Redmi Note 10 సిరీస్ కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి!! అందుబాటు ధరలోనే, ఫీచర్స్ అదుర్స్

|

చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమి ఇండియాలో నేడు కొత్త ఫోన్ లను విడుదల చేసింది. గత సంవత్సరం లాంచ్ అయిన రెడ్‌మి నోట్ 9 సిరీస్ ఫోన్ లకు అప్ గ్రేడ్ వెర్షన్ గా రెడ్‌మి నోట్ 10, రెడ్‌మి నోట్ 10 ప్రో, రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ నేడు భారత్‌లో లాంచ్ అయ్యాయి. ఈ రెడ్‌మి నోట్ 10 సిరీస్‌లో సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే 60HZ రిఫ్రెష్ రేట్ మరియు 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్‌ కెమెరా సెటప్ ఉన్నాయి. అయితే రెడ్‌మి నోట్ 10 ప్రో మరియు రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ రెండూ 120HZ రిఫ్రెష్ రేట్ డిస్ప్లేలు మరియు 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఫీచర్లతో వస్తాయి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రెడ్‌మి నోట్ 10 సిరీస్ ధరల వివరాలు

రెడ్‌మి నోట్ 10 సిరీస్ ధరల వివరాలు

భారతదేశంలో రెడ్‌మి నోట్ 10 యొక్క 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ.11,999 ఉండగా 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్‌ ధర రూ.13,999. ఈ ఫోన్ ఆక్వా గ్రీన్, ఫ్రాస్ట్ వైట్ మరియు షాడో బ్లాక్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. మరోవైపు రెడ్‌మి నోట్ 10 ప్రో యొక్క 6GB ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ మోడల్‌ రూ.15,999 మరియు 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌ రూ.16,999 మరియు 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ రూ.18,999 ధర ట్యాగ్ ను కలిగి ఉంది. చివరిగా రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ యొక్క 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ రూ. 18,999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ రూ.19,999 మరియు 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్‌ 21,999 రూపాయల ధర ట్యాగ్ లను కలిగి ఉంది. రెడ్‌మి నోట్ 10 ప్రో మరియు రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ రెండూ డార్క్ నైట్, బ్లూ మరియు బ్రోన్జ్ కలర్ లలో లభిస్తాయి.

 రెడ్‌మి నోట్ 10 సిరీస్ లాంచ్ ఆఫర్స్

రెడ్‌మి నోట్ 10 సిరీస్ లాంచ్ ఆఫర్స్

రెడ్‌మి నోట్ 10 సిరీస్ యొక్క లభ్యత విషయానికొస్తే మార్చి 16, మంగళవారం నుండి అమెజాన్, మి.కామ్, మి హోమ్ స్టోర్స్ మరియు ఆఫ్‌లైన్ రిటైల్ భాగస్వాముల ద్వారా దేశంలో అమ్మకం కానుంది. అయితే రెడ్‌మి నోట్ 10 ప్రో, మార్చి 17, బుధవారం నుండి అదే ఛానెల్‌లు మరియు రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ మార్చి 18 గురువారం నుండి అందుబాటులో ఉంటాయి. లాంచ్ ఆఫర్‌లలో భాగంగా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు యొక్క EMI లావాదేవీల మీద రూ.1,500 తక్షణ తగ్గింపు లభిస్తుంది. అలాగే రూ.50 వేల విలువైన జియో ప్రయోజనాలు కూడా అదనంగా లభిస్తాయి.

రెడ్‌మి నోట్ 10 స్పెసిఫికేషన్స్

రెడ్‌మి నోట్ 10 స్పెసిఫికేషన్స్

రెడ్‌మి నోట్ 10 యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇందులో డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఇది ఆండ్రాయిడ్ 11 లో MIUI 12 తో రన్ అవుతుంది. ఇది 6.43-అంగుళాల ఫుల్-హెచ్‌డి + సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్‌, 20: 9 కారక నిష్పత్తితో మరియు 100 శాతం డిసిఐ-పి 3 విస్తృత కలర్ స్వరసప్తకంతో కలిగి ఉంటుంది. దీని యొక్క డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఈ ఫోన్‌ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 678 SoC, అడ్రినో 612 GPU ను కలిగి ఉండి 6GB వరకు LPDDR4x RAMతో జతచేయబడి ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సోనీ IMX582 సెన్సార్‌తో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ షూటర్, 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం, ఫోన్ ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది.

రెడ్‌మి నోట్ 10 ప్రో స్పెసిఫికేషన్స్

రెడ్‌మి నోట్ 10 ప్రో స్పెసిఫికేషన్స్

రెడ్‌మి నోట్ 10 ప్రో యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 ఆధారిత MIUI 12 పై తో రన్ అవుతువుంది. ఇది HDR-10 మద్దతు మరియు TÜV రీన్‌ల్యాండ్ తో 6.67-అంగుళాల ఫుల్-HD + సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది బ్లూ లైట్ సర్టిఫికేషన్ తో వస్తుంది. అలాగే ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732 జి SoC చేత శక్తినిస్తుంది, దీనితో పాటు అడ్రినో 618 జిపియు మరియు 8 జిబి వరకు LPDDR4x ర్యామ్ ఉన్నాయి. ఆప్టిక్స్ విషయానికొస్తే ఫోన్ వెనుక భాగంలో గల క్వాడ్ రియర్ కెమెరా సెటప్ లో 64 మెగాపిక్సెల్ ప్రాధమిక శామ్‌సంగ్ ISOCELL GW3 సెన్సార్‌తో పాటు 5 మెగాపిక్సెల్ సూపర్ మాక్రో షూటర్‌తో పాటు 2x జూమ్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్- యాంగిల్ షూటర్ మరియు 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్ కూడా ఉంది.

Best Mobiles in India

English summary
Redmi Note 10 Series Smartphones Released in India: Price, Specs, Features, Sale Date and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X