5G-సపోర్ట్‌ చిప్‌సెట్‌తో తక్కువ ధరలో రాబోతున్న రెడ్‌మి నోట్ 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు

|

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమి నుంచి కొత్తగా విడుదలయ్యే అన్ని రకాల స్మార్ట్‌ఫోన్‌లకు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో విడుదల అయిన రెడ్‌మి నోట్ 10 ఫోన్లకు అదిరిపోయే డిమాండ్ ఉంది. రెడ్‌మి నోట్ 10 సిరీస్ లో కొత్తగా మరికొన్ని ఫోన్లను విడుదల చేసే పనిలో కూడా ఉన్నాయి. కొత్తగా వచ్చే ఈ ఫోన్లు 5G సపోర్ట్‌ చిప్‌సెట్‌తో రావడం గమనార్హం. ప్రముఖ మీడియాటెక్ డైమెన్సిటీ 820 చిప్‌సెట్‌తో రెడ్‌మి నోట్ 10 సిరీస్ ఫోన్లు రానున్నట్లు కొన్ని నిఘా వర్గాలు తెల్పుతున్నాయి. కొత్త రెడ్‌మి నోట్ 10 డివైస్ 5G ఎనేబుల్ డైమెన్సిటీ 720 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రెడ్‌మి నోట్ 10 సిరీస్

రెడ్‌మి నోట్ 10 సిరీస్

షియోమి సంస్థ రెడ్‌మి నోట్ 10 సిరీస్ ఫోన్లలో ఒకే సారి రెండిటిని విడుదల చేయనున్నది. ఇందులో రెండవది బడ్జెట్ ధరలో రానున్నట్లు సమాచారం. రెండు కొత్త ఫోన్లలో ఒకటి రెడ్‌మి నోట్ 10 కాగా రెండవది నోట్ 10 ప్రో అని భావిస్తున్నారు. ఈ ఫోన్‌లు ప్రస్తుతం చైనాలో మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా ఉన్న రెడ్‌మి 10X 5G ఫోన్‌కు కొద్దిగా భిన్నంగా ఉంటాయి. ఈ కొత్త సిరీస్ ఫోన్లు భారతదేశంతో సహా షియోమి గ్లోబల్ మార్కెట్లలో రిలీజ్ కానున్నాయి.

Also Read:Realme కొత్త స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్!!! బ్రహ్మాండమైన ఫీచర్స్...Also Read:Realme కొత్త స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్!!! బ్రహ్మాండమైన ఫీచర్స్...

5G నెట్‌వర్క్ మెయిన్ స్ట్రీమ్

5G నెట్‌వర్క్ మెయిన్ స్ట్రీమ్

5Gని మెయిన్ స్ట్రీమ్ విభాగానికి తీసుకురావడం గత కొన్ని నెలలుగా అన్ని రకాల బ్రాండ్లు పనిచేస్తున్నాయి. 5G మద్దతుతో ముందుకు సాగే కీలకమైన విభాగంలో షియోమి మరింత ముందుగా పనిచేస్తున్నది. ఇప్పటికే అన్ని రకాల దేశాలు క్రమంగా 5G నెట్‌వర్క్ వ్యవస్థలను అవలంబిస్తున్నాయి. 2022 నాటికి భారతదేశం కూడా సొంతంగా 5G నెట్‌వర్క్‌లను అభివృద్ధి చేస్తుందని భావిస్తున్నారు.

Also Read:Flipkart లో వీటిపై 80% వరకు ఆఫర్లు. కొనడానికి ఇదే మంచి అవకాశం.Also Read:Flipkart లో వీటిపై 80% వరకు ఆఫర్లు. కొనడానికి ఇదే మంచి అవకాశం.

సరసమైన ధర ఫోన్‌లలో 5G మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్‌

సరసమైన ధర ఫోన్‌లలో 5G మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్‌

ఆగస్టు నెలలో Q3 2020 లో మీడియాటెక్ సంస్థ తన యొక్క బ్రాండ్ డైమెన్సిటీ చిప్‌సెట్లను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనే విధానాన్ని ప్రకటించింది.రెడ్‌మి నోట్ 10 సిరీస్ వంటి ఫోన్‌లతో పాటు ఇతర బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌లు కూడా దీని కొత్త చిప్‌సెట్‌లను ఉపయోగిస్తున్నారు.

రెడ్‌మి స్మార్ట్‌బ్యాండ్ ఫిట్‌నెస్ ట్రాకర్‌ ఫీచర్స్  

రెడ్‌మి స్మార్ట్‌బ్యాండ్ ఫిట్‌నెస్ ట్రాకర్‌ ఫీచర్స్  

రెడ్‌మి సంస్థ యొక్క స్మార్ట్‌బ్యాండ్ వాచ్ యొక్క కొన్ని ఫీచర్లను తన యొక్క వెబ్‌సైట్‌లో టీజ్ చేసింది. రెడ్‌మి స్మార్ట్‌బ్యాండ్ ఎక్కువ సమయం వరకు లభించే బ్యాటరీ లైఫ్ మరియు రంగురంగుల డిస్ప్లే ను కలిగి ఉన్నట్లు చూపుతున్నది. షియోమి సంస్థ దీనిని నీటి నిరోధకతను కలిగి ఉన్నట్లు కూడా నిర్ధారించింది. ఇది హృదయ స్పందన రేటును కూడా ట్రాక్ చేస్తుంది. రెడ్‌మి విడుదల చేసిన టీజర్‌ల ఆధారంగా షియోమి గ్లోబల్ మార్కెట్ల నుండి రెడ్‌మి బ్యాండ్‌ను ఇండియాలో కూడా విడుదల చేయనున్నది. రెడ్‌మి బ్యాండ్ షియోమి నుండి చౌకైన ఫిట్‌నెస్ ట్రాకర్‌గా కొన్ని నెలల క్రితం ప్రారంభించింది. ఇది కొత్త డిజైన్ మరియు తక్కువ ధరతో అన్ని అవసరమైన లక్షణాలను పొందింది.

Best Mobiles in India

Read more about:
English summary
Redmi Note 10 Series Comes with 5G Support Enabled Chipsets 

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X