బడ్జెట్ ధరలో రెడ్‌మి మొదటి 5G ఫోన్ నోట్ 10T 5G లాంచ్!! ఆఫర్స్ మీద ఓ లుక్ వేయండి

|

చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి రెడ్‌మి బ్రాండ్‌తో నేడు ఇండియాలో రెడ్‌మి నోట్ 10T 5G ని విడుదల చేశారు. రెడ్‌మి నోట్ 10 సిరీస్‌లో రెడ్‌మి నోట్ 10, రెడ్‌మి నోట్ 10 ప్రో, రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్, రెడ్‌మి నోట్ 10S తర్వాత ఐదవ మోడల్‌గా ఈ కొత్త రెడ్‌మి ఫోన్ ను లాంచ్ చేసారు. రెడ్‌మి బ్రాండ్‌తో ఇండియాలో లాంచ్ అయిన మొదటి 5G ఫోన్ ఇదే కావడం విషేషం. ట్రిపుల్ రియర్ కెమెరా మరియు పంచ్-హోల్ డిజైన్ డిస్ప్లే మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC వంటి ఫీచర్లను కలిగి ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

భారతదేశంలో రెడ్‌మి నోట్ 10T 5G స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్‌లలో లాంచ్ అయింది. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ.13,999 ఉండగా 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఆప్షన్ యొక్క ధర రూ.15,999. ఈ ఫోన్ క్రోమియం వైట్, గ్రాఫైట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ మరియు మింట్ గ్రీన్ వంటి కలర్ లలో లభిస్తుంది. ఇది జూలై 26 నుండి అమెజాన్, Mi.కామ్, Mi హోమ్ స్టోర్స్ మరియు ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

ఒప్పో రెనో 6 ప్రో 5G ఓపెన్ సేల్స్ లో అదిరిపోయే ఆఫర్స్!! మిస్ అవ్వకండిఒప్పో రెనో 6 ప్రో 5G ఓపెన్ సేల్స్ లో అదిరిపోయే ఆఫర్స్!! మిస్ అవ్వకండి

రెడ్‌మి నోట్ 10T 5G లాంచ్ ఆఫర్స్

రెడ్‌మి నోట్ 10T 5G లాంచ్ ఆఫర్స్

రెడ్‌మి నోట్ 10T 5G స్మార్ట్‌ఫోన్‌ యొక్క లాంచ్ ఆఫర్‌ల విషయానికి వస్తే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ.1,000 వరకు తక్షణ తగ్గింపును అందిస్తుంది. అంతేకాకుండా నో-కాస్ట్ ఇఎంఐ లావాదేవీలు కూడా ఉన్నాయి. రిటైల్ చానెళ్ల ద్వారా నో-కాస్ట్ EMI మరియు ఎక్సచేంజ్ ఎంపికలు కూడా ఉంటాయి.

రెడ్‌మి నోట్ 10T 5G స్పెసిఫికేషన్స్
 

రెడ్‌మి నోట్ 10T 5G స్పెసిఫికేషన్స్

రెడ్‌మి నోట్ 10T 5G స్మార్ట్‌ఫోన్‌ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 మరియు MIUI తో రన్ అవుతుంది. ఇది 90HZ రిఫ్రెష్ రేట్ తో మరియు 20: 9 కారక నిష్పత్తితో 6.5-అంగుళాల ఫుల్- HD+ డిస్ప్లేని 1,080x2,400 పిక్సెల్స్ పరిమాణంలో కలిగి ఉంది. అలాగే ఇది హుడ్ కింద ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC తో రన్ అవుతూ 6GB వరకు గల ర్యామ్ తో జతచేయబడి ఉంటుంది.

రెడ్‌మి నోట్ 10T 5G

రెడ్‌మి నోట్ 10T 5G స్మార్ట్‌ఫోన్‌ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.79 లెన్స్‌తో 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, ఎఫ్ / 2.4 మాక్రో లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ మరియు ఎఫ్ / 2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ కెమెరాలు కలిగి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాటింగ్ కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.0 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

కనెక్టివిటీ

రెడ్‌మి నోట్ 10T 5G స్మార్ట్‌ఫోన్‌ 64GB మరియు 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, వై-ఫై, బ్లూటూత్ V 5.1, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఇన్‌ఫ్రారెడ్ (IR) బ్లాస్టర్, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్-సి, మరియు 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. బోర్డులోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అలాగే ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 161.81x75.34x8.92mm కొలతల పరిమాణంలో 190 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Redmi Note 10T 5G Smartphone Released in India: Price, Specs, Sale Date, Launch Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X