Redmi Note 10 Pro Max ఫ్లాష్ సేల్ లో ఊహించని డిస్కౌంట్ ఆఫర్స్!! మిస్ అవ్వకండి...
రెడ్‌మి నోట్ సిరీస్ లోని టాప్-ఎండ్ స్మార్ట్‌ఫోన్ మోడల్ 10 ప్రో మాక్స్ హ్యాండ్‌సెట్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లాష్ సేల్‌లో అందుబాటులోకి రానున్నది. ఇది సంస్థ యొక్క సొంత వెబ్ సైట్ Mi.com తో పాటు ప్రముఖ ఇ-కామర్స్ సైట్ అమెజాన్‌లో అందుబాటులో ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు అమెజాన్‌లో లభించే క్యాష్ బ్యాక్ ఆఫర్లతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ ధరల వివరాలు
భారతదేశంలో రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ మూడు వేరియంట్‌లలో విడుదలైంది. ఇందులో 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999 కాగా 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ యొక్క ధర రూ.19,999. చివరిగా 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర 21,999 రూపాయలు. ఇది డార్క్ నైట్, బ్లూ మరియు బ్రోన్జ్ కలర్ లలో లభిస్తాయి. ఈ రోజు అమ్మకంలో భాగంగా కొనుగోలుదారులకు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులపై రూ.1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. వీటితో పాటుగా ఆఫర్‌లో నో-కాస్ట్ EMI లావాదేవీలు కూడా అందుబాటులో ఉన్నాయి.

రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ స్పెసిఫికేషన్స్
రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 ఆధారిత MIUI 12 తో రన్ అవుతుంది. ఇది 6.67-అంగుళాల ఫుల్-హెచ్‌డి + సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే HDR-10 సపోర్ట్, 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో వస్తుంది. ఇది TÜV రీన్‌ల్యాండ్ లైట్ బ్లూ లైట్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉండి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ను కలిగి ఉంటుంది. అలాగే ఇది 8GB LPDDR4x RAM తో మరియు ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 732G SoC చేత జతచేయబడి ఉంది.

రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ 108MP కెమెరా ఫీచర్స్
రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ స్మార్ట్ ఫోన్ యొక్క ఫోటోగ్రఫి విషయానికి వస్తే వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 108 మెగాపిక్సెల్ శామ్‌సంగ్ HM2 ప్రైమరీ సెన్సార్, 5 మెగాపిక్సెల్ సూపర్ మాక్రో షూటర్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ షూటర్ మరియు 2 -మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు కలిగి ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెన్సార్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ 5,020mAh బ్యాటరీ ఫీచర్స్
రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ ఫోన్ యొక్క స్టోరేజ్ విషయానికి వస్తే ఇది 128GB వరకు ఇంటర్నల్ UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G VoLTE, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఇన్‌ఫ్రారెడ్ (IR), యుఎస్‌బి టైప్-సి మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. అలాగే ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,020mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. చివరగా ఇది 164.5x76.15x8.1mm కొలతల పరిమాణంతో 192 గ్రాముల బరువుతో వస్తుంది.


Click it and Unblock the Notifications