Home
News

Redmi Note 10T 5G లాంచ్ డేట్ వచ్చేసింది ! ధర మరియు ఫీచర్లు చూడండి.

By Maheswara

రెడ్‌మి నోట్ 10 టి 5 జి ఇండియా లాంచ్ తేదీని జూలై 20 కి నిర్ణయించినట్లు షియోమి సోమవారం వెల్లడించింది. రెడ్‌మి నోట్ 10 సిరీస్‌లోని కొత్త స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి నోట్ 10, రెడ్‌మి నోట్ 10 ప్రో, మరియు రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్‌తో పాటు మార్చిలో లాంచ్ అయిన సంగతి మీకు తెలిసిందే. Redmi Note 10T 5G గత నెలలో రష్యాలో రీబ్రాండెడ్ Redmi Note 10 5G (యూరప్‌లో లాంచ్ చేయబడింది) మరియు పోకో M3 ప్రో 5G గా భారతదేశంలో లాంచ్ అయింది.

Redmi Note 10T 5G ఇండియా లాంచ్ తేదీ

షియోమి ఇండియా కమ్యూనికేషన్స్ ప్రతినిధి కస్తూరి పలాధి దేశంలో రెడ్‌మి నోట్ 10 టి 5 జి ప్రారంభ తేదీని ప్రకటించే వీడియోలో కనిపించారు. వీడియో లో అందించిన సమాచారం ప్రకారం Redmi Note 10T 5G ఫోన్ ను జులై 20 న ఇండియా లో లాంచ్ చేస్తున్నట్లు తెలిపారు. సంస్థ తన అధికారిక ప్రవేశానికి ముందు రాబోయే స్మార్ట్‌ఫోన్ రూపకల్పనను ప్రదర్శించడానికి ప్రత్యేకమైన మైక్రోసైట్‌ను రూపొందించింది. గత వారం, అమెజాన్ రెడ్‌మి నోట్ 10 టిని భారత్‌లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఆన్‌లైన్ మార్కెట్ ద్వారా - ఇతర ఛానెల్‌లతో పాటు - వచ్చే వారం అమ్మకాలు ప్రారంభిస్తున్నట్లు సమాచాచారం.

భారతదేశంలో Redmi Note 10T 5G అంచనా ధర

భారతదేశంలో Redmi Note 10T 5G అంచనా ధర

భారతదేశంలో రెడ్‌మి నోట్ 10 టి ధర ఇంకా వెల్లడి కాలేదు. అయితే, ప్రారంభ టీజర్ల ద్వారా అందిన సమాచారం ప్రకారం మనము ఒక అంచనాకు రావొచ్చు, ఫోన్ దాని రష్యా వేరియంట్‌తో సమానంగా ఉంటుంది. ఇది 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ కోసం రష్యన్ మార్కెట్లో RUB 19,990 వద్ద ప్రారంభించబడింది, ఇది సుమారు  భారతదేశంలో రూ.20,000. గా ఉంటుంది.

Redmi Note 10T 5G స్పెసిఫికేషన్లు

Redmi Note 10T 5G స్పెసిఫికేషన్లు

ఇక స్పెసిఫికేషన్ల విషయాలు గమనిస్తే, Redmi Note 10T 5G ఆండ్రాయిడ్ 11 లో MIUI తో నడుస్తుంది మరియు 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల పూర్తి-HD + (1,080x2,400 పిక్సెల్స్) డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC తో పాటు 6GB వరకు ర్యామ్ ఉంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ f/1.79 లెన్స్‌తో పాటు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్, f / 2.0 లెన్స్‌తో వస్తుంది.

స్టోరేజ్

స్టోరేజ్

Redmi Note 10T 5G లో 128 జిబి వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5 జి, 4 జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ v5.1, NFC, యుఎస్‌బి టైప్-సి మరియు 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో కూడా వస్తుంది. ఇదికాకుండా, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Redmi Note 10T 5G India launch Date Revealed. Here Is Expected Price And Specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X