Redmi Note 10 Pro కొనడానికి ఇదే మంచి తరుణం!! అమెజాన్ ఆఫర్స్ మిస్ అవ్వకండి..

|

అమెజాన్ లో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ అమ్మకంలో ఇటీవల ఇండియాలో లాంచ్ అయన రెడ్‌మి నోట్ 10 ప్రో మరొక సారి అమ్మకానికి వచ్చింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అద్భుతమైన ఆఫర్లతో అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ గత వారం మొదటిసారి అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్‌ను మార్చి 4 న రెడ్‌మి నోట్ 10 మరియు హై-ఎండ్ రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ తో పాటుగా విడుదల చేసారు. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్ ఫీచర్లను కలిగి ఉన్న రెడ్‌మి నోట్ 10 ప్రో రియల్‌మి నార్జో 30 ప్రో, శామ్‌సంగ్ గెలాక్సీ F41 వంటి వాటికి సమానమైన ఫీచర్లను కలిగి ఉంది. అమెజాన్ లో లభించే అన్ని రకాల ఆఫర్లతో దీనిని ఇప్పుడు అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

ఇండియాలో రెడ్‌మి నోట్ 10 ప్రో మూడు వేరియంట్‌లలో విడుదల అయింది. ఇందులో 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ.15,999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.16,999 కాగా టాప్ ఎండ్ మోడల్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఆప్షన్ యొక్క ధర రూ.18,999. దీనిని ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి అమెజాన్, Mi.కామ్, Mi హోమ్ మరియు Mi దుకాణాల ద్వారా డార్క్ నైట్, గ్లాసియర్ బ్లూ మరియు వింటేజ్ బ్రోన్స్ కలర్ లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. రెడ్‌మి నోట్ 10 ప్రో ఫోన్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రస్తుతం అమెజాన్ లో మధ్యాహ్నం 12PM ల నుండి మొదలైన అమ్మకాలలోని ఆఫర్‌లలో భాగంగా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు యొక్క EMI లావాదేవీల మీద రూ.2000 తక్షణ తగ్గింపు లభిస్తుంది.

రెడ్‌మి నోట్ 10 ప్రో స్పెసిఫికేషన్స్
 

రెడ్‌మి నోట్ 10 ప్రో స్పెసిఫికేషన్స్

రెడ్‌మి నోట్ 10 ప్రో యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 ఆధారిత MIUI 12 పై తో రన్ అవుతువుంది. ఇది HDR-10 మద్దతు మరియు TÜV రీన్‌ల్యాండ్ తో 6.67-అంగుళాల ఫుల్-HD + సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది బ్లూ లైట్ సర్టిఫికేషన్ తో వస్తుంది. అలాగే ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732 జి SoC చేత శక్తినిస్తుంది, దీనితో పాటు అడ్రినో 618 జిపియు మరియు 8 జిబి వరకు LPDDR4x ర్యామ్ ఉన్నాయి. ఆప్టిక్స్ విషయానికొస్తే ఫోన్ వెనుక భాగంలో గల క్వాడ్ రియర్ కెమెరా సెటప్ లో 64 మెగాపిక్సెల్ ప్రాధమిక శామ్‌సంగ్ ISOCELL GW3 సెన్సార్‌తో పాటు 5 మెగాపిక్సెల్ సూపర్ మాక్రో షూటర్‌తో పాటు 2x జూమ్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్- యాంగిల్ షూటర్ మరియు 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్ కూడా ఉంది.

రెడ్‌మి నోట్ 10 ప్రో ఫీచర్స్

రెడ్‌మి నోట్ 10 ప్రో ఫీచర్స్

రెడ్‌మి నోట్ 10 ప్రో యొక్క స్టోరేజ్ మరియు ఇతర ఫీచర్ల విషయానికొస్తే ఇది 128GB వరకు UFS 2.2 స్టోరేజ్ ను కలిగి ఉంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ ప్రత్యేకమైన స్లాట్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించవచ్చు. కనెక్టివిటీ ఎంపికలలో 4G VoLTE, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఇన్‌ఫ్రారెడ్, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. ఈ ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. అలాగే ఇది 360-డిగ్రీల యాంబియంట్ లైట్ సెన్సార్ను కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Redmi Note 10 Pro Second Sales Live on Amazon Fab Phones Fest Sale: Price, Specs, Sale Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X