Home
News

Redmi Note 10 Pro Max మొదటి సేల్ ప్రారంభం!! రూ.10,000 జియో ప్రయోజనాలతో పొందే అవకాశం...

రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ స్మార్ట్ ఫోన్ యొక్క అమ్మకాలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి మొదటిసారి మొదలయ్యాయి. బడ్జెట్-ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు రెడ్‌మి నోట్ 10 మరియు రెడ్‌మి నోట్ 10 ప్రోతో పాటు ఈ ఫోన్ ఇటీవల లాంచ్ అయింది. ఈ రెండూ కూడా గత రెండు రోజులలో మొదటిసారి అమ్మకానికి వచ్చాయి. అయితే రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ వేరియంట్ మిగతా రెండు మోడళ్ల కంటే కొన్ని మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ కెమెరా ఫీచర్లను కలిగి ఉండి మూడు కలర్ ఆప్షన్లలో లభించే ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ ధరల వివరాలు

రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ ధరల వివరాలు

రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో మూడు వేరియంట్‌లలో విడుదల అయింది. ఇందులో 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ.18,999 కాగా 6GB ర్యామ్ + 128GB వేరియంట్‌ ధర రూ.19,999 కాగా చివరిది 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్‌ యొక్క ధర 21,999 రూపాయలు. ఈ స్మార్ట్ఫోన్ డార్క్ నైట్, బ్లూ మరియు వింటేజ్ బ్రోన్స్ కలర్ వేరియంట్ లలో లభిస్తుంది. దీనిని Mi.కామ్, అమెజాన్, Mi హోమ్ స్టోర్స్ మరియు ఆఫ్‌లైన్ రిటైలర్లలో మధ్యాహ్నం 12 గంటల నుండి కొనుగోలు చేయవచ్చు.

రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ లాంచ్ ఆఫర్స్

రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ లాంచ్ ఆఫర్స్

రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ స్మార్ట్ ఫోన్ యొక్క అమెజాన్ మరియు Mi.కామ్ కొనుగోలు మీద ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులు EMI లావాదేవీలపై రూ.1,500 తక్షణ తగ్గింపు లభిస్తుంది. అలాగే Mi.కామ్ లో మోబిక్విక్ పేమెంట్ లతో రూ.600 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అలాగే రూ. 349 ప్లాన్ మరియు రూ.10,000 వరకు జియో యొక్క ప్రయోజనాలను పొందవచ్చు.

రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ స్పెసిఫికేషన్స్

రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ స్పెసిఫికేషన్స్

రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 ఆధారిత MIUI 12 తో రన్ అవుతుంది. ఇది 6.67-అంగుళాల ఫుల్-హెచ్‌డి + సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే HDR-10 సపోర్ట్, 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో వస్తుంది. ఇది TÜV రీన్‌ల్యాండ్ లైట్ బ్లూ లైట్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉండి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ను కలిగి ఉంటుంది. అలాగే ఇది 8GB LPDDR4x RAM తో మరియు ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 732G SoC చేత జతచేయబడి ఉంది.

రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ కెమెరా సెటప్‌

రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ కెమెరా సెటప్‌

రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ స్మార్ట్ ఫోన్ యొక్క ఫోటోగ్రఫి విషయానికి వస్తే వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 108 మెగాపిక్సెల్ శామ్‌సంగ్ HM2 ప్రైమరీ సెన్సార్, 5 మెగాపిక్సెల్ సూపర్ మాక్రో షూటర్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ షూటర్ మరియు 2 -మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు కలిగి ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెన్సార్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్

రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ ఫోన్ యొక్క స్టోరేజ్ విషయానికి వస్తే ఇది 128GB వరకు ఇంటర్నల్ UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G VoLTE, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఇన్‌ఫ్రారెడ్ (IR), యుఎస్‌బి టైప్-సి మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. అలాగే ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,020mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. చివరగా ఇది 164.5x76.15x8.1mm కొలతల పరిమాణంతో 192 గ్రాముల బరువుతో వస్తుంది.

Best Mobiles in India

English summary
Redmi Note 10 Pro Max First Sale Live on Amazon and Mi.com: Price, Specs, Sale Offers and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X