రెడ్‌మి నోట్ 11SE స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! ఫీచర్స్ మీద ఓ లుక్ వేయండి...

|

చైనా యొక్క స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియామి యొక్క సబ్-బ్రాండ్ గా మార్కెట్లోకి అడుగుపెట్టిన రెడ్‌మి సంస్థ నేడు చైనాలో ఒక ఈవెంట్ లో రెడ్‌మి నోట్ 11SE కొత్త స్మార్ట్‌ఫోన్ ని విడుదల చేసింది. ఈ రెడ్‌మి నోట్ 11SE స్మార్ట్‌ఫోన్ విడుదల కావడంతో కంపెనీ నుంచి రెడ్‌మి నోట్ 11T ప్రో+ మరియు రెడ్‌మి నోట్ 11T ప్రోలు విడుదల కానున్నట్లు కొన్ని సంకేతాలను చూసింది. ఇది అడాప్టివ్ Sync టెక్నాలజీతో 6.5-అంగుళాల పూర్తి-HD+ డిస్‌ప్లే, డ్యూయల్ సిమ్ సపోర్ట్ మరియు డ్యూయల్ 5G సామర్థ్యాలతో సరసమైన ధరలో లభించే 5G స్మార్ట్‌ఫోన్. ఇది మాలి-G57 MC2 GPU మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC ద్వారా రన్ అవుతూ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. రెడ్‌మి నోట్ 11SE కూడా ను కలిగి ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రెడ్‌మి నోట్ 11SE స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

రెడ్‌మి నోట్ 11SE స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

రెడ్‌మి నోట్ 11SE కొత్త స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్ లలో లాంచ్ అయింది. ఇందులో 4GB RAM + 12GB స్టోరేజ్ మోడల్ ధర CNY 1,099 (దాదాపు రూ. 13,000) మరియు 8GB RAM + 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ మోడల్ CNY 1,399 (సుమారు రూ. 16,000) ధరతో డీప్ స్పేస్ బ్లూ మరియు షాడో బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఇది అధికారిక షియామి చైనా సైట్‌లో చైనాలో ప్రీ-ఆర్డర్ పద్ధతిలో పొందడానికి అందుబాటులో ఉంది. ఇది మే 31 నుండి మొదటిసారి అమ్మకానికి వస్తుంది.

Airtel, Jio, Vi టెల్కోలు ప్రీపెయిడ్ టారిఫ్‌లను మరోసారి పెంచనున్నాయి!!Airtel, Jio, Vi టెల్కోలు ప్రీపెయిడ్ టారిఫ్‌లను మరోసారి పెంచనున్నాయి!!

రెడ్‌మి నోట్ 11SE స్పెసిఫికేషన్స్

రెడ్‌మి నోట్ 11SE స్పెసిఫికేషన్స్

రెడ్‌మి నోట్ 11SE స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే డ్యూయల్ సిమ్ (5G + 5G) స్మార్ట్‌ఫోన్, ఇది బ్లూటూత్ v5.1 మరియు డ్యూయల్-బ్యాండ్ Wi-Fiతో వస్తుంది. అలాగే ఇది అడాప్టివ్ Sync టెక్నాలజీతో 6.5-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది తగినంత విద్యుత్ వినియోగం కోసం స్వయంచాలకంగా 30Hz, 50Hz, 60Hz మరియు 90Hz రిఫ్రెష్ రేట్ల మధ్య మారుతూ ఉంటుంది. ఇది హుడ్ కింద మాలి-G57 MC2 GPUతో పాటు మీడియాటెక్ డైమెన్సిటీ SoCతో ప్యాక్ చేయబడి 8GB వరకు LPDDR4 RAM మరియు 128GB UFS 2.2 స్టోరేజీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత MIUI 12.5 పై రన్ అవుతుంది.

ఆప్టిక్స్

రెడ్‌మి నోట్ 11SE స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో f/1.79 ఎపర్చరుతో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, f/2.4 ఎపర్చర్‌తో 2-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి.అలాగే సెల్ఫీలు మరియు వీడియో చాట్ల కోసం ముందు భాగంలో f/2.0 ఎపర్చర్‌తో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ కెమెరాను అమర్చబడి ఉంటుంది. ఈ రెండు కెమెరా సెటప్‌లు 30 fps వద్ద పూర్తి-HD వీడియోలను రికార్డ్ చేయగలవు. ఈ హ్యాండ్‌సెట్‌ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Best Mobiles in India

English summary
Redmi Note 11SE Smartphone Launched With Mali-G57 MC2 GPU and Dimensity 700 SoC: Price, Specs, India Launch Date and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X