Redmi Note సిరీస్ లో మరో రెండు కొత్త ఫోన్లు ! స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి చూడండి.

By Maheswara
|

షియోమి యొక్క రెడ్‌మి నోట్ లైనప్ అనేది కేవలం మాస్-మార్కెట్ ను మాత్రమే దృష్టిలో ఉంచుకొని తయారుచేసిన పరికరం మాత్రమే కాదు. షియోమి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా మారడానికి ఈ లైనప్ ఒక ప్రధాన కారణం. చైనీస్ సోషల్ మీడియా వీబోలో వివిధ లీకుల ద్వారా విడుదల అయిన వివరాల ప్రకారం, కంపెనీ రెడ్‌మి నోట్ 11 లైనప్ కింద రెండు కొత్త మరియు శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లను సిద్ధం చేస్తోంది. ఈ ఫోన్‌లు - రెడ్‌మి నోట్ 11 మరియు రెడ్‌మి నోట్ 11 ప్రో. గా వస్తున్నట్లు అంచనాలున్నాయి. చైనాలో నవంబర్ 11 షాపింగ్ పండుగకు ముందు గానే రెండు పరికరాలను ప్రకటించవచ్చని ఈ నివేదికలు సూచిస్తున్నాయి.

రెడ్‌మి నోట్ 11 మరియు రెడ్‌మి నోట్ 11 ప్రో అంచనా స్పెసిఫికేషన్‌లు

రెడ్‌మి నోట్ 11 మరియు రెడ్‌మి నోట్ 11 ప్రో అంచనా స్పెసిఫికేషన్‌లు

విడుదల అయిన లీక్‌లను గమనిస్తే , రెడ్‌మి నోట్ 11 మరియు నోట్ 11 ప్రో ఆకట్టుకునే స్పెసిఫికేషన్‌లతో రాబోతున్నాయి. లీకైన స్పెక్స్‌ల ప్రకారం ఈ రెండు పరికరాలు మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్‌లను కలిగి ఉండవచ్చని సూచిస్తున్నాయి. ముందు తరం రెడీమి నోట్ సిరీస్ లతో పోలిస్తే  ఇవి చాలా ముందుకు వచ్చాయి మరియు ఇటీవలి కాలంలో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లకు శక్తినిస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే, ఈ రెండు ఫోన్‌లు అంతర్జాతీయ మార్కెట్లలో లాంచ్ అయితే ఒకే స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటాయనే గ్యారెంటీ లేదు.

ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో

ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో

వనిల్లా రెడ్‌మి నోట్ 11 డైమెన్సిటీ 810 చిప్‌సెట్‌తో పాటు 6GB లేదా 8GB మెమరీ మరియు 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్ 5G కనెక్టివిటీతో రావచ్చు మరియు 120 Hz రిఫ్రెష్ రేట్‌తో LED ప్యానెల్‌ని కలిగి ఉండవచ్చు.ఇది నోట్ 11 ప్రోలో 5,000 mAh బ్యాటరీ ఫీచర్ ఉందని అంచనాలున్నాయి. 67W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. Mi 11 అల్ట్రాలో కూడా మీకు అదే ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఆప్టిక్స్ పరంగా, Redmi Note 11 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో రావచ్చు. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000 mAh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. రెడ్‌మి నోట్ 11 ప్రో గురించి వివరాలు చూస్తే , ఇది కొంచెం శక్తివంతమైన డైమెన్సిటీ 920 SoC తో పాటు 120 Hz రిఫ్రెష్ రేట్‌తో OLED ప్యానెల్‌తో వస్తుంది.ఈ ఫోన్ 108 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా మరియు ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెన్సార్‌తో వస్తుంది.

 అంచనా ధర

అంచనా ధర

బ్యాటరీ స్పెక్స్ మరియు ఛార్జింగ్ వేగం విషయంలో కొంత గందరగోళం ఉంది. లీక్‌ అయిన వివరాలలో ఒకటి ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో రావచ్చు, మరొకటి ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 5000 mAh బ్యాటరీ ప్యాక్ అని సూచిస్తున్నాయి. 67W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్ మీ ఫోన్ బ్యాటరీని కూడా వేగంగా ఛార్జ్ చేయగలదు, అయితే,ఈ విషయం లో అధికారిక ప్రకటన కోసం మనము వేచి చూడవలసిందే. ఇతర స్పెసిఫికేషన్లలో JBL స్టీరియో స్పీకర్లు, NFC మరియు x- యాక్సిస్ లీనియర్ మోటార్ ఉన్నాయి.

రెడ్‌మి నోట్ 11 మరియు రెడ్‌మి నోట్ 11 ప్రో అంచనా ధర   

ప్రస్తుతానికి ఇవి అన్ని పుకార్లు మరియు లీక్‌లు మాత్రమే, రెడ్‌మి నోట్ 11 ప్రో ప్రారంభంలో CNY 1,599 (~ $ 248), CNY 1,799 (~ $ 279) మరియు CNY 1,999 ($ 311) ధరలని భావిస్తున్నారు. రెడ్‌మి నోట్ 11 యొక్క ధర CNY 1,119 (~ $ 186) మరియు CNY 1,599 (~ $ 248) వద్ద ఉండవచ్చు.
 

Best Mobiles in India

English summary
Redmi Note 11 Specifications Leaked Online ,Here Key Specifications And Model Details.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X