Home
News

Redmi K70 Ultra డిజైన్ లీక్ అయింది! లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు

షియోమీ సంస్థ నుంచి Redmi K70 Ultra స్మార్ట్‌ఫోన్ ఈ నెలాఖరులో చైనాలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ ఫోన్ గురించి షియోమీ సబ్-బ్రాండ్, Weibo పోస్ట్ ద్వారా స్వదేశంలో కొత్త Redmi K-సిరీస్ స్మార్ట్‌ఫోన్ రాకను ధృవీకరించింది. కంపెనీ చైనీస్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో స్మార్ట్‌ఫోన్ వెనుక ప్యానెల్‌ డిజైన్ ను టీజ్ చేస్తూ పోస్టర్‌లను కూడా పంచుకుంది.

Redmi K70 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సార్ ఉంటుంది. Xiaomi మిక్స్ ఫోల్డ్ 4 మరియు Xiaomi మిక్స్ ఫ్లిప్‌ ఫోన్లను కూడా అదే లాంచ్ ఈవెంట్‌లో లాంచ్ చేయడానికి సంస్థ సన్నాహాలు చేస్తూ ఉంది.

Redmi K70 Ultra launch

Redmi K70 Ultra అధికారిక టీజర్ ఫోటోలు విడుదలయ్యాయి
రెడ్‌మి K70 అల్ట్రా ఎడిషన్ జూలైలో అంటే ఈ నెలలోనే చైనాలో లాంచ్ చేయబడుతుందని కంపెనీ Weibo లో ప్రకటించింది. బ్రాండ్, ఫోన్ యొక్క ఐస్ గ్లాస్ కలర్ వేరియంట్‌ను దాని వంపు అంచులు మరియు గ్లాస్ బ్యాక్ కవర్‌ను టీజ్ చేసింది. ఇది మెటల్ మిడిల్ ఫ్రేమ్‌ను కలిగి ఉన్నట్లు నిర్ధారించబడింది.

రాబోయే ఫోన్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కు మద్దతు ఇచ్చే 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంటుందని అధికారిక చిత్రాలు సూచిస్తున్నాయి.

ఈ టీజర్‌ లో రెడ్‌మి K70 అల్ట్రా ను కనిష్ట బెజెల్స్‌తో 1.5K AMOLED స్క్రీన్‌ను మరియు 144Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 3,840Hz హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్ మరియు యూనిఫైడ్ DC డిమ్మింగ్‌ని అందజేస్తుందని ప్రచారం చేయబడింది. ఇది మసక వెలుతురులో మినుకుమినుకుమనే స్థాయిని తగ్గిస్తుంది మరియు ఫుట్‌బాల్ చూడటానికి మరియు రాత్రి గేమ్ లు ఆడేందుకు కంటికి రక్షణను అందిస్తుంది.

అయితే, Redmi K70 Ultra స్మార్ట్‌ఫోన్ యొక్క ఖచ్చితమైన ప్రారంభ తేదీని వెల్లడించలేదు. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 9300+ SoC ప్రాసెసర్ లో పనిచేస్తుందని భావిస్తున్నారు.

Xiaomi Mix Fold 4, Xiaomi Mix Flip ఫోన్లు కూడా లాంచ్ కాబోతున్నాయి
ఈ రెడ్‌మి K70 అల్ట్రా ఫోన్ తో పాటుగా Xiaomi Mix Fold 4, Xiaomi Mix Flip కూడా లాంచ్ కాబోతున్నాయి. ఈవెంట్ తేదీ మరియు సమయాన్ని టీజర్ లో వెల్లడించారు. ప్రచార చిత్రాన్ని పోస్ట్ చేసారు. Mi బ్యాండ్ 9 తో పాటు చైనాలో జూలై 18న ఈ హ్యాండ్‌సెట్‌లు లాంచ్ అవుతాయని లీక్ అయింది.

షియోమీ ఈ వారం ప్రారంభంలో మిక్స్ ఫ్లిప్ మిక్స్ ఫోల్డ్ 4తో పాటు జూలైలో లాంచ్ చేయబోతున్నట్లు ధృవీకరించింది. బీజింగ్‌లోని చాంగ్‌పింగ్‌లోని కొత్త షియోమీ స్మార్ట్ ఫ్యాక్టరీ నుండి రాబోతున్న మొదటి పరికరాలు ఇవి. ఇవి చైనా కాకుండా ఇతర ప్రపంచ మార్కెట్లలో కూడా లాంచ్ అవుతాయని భావిస్తున్నారు. Xiaomi మిక్స్ ఫోల్డ్ 2 మరియు మిక్స్ ఫోల్డ్ 3 చైనాలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi K70 Ultra Confirmed To Launch July 18 In China. Design Teaser Revealed, Expected Specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X