లీక్ అయిన Redmi Note 10 సిరీస్ ఫోన్ల వివరాలు ! తెలుసుకోండి ?
రెడ్‌మి నోట్ 9 సిరీస్‌ను భారత్‌లో విడుదల చేసి దాదాపు ఏడాది అయ్యింది మరియు ఇప్పటికే రాబోయే కొత్త మోడళ్ల పై అంచనాలు పెరుగుతున్నాయి. రెడీమి నోట్ 9 కొనసాగింపు గా రెడ్‌మి నోట్ 10 సిరీస్‌గా వస్తారని, గత కొన్ని వారాల్లో వివిధ ధృవీకరణ సంస్థలనుంచి నివేదికలు వెలువడ్డాయి. ఇప్పుడు, కొత్తగా లీక్ అయిన వివరాలలో భారత దేశంలో విడుదలయ్యే మోడళ్ల కాన్ఫిగరేషన్‌తో పాటు కలర్ వేరియంట్‌లను కూడా వెల్లడించింది.

ఈ లీక్ అయిన వివరాలు ప్రకారం రెండు రెడ్‌మి నోట్ 10 మోడళ్లు భారతదేశంలో ప్రకటించబడతాయి అవి ప్రామాణిక రెడ్‌మి నోట్ 10 మరియు రెడ్‌మి నోట్ 10 ప్రో. వీటితో పాటు షియోమీ నుంచి ఇతర మోడళ్లు తరువాత వస్తాయని మనము ఆశించవచ్చు.

రెడ్‌మి నోట్ 10 ప్రో
లీక్ అయిన వివరాల ప్రకారం, రెడ్‌మి నోట్ 10 ప్రో రెండు ర్యామ్ వేరియంట్లలో మరియు మూడు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. బేస్ కాన్ఫిగరేషన్‌లో 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉంటుంది. రెండవ 6 జిబి ర్యామ్ వేరియంట్లో 128 జిబి స్టోరేజ్ ఉంటుంది, చివరిది 8 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ ఉంటుంది.షియోమి ఇండియా ఈ ఫోన్‌ను కాంస్య, నీలం మరియు గ్రే అనే మూడు కలర్ వేరియంట్ లో అందించనుంది. కనీసం మరిన్ని రంగులు ప్రకటించాలని మేము కోరుకుంటున్నాము

రెడ్‌మి నోట్ 10
రెడ్‌మి నోట్ 10 రెండు కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. బేస్ కాన్ఫిగరేషన్‌లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉండగా, రెండవ కాన్ఫిగరేషన్‌లో 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉంటుంది. భారతదేశంలో విక్రయించే రెడ్‌మి నోట్ 9 మూడు కాన్ఫిగరేషన్లలో వచ్చినందున, మనము మూడవ కాన్ఫిగరేషన్‌ను కూడా ఆశించవచ్చు. మరియు వైట్, గ్రీన్, గ్రే - ఫోన్ మూడు రంగు ఎంపికలలో వస్తుంది - అయితే మరిన్ని కలర్ ఆప్షన్స్ తరువాత ప్రకటించబడతాయి.ఈ నోట్ 10 సిరీస్ లోని రెండు ఫోన్లు ఫిబ్రవరిలో దేశంలో లాంచ్ అవుతాయి. ఇతర మార్కెట్లు తరువాత మరియు వేర్వేరు పేర్లతో లేదా వేర్వేరు స్పెసిఫికేషన్లతో విడుదల చేయవచ్చు.
గమనిక : ఫోటోలు రెప్రెసెంటేషనల్ మాత్రమే


Click it and Unblock the Notifications








