Home
News

Redmi Note 10 Pro స్మార్ట్‌ఫోన్‌ మీద రూ.2000 భారీ ధర తగ్గింపు!!

రెడ్‌మి నోట్ 10 సిరీస్‌ను ఈ ఏడాది ప్రారంభంలో భారతదేశంలో ప్రారంభించారు. షియోమి సంస్థ తన పోర్ట్‌ఫోలియోలో మూడు బడ్జెట్ ఫోన్‌లను జోడించింది. లాంచ్ సమయంలో ఈ హ్యాండ్‌సెట్ ఫ్లాష్ సేల్స్ ద్వారా లభించింది. అయితే ఈ రోజు నుంచి రెడ్‌మి నోట్ 10 ప్రో కోసం కంపెనీ నిబంధనను మార్చినట్లు తెలుస్తోంది. రెడ్‌మి నోట్ 10 ప్రో ఇప్పుడు దేశంలో బహిరంగ అమ్మకాల ద్వారా అందుబాటులోకి రానున్నది.

ఫ్లాష్ సేల్

దీనిని పొందాలనుకునే కొనుగోలుదారులు ఫ్లాష్ సేల్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదని కంపెనీ తెలిపింది. దీనితో పాటుగా సంస్థ ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు మీద రూ.2,000 వరకు ధర తగ్గింపును కూడా ప్రకటించింది. 64MP కెమెరా, 120HZ రిఫ్రెష్ రేట్, సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌, పంచ్-హోల్ డిస్ప్లే డిజైన్‌, మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వంటి ఫీచర్లను కలిగి ఉండి రియల్‌మి నార్జో 30 ప్రో మరియు శామ్‌సంగ్ గెలాక్సీ F41 లతో పోటీపడుతున్న దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రెడ్‌మి నోట్ 10 ప్రో తగ్గింపు ధరల వివరాలు

రెడ్‌మి నోట్ 10 ప్రో తగ్గింపు ధరల వివరాలు

రెడ్‌మి నోట్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌ భారతదేశంలో నేటి నుంచి ఓపెన్ సేల్ ద్వారా అందుబాటులోకి రానున్నది. ఈ ఫోన్ యొక్క మూడు వేరియంట్ల మీద రూ.2,000 వరకు ధర తగ్గింపును అందిస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ధరల తగ్గింపు పొందిన తరువాత రెడ్‌మి నోట్ 10 ప్రో యొక్క 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.15,999 కాగా 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.16,999 కాగా చివరిది 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ రూ.18,999 తగ్గింపు ధర వద్ద లభిస్తుంది. ఈ కొత్త ధర నిర్ణయంతో భారతదేశంలో రెడ్‌మి నోట్ 10s విజయవంతం అవుతుందనే అంచనాలను కంపెనీ దాదాపుగా అధిగమించింది.

రెడ్‌మి నోట్ 10 ప్రో స్పెసిఫికేషన్స్

రెడ్‌మి నోట్ 10 ప్రో స్పెసిఫికేషన్స్

రెడ్‌మి నోట్ 10 ప్రో యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 ఆధారిత MIUI 12 పై తో రన్ అవుతువుంది. ఇది HDR-10 మద్దతు మరియు TÜV రీన్‌ల్యాండ్ తో 6.67-అంగుళాల ఫుల్-HD + సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది బ్లూ లైట్ సర్టిఫికేషన్ తో వస్తుంది. అలాగే ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732 జి SoC చేత శక్తినిస్తుంది, దీనితో పాటు అడ్రినో 618 జిపియు మరియు 8 జిబి వరకు LPDDR4x ర్యామ్ ఉన్నాయి. ఆప్టిక్స్ విషయానికొస్తే ఫోన్ వెనుక భాగంలో గల క్వాడ్ రియర్ కెమెరా సెటప్ లో 64 మెగాపిక్సెల్ ప్రాధమిక శామ్‌సంగ్ ISOCELL GW3 సెన్సార్‌తో పాటు 5 మెగాపిక్సెల్ సూపర్ మాక్రో షూటర్‌తో పాటు 2x జూమ్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్- యాంగిల్ షూటర్ మరియు 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్ కూడా ఉంది.

రెడ్‌మి నోట్ 10 ప్రో ఫీచర్స్

రెడ్‌మి నోట్ 10 ప్రో యొక్క స్టోరేజ్ మరియు ఇతర ఫీచర్ల విషయానికొస్తే ఇది 128GB వరకు UFS 2.2 స్టోరేజ్ ను కలిగి ఉంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ ప్రత్యేకమైన స్లాట్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించవచ్చు. కనెక్టివిటీ ఎంపికలలో 4G VoLTE, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఇన్‌ఫ్రారెడ్, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. ఈ ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. అలాగే ఇది 360-డిగ్రీల యాంబియంట్ లైట్ సెన్సార్ను కలిగి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi Note 10 Pro Price Slashed in India: Price, Specs, Open Sale Offers and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X