Home
News

ట్రిపుల్‌ కెమెరా, 5000mAh బ్యాటరీ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌ ధర తగ్గింపు.. బ్యాంకు కార్డులతో మరో రూ.1500 తగ్గింపు!

రెడ్‌మీ నోట్ 13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు త్వరలో భారత్‌ మార్కెట్‌లోకి లాంచ్ కానున్నాయి. ఈ ఫోన్లు రెడ్‌మీ నోట్‌ 12 సిరీస్‌కు తర్వాత తరం హ్యాండ్‌సెట్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రెడ్‌మీ నోట్ 12 4G (Redmi Note 12 4G) స్మార్ట్‌ఫోన్‌ ధరను తగ్గించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను గతంలో రూ.14999కు అందుబాటులో ఉండేది. ప్రస్తుతం తగ్గింపు ధరను పొందింది.

రెడ్‌మీ నోట్‌ 12 4G స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.11,999 మరియు రూ.13,999 ధరలకు కొనుగోలు చేయవచ్చు. HDFC, SBI, యాక్సెస్‌ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1500 అదనపు తగ్గింపును పొందుతారు. ఫలితంగా ఈ ఫోన్‌ ధరలు రూ.10499, 12499కు అందుబాటులోకి వస్తాయి. ఈ స్మార్ట్‌ఫోన్లు లూనార్ బ్లాక్‌, సన్‌రైజ్‌ గోల్డ్‌, ఐస్‌ బ్లూ రంగుల్లో లభిస్తుంది.

redmi-note-12-4g

రెడ్‌మీ నోట్‌ 12 4G స్పెసిఫికేషన్లు : ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్‌ మరియు 1200 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. డిస్‌ప్లే కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ 3 రక్షణను పొందుతుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ అండర్‌ ది హుడ్‌ స్నాప్‌డ్రాగన్‌ 685 చిప్‌ మరియు అడెన్నో 610తో జతచేయబడి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14 పైన పనిచేస్తుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ డ్యూయల్‌ సిమ్‌ 4G, వైఫై 802.11, బ్లూటూత్‌ 5.0, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంటుంది.

రెడ్‌మీ నోట్‌ 12 4G స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్‌ 64GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌, 64GB ర్యామ్‌, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. రూ.11,999 మరియు రూ.13,999 ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది.

కెమెరా విభాగం విషయానికి వస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌ 50MP ISOCELL ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. మరియు 8MP అల్ట్రావైడ్‌ సెన్సార్‌, 2MP మాక్రో సెన్సార్‌ను కలిగి ఉంది. మరియు ముందువైపు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ హ్యాండ్‌సెట్‌ 16MP కెమెరాను కలిగి ఉంది.

* రెడ్‌మీ నోట్‌ 13 5G సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు జనవరి 4న విడుదల కానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్లు ఇప్పటికే చైనాలో విడుదల అయ్యాయి. భారత్‌లో ఈ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు రెడ్‌మీ నోట్‌ 13 5G, రెడ్‌మీ నోట్‌ 13 ప్రో 5G, రెడ్‌మీ నోట్‌ 13 ప్రో+ 5G గా విడుదల కానున్నాయి. ఈ సిరీస్‌ గురించి ఇప్పటికే అనేక వివరాలు లీక్ అయ్యాయి.

టిప్‌స్టర్‌ అభిషేక్‌ యాదవ్ X (ట్విట్టర్‌) వేదికగా ఈ రెడ్‌మీ నోట్‌ 13 5G సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల ధర వివరాలను వెల్లడించారు. ఈ ఫోస్ట్ ఆధారంగా 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.20,999గా ఉంది. అదే 8GB ర్యామ్‌ +256GB స్టోరేజీ ధర రూ.22,999 గా ఉంది. 12GB ర్యామ్‌ +256GB స్టోరేజీ ధర రూ.24999 గా ఉంది.

రెడ్‌మీ నోట్‌ 13 ప్రో 5G 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.28,999 గా ఉంటుంది. 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.32999గా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ వేరియంట్‌ ఆర్కిటిక్‌ వైట్‌, కోరల్‌ పర్పల్‌, మిడ్‌నైట్‌ బ్లాక్‌ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. అయితే ప్రో + మోడల్‌ ఫ్యూజన్‌ వైట్‌, ఫ్యూజన్‌ పర్పల్‌, ఫ్యూజన్‌ బ్లాక్‌ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi note 12 4G smartphone price slashed in india ahead of redmi note 13 series launch
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X