Home
News

Redmi Note 10s మొదటి అమ్మకాలు మొదలయ్యాయి!! ఆఫర్స్ బ్రహ్మాండం...

చైనా యొక్క షియోమి సంస్థ యొక్క సబ్-బ్రాండ్ రెడ్‌మి ఇటీవల ఇండియాలో విడుదల చేసిన రెడ్‌మి నోట్ 10s స్మార్ట్ ఫోన్ యొక్క అమ్మకాలు మొదటిసారిగా ఈ రోజు అంటే మే 18 మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలయ్యాయి. ఈ ఫోన్ మార్చిలో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయి గత వారం రెడ్‌మి వాచ్‌తో పాటు భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది.

రెడ్‌మి నోట్ 10s

రెడ్‌మి నోట్ 10 సిరీస్ మాదిరిగా రెడ్‌మి నోట్ 10s ఆకట్టుకునే స్పెసిఫికేషన్‌లతో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్ గా అందుబాటులో ఉంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G95 SoC, రెండు వేరువేరు ర్యామ్ మరియు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో మూడు కలర్ ఎంపికలలో లభించే ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రెడ్‌మి నోట్ 10s ధరల వివరాలు

రెడ్‌మి నోట్ 10s ధరల వివరాలు

ఇండియాలో రెడ్‌మి నోట్ 10s ఫోన్ రెండు వేరియంట్‌లలో విడుదలైంది. ఇందులో 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ.14999 కాగా 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్‌ యొక్క ధర 15,999 రూపాయలు. ఈ ఫోన్ డీప్ సీ బ్లూ, ఫ్రాస్ట్ వైట్ మరియు షాడో బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్లలో అందించబడుతుంది. ఇది అమెజాన్, mi.కామ్, mi హోమ్ స్టోర్స్ మరియు ఇతర రిటైల్ దుకాణాల నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. SBI క్రెడిట్ కార్డ్ లావాదేవీలతో 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తోంది. EMI లావాదేవీలపై కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది.

రెడ్‌మి నోట్ 10s స్పెసిఫికేషన్స్

రెడ్‌మి నోట్ 10s స్పెసిఫికేషన్స్

రెడ్‌మి నోట్ 10s యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 ఆధారిత MIUI 12.5 పై తో రన్ అవుతువుంది. ఇది HDR-10 మద్దతు మరియు TÜV రీన్‌ల్యాండ్ తో 6.43-అంగుళాల ఫుల్-HD + సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది బ్లూ లైట్ సర్టిఫికేషన్ తో వస్తుంది. అలాగే ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732 జి SoC చేత శక్తినిస్తుంది, దీనితో పాటు అడ్రినో 618 జిపియు మరియు 8 జిబి వరకు LPDDR4x ర్యామ్ ఉన్నాయి.

రెడ్‌మి నోట్ 10s క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌

రెడ్‌మి నోట్ 10s క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌

రెడ్‌మి నోట్ 10s యొక్క ఆప్టిక్స్ విషయానికొస్తే ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ఎఫ్ / 1.79 లెన్స్ తో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ఎఫ్ / 2.2 అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ తో 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, ఎఫ్ / 2.4 ఎపర్చరుతో 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు ఎఫ్ / 2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు ప్యాక్ చేయబడి ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందుభాగంలో ఎఫ్ / 2.45 ఎపర్చర్‌తో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కెమెరాను పంచ్-హోల్ కటౌట్‌లో కేంద్రీకృతమై ప్యాక్ చేయబడి ఉంటుంది.

రెడ్‌మి నోట్ 10s కనెక్టివిటీ

రెడ్‌మి నోట్ 10s యొక్క కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇది 4G, వై-ఫై, జిపిఎస్, బ్లూటూత్, IR బ్లాస్టర్, NFC, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ మరియు యుఎస్‌బి టైప్-సి పోర్ట్ వంటివి ఉన్నాయి. రెడ్‌మి నోట్ 10s లోని సెన్సార్లలో యాంబియంట్ లైట్ సెన్సార్, సామీప్య సెన్సార్, యాక్సిలెరోమీటర్ వంటివి ఉన్నాయి. అలాగే ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ను కూడా కలిగి ఉంది. అలాగే ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. కొలతల పరంగా రెడ్‌మి నోట్ 10s 160.46x74.5x8.29mm లతో పాటుగా 178.8 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi Note 10S First Sale Live on Amazon and Mi.com: Price, Specs, Sale Offers and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X