిన స్టీరియో స్పీకర్‌లు మరియు డెడికేటెడ్ హెడ్‌ఫోన్ జాక్‌లు ఉన్నాయని నివేదించబడింది. రెడ్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో MIUI 13ని ఆఫర్ చేస్తుందని చెప్పబడింది. టిప్‌స్టర్ ప్రకారం ఈ మోడల్ 67W వరకు ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 5,080mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. చివరిగా ఇది 163.6x74.3x8.8mm కొలతల పరిమాణంలో 200 గ్రాముల బరువుతో ఉంటుంది.

రెడ్‌మీ 10, రెడ్‌మి నోట్ 10s ధరల తగ్గింపు
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు షియోమి ఇండియాలో మార్చిలో విడుదల చేసిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 10 యొక్క ధరలు ఇటీవల తగ్గించింది. 4GB RAM వేరియంట్ రూ.1,000 ధరను తగ్గించడంతో ఇప్పుడు రూ.9,999 ధర వద్ద అందుబాటులో ఉంది. మరోవైపు 6GB RAM వేరియంట్ ఎంపిక మీద రూ.500 తగ్గింపును అందుకొని వినియోగదారులకు రూ.12,499 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అలాగే రెడ్‌మి నోట్ 10s ఫోన్ మీద రూ.2000 వరకు ధర తగ్గింపు అందుకున్నది. ఇప్పుడు 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ బేస్ వేరియంట్ రూ.12,999 ధర వద్ద మరియు 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.14,999 ధరల వద్ద లభిస్తుంది.

రెడ్‌మీ 10 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్
రెడ్‌మీ 10 స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ -ఆధారిత MIUI 12.5పై రన్ అవుతుంది. అలాగే ఇది 20:9 యాస్పెక్ట్ రేషియో మరియు వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌తో 6.53-అంగుళాల HD+ (720x1,600 పిక్సెల్‌లు) IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 SoC ప్రొసెసర్ ద్వారా శక్తిని పొందుతూ గరిష్టంగా 6GB RAMతో జతచేయబడి వస్తుంది. రెడ్‌మీ 10 స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుకభాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ని కలిగి ఉంటుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా మరియు f/2.2 ఎపర్చరుతో 2-మెగాపిక్సెల్ కెమెరాను LED ఫ్లాష్ తో కలిగి ఉంటుంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ఫోన్ ముందు భాగంలో f/2.2 లెన్స్‌తో 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. ఇది 128GB వరకు స్టోరేజ్ తో లభిస్తుంది. ఇందులోని ప్రత్యేక మైక్రో SD కార్డ్ స్లాట్‌ను ఉపయోగించి మెమొరీని 512GB వరకు విస్తరించడానికి మద్దతును ఇస్తుంది.

రెడ్‌మి నోట్ 10s స్పెసిఫికేషన్స్
రెడ్‌మి నోట్ 10s యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 ఆధారిత MIUI 12.5 పై తో రన్ అవుతువుంది. ఇది HDR-10 మద్దతు మరియు TÜV రీన్‌ల్యాండ్ తో 6.43-అంగుళాల ఫుల్-HD + సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది బ్లూ లైట్ సర్టిఫికేషన్ తో వస్తుంది. అలాగే ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732 జి SoC చేత శక్తినిస్తుంది, దీనితో పాటు అడ్రినో 618 జిపియు మరియు 8 జిబి వరకు LPDDR4x ర్యామ్ ఉన్నాయి. ఆప్టిక్స్ విషయానికొస్తే ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ఎఫ్ / 1.79 లెన్స్ తో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ఎఫ్ / 2.2 అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ తో 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, ఎఫ్ / 2.4 ఎపర్చరుతో 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు ఎఫ్ / 2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు ప్యాక్ చేయబడి ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందుభాగంలో ఎఫ్ / 2.45 ఎపర్చర్‌తో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కెమెరాను పంచ్-హోల్ కటౌట్‌లో కేంద్రీకృతమై ప్యాక్ చేయబడి ఉంటుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470