Redmi Note 10 Pro మొదటి సేల్ నేడే!! రూ.5000 తగ్గింపుతో పొందే అవకాశం...
ఇండియాలో ఇటీవల రెడ్‌మి నోట్ 10 మరియు రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్‌తో పాటు లాంచ్ అయిన రెడ్‌మి నోట్ 10 ప్రో స్మార్ట్ ఫోన్ యొక్క అమ్మకాలు ఈరోజు తొలిసారిగా అమెజాన్ మరియు షియోమి సంస్థ యొక్క వెబ్ సైట్ లో ప్రారంభం కానున్నాయి. సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, క్వాడ్ రియర్ కెమెరా సెటప్, పంచ్-హోల్ డిస్ప్లే డిజైన్, మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వంటి ఫీచర్లను కలిగి ఉండి ఇతర ముఖ్యమైన ఫీచర్లలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732 GSoC, 8GB RAM మరియు 64 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ లతో రియల్‌మి నార్జో 30 ప్రో మరియు శామ్‌సంగ్ గెలాక్సీ F41 లతో పోటీపడుతున్న దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రెడ్‌మి నోట్ 10 ప్రో ధరల వివరాలు
ఇండియాలో రెడ్‌మి నోట్ 10 ప్రో మూడు వేరియంట్‌లలో విడుదల అయింది. ఇందులో 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.15,999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.16,999 కాగా టాప్ ఎండ్ మోడల్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఆప్షన్ యొక్క ధర రూ.18,999. దీనిని ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి అమెజాన్, Mi.కామ్, Mi హోమ్ మరియు Mi దుకాణాల ద్వారా డార్క్ నైట్, గ్లాసియర్ బ్లూ మరియు వింటేజ్ బ్రోన్స్ కలర్ లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

రెడ్‌మి నోట్ 10 ప్రో లాంచ్ ఆఫర్స్
రెడ్‌మి నోట్ 10 ప్రో ఫోన్ యొక్క లాంచ్ ఆఫర్ల విషయానికొస్తే ఇది నేడు అంటే మార్చి 17 మధ్యాహ్నం 12PM ల నుండి అమెజాన్, Mi.కామ్, Mi హోమ్ స్టోర్స్ మరియు ఆఫ్‌లైన్ రిటైల్ భాగస్వాముల ద్వారా అమ్మకానికి రానున్నది. లాంచ్ ఆఫర్‌లలో భాగంగా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు యొక్క EMI లావాదేవీల మీద రూ.1000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. అలాగే బ్యాంక్ అఫ్ బరోడా క్రెడిట్ కార్డు EMI లావాదేవీల మీద రూ.1,500 తక్షణ తగ్గింపు లభిస్తుంది. అలాగే మోబిక్విక్ ద్వారా చేసిన కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ.5000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

రెడ్‌మి నోట్ 10 ప్రో స్పెసిఫికేషన్స్
రెడ్‌మి నోట్ 10 ప్రో యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 ఆధారిత MIUI 12 పై తో రన్ అవుతువుంది. ఇది HDR-10 మద్దతు మరియు TÜV రీన్‌ల్యాండ్ తో 6.67-అంగుళాల ఫుల్-HD + సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది బ్లూ లైట్ సర్టిఫికేషన్ తో వస్తుంది. అలాగే ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732 జి SoC చేత శక్తినిస్తుంది, దీనితో పాటు అడ్రినో 618 జిపియు మరియు 8 జిబి వరకు LPDDR4x ర్యామ్ ఉన్నాయి. ఆప్టిక్స్ విషయానికొస్తే ఫోన్ వెనుక భాగంలో గల క్వాడ్ రియర్ కెమెరా సెటప్ లో 64 మెగాపిక్సెల్ ప్రాధమిక శామ్‌సంగ్ ISOCELL GW3 సెన్సార్‌తో పాటు 5 మెగాపిక్సెల్ సూపర్ మాక్రో షూటర్‌తో పాటు 2x జూమ్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్- యాంగిల్ షూటర్ మరియు 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్ కూడా ఉంది.

రెడ్‌మి నోట్ 10 ప్రో ఫీచర్స్
రెడ్‌మి నోట్ 10 ప్రో యొక్క స్టోరేజ్ మరియు ఇతర ఫీచర్ల విషయానికొస్తే ఇది 128GB వరకు UFS 2.2 స్టోరేజ్ ను కలిగి ఉంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ ప్రత్యేకమైన స్లాట్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించవచ్చు. కనెక్టివిటీ ఎంపికలలో 4G VoLTE, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఇన్‌ఫ్రారెడ్, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. ఈ ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. అలాగే ఇది 360-డిగ్రీల యాంబియంట్ లైట్ సెన్సార్ను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








