Home
News

Redmi K50 లైనప్‌ లాంచ్ లో గేమింగ్ ఎడిషన్ త్వరలో రానున్నది!! ఫీచర్స్ ఇవిగో...

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ Xiaomi యొక్క యాజమాన్యంలోని రెడ్‌మీ బ్రాండ్ కొత్తగా రెడ్‌మి K50 లైనప్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇందులో రెడ్‌మి K50, రెడ్‌మి K50 గేమింగ్ ఎడిషన్, రెడ్‌మి K50 ప్రో మరియు రెడ్‌మి K50 ప్రో+ అనే నాలుగు హ్యాండ్‌సెట్‌లు ఉంటాయి. ఈ లైనప్ కోసం అధికారిక విడుదల తేదీకి సంబంధించిన వివరాల సమాచారంను ప్రకటించలేదు. అయితే రెడ్‌మి జనరల్ మేనేజర్ లు వీబింగ్ రాబోయే లాంచ్ ఈవెంట్‌ను టీజ్ చేయడానికి మరియు వారి అనుచరులతో ఇంటరాక్ట్ చేయడానికి ఇటీవల Weiboకి వెళ్లారు. పరస్పర చర్య సమయంలో రెడ్‌మి K50 గేమింగ్ ఎడిషన్ విడుదలైన తర్వాతనే రెడ్‌మి కె50 ప్రో+ లాంచ్ అవుతుందని వీబింగ్ సూచించింది. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Weibing

Weibing అధికారిక అకౌంట్ ద్వారా Weiboలో భాగస్వామ్యం చేసిన పోస్ట్ యొక్క సమాచారం ప్రకారం డైమెస్నిటీ 9000 SoC వేరియంట్ విడుదల తేదీకి సంబందించిన వివరాలు తెలపలేదు కానీ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1-పవర్డ్ హ్యాండ్‌సెట్ ముందుగా మార్కెట్‌లోకి వస్తుందని బదులిచ్చారు. రెడ్‌మి K50 గేమింగ్ ఎడిషన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్‌సెట్‌తో ప్యాక్ చేస్తుందని ఇటీవలి నివేదికలు సూచిస్తుంది. మరోవైపు రెడ్‌మి K50 Pro+లో డైమెన్సిటీ 9000 SoCని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. కాబట్టి రెడ్‌మి K50 లైనప్ నుండి రెండు హ్యాండ్‌సెట్‌ల విడుదల క్రమాన్ని Weibing ధృవీకరించినట్లు తెలుస్తోంది.

రెడ్‌మి K50 గేమింగ్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

రెడ్‌మి K50 గేమింగ్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

ఇటీవల విడుదలైన నివేదికల ప్రకారం రెడ్‌మి K50 గేమింగ్ ఎడిషన్ మొబైల్ 6.67-అంగుళాల Huaxing ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది Qualcomm యొక్క తాజా ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 SoCని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్‌లో డ్యూయల్ VC కూలింగ్ సిస్టమ్ మరియు గేమింగ్ షోల్డర్ ట్రిగ్గర్స్ వంటి అనేక గేమింగ్-ఆధారిత ఫీచర్‌లు ఉన్నాయని గట్టిగా భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 4,700mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

కెమెరా సెటప్

ఫోన్‌లో 48-మెగాపిక్సెల్ లేదా 64-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉందని చెప్పబడింది. అదనంగా, వెనుక కెమెరా సెటప్ 13-మెగాపిక్సెల్ మరియు 2-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌లను కలిగి ఉంటుంది. ముందు భాగంలో, ఇది 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

షియోమి 11T ప్రో 5G

షియోమి స్మార్ట్‌ఫోన్ సంస్థ ఇటీవల భారతదేశంలో షియోమి 11T ప్రో 5G హ్యాండ్‌సెట్‌ను 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ రూ.39,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్ రూ.41,999, చివరిగా టాప్-ఆఫ్-ది-లైన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్ రూ.43,999 ధరల వద్ద లాంచ్ చేసింది. షియోమి యొక్క ఈ కొత్త ఫోన్ (అకా హైపర్‌ఫోన్) 120Hz AMOLED డిస్‌ప్లే మరియు 120W ఫాస్ట్ ఛార్జింగ్‌ వంటి ఫీచర్లను కలిగి ఉండి ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888 SoC ద్వారా శక్తిని పొందుతుంది. షియోమి 11T ప్రో 5G యొక్క ఇతర ముఖ్యాంశాలలో హర్మాన్ కార్డాన్ ట్యూన్ చేసిన స్టీరియో స్పీకర్లు మరియు డాల్బీ అట్మోస్, ట్రిపుల్ రియర్ కెమెరా మరియు 5G సపోర్ట్ వంటివి చాలానే ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Redmi K50 Lineup Gaming Edition Expected to Launch First: Here are Leaked Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X