Home
News

Redmi స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.7 వేలు తగ్గింపు.. అమెజాన్‌లో సేల్‌..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రెడ్‌మీ నోట్‌ 12 స్మార్ట్‌ఫోన్‌ ( Redmi Note 12 ) భారీగా ఆదరణ పొందింది. డిజైన్‌, ఫీచర్ల పరంగా ఆకట్టుకుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌లో భారీ తగ్గింపును పొందింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 685 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది.

రెడ్‌మీ నోట్‌ 12 4G స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌లో 6GB ర్యామ్, 64GB స్టోరేజీ వేరియంట్‌ రూ.18999 ధరకు కొనుగోలుకు అందుబాటులో ఉండేది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌పై 37 శాతం డిస్కౌంట్‌ ఇచ్చారు. ఫలితంగా ఈ ఫోన్‌ ధర రూ.11,999కి తగ్గింది. దీంతోపాటు అందుబాటులో ఉన్న బ్యాంక్‌ ఆఫర్ల ద్వారా ఫోన్ ధర మరింత తగ్గే అవకాశం ఉంది.

Redmi Note 12 smartphone

రెడ్‌మీ నోట్‌ 12 స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల పుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1080*2400 పిక్సల్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంటుంది. 240Hz టచ్‌ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. ఈ డిస్‌ప్లే రక్షణకు కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ రక్షణ కలిగి ఉంటుంది.

రెడ్‌మీ నోట్ 12 స్మార్ట్‌ఫోన్‌ క్వాల్‌కాం స్నా్ప్‌డ్రాగన్‌ 685 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఓఎస్‌పై పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్ + 64GB స్టోరేజీ, 6GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది.

Redmi Note 12 smartphone

కెమెరా విభాగం విషయానికి వస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా, 8MP ఆల్ట్రావైడ్‌ కెమెరా, 2MP మాక్రో లెన్స్‌ ఉన్నాయి. ముందువైపు 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. మరియు ఈ స్మార్ట్‌ఫోన్ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. యాక్సిలరోమీటర్‌, గైరో సెన్సార్‌, ప్రాక్సిమిటీ సెన్సార్‌, కంపాస్‌ ఉంటాయి.

రెడ్‌మీ నోట్‌ 12 4G స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్‌ సిమ్‌ను సపోర్టు చేస్తుంది. డస్ట్‌ స్ప్లాష్‌ రెసిస్టెన్స్‌లో IP53 రేటింగ్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ వైఫై 802.11, బ్లూటూత్ 5.0, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంటుంది. మరియు OTGని సపోర్టు చేస్తుంది. సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ ఫీచర్‌ను కలిగి ఉంటుంది.

రెడ్‌మీ నోట్‌ 12 4G స్మార్ట్‌ఫోన్‌ మింట్‌ గ్రీన్‌, ఐస్ బ్లూ, ‌గ్రే రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. అమెజాన్‌లో ఈ ఫోన్‌పై 37 శాతం తగ్గింపు ఉంది. అంటే సుమారు 7 వేల రూపాయల ధర తగ్గింది. అయితే ఈ ఆఫర్‌ ఎప్పటి వరకు ఉంటుందో అమెజాన్, రెడ్‌మీ వెల్లడించలేదు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi Note 12 price drop by 37 percentage in amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X