Home
News

200MP కెమెరా తో, Redmi Note 13 5G సిరీస్ ఇండియా లాంచ్ తేదీ!

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు రెడ్‌మి నుంచి కొత్త రెడ్‌మి నోట్ 13 5G సిరీస్‌ను జనవరి 4న భారతదేశంలో లాంచ్ చేయనున్నట్లు సంస్థ ధృవీకరించింది. రెడ్‌మి నోట్ 13 సిరీస్‌లో 3 స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి - రెడ్‌మి నోట్ 13, రెడ్‌మి నోట్ 13 ప్రో మరియు రెడ్‌మి నోట్ 13 ప్రో+.

Redmi Note13 సిరీస్ అంచనా స్పెసిఫికేషన్ల వివరాలు:
ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో చైనా లో లాంచ్ చేసిన ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లను అధికారికంగా త్వరలోనే ఇండియాలో ఆవిష్కరించనున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క భారత వేరియంట్‌లు కూడా ఒకే విధమైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటాయని భావిస్తున్నారు.

Redmi Note 13 5G Series Set To Launch On January 4 In India. Expected Price, Specifications Details.

చైనాలో, ఈ మూడు ఫోన్‌లు ముందు భాగంలో 6.67-అంగుళాల అమోలెడ్ ప్యానెల్‌తో లాంచ్ చేయబడ్డాయి, అయితే ప్రో వెర్షన్‌లు బేస్ వేరియంట్‌లోని పూర్తి HD+ రిజల్యూషన్‌తో పోలిస్తే 1.5K డిస్‌ప్లేను పొందాయి. అంతేకాకుండా, ప్రో వేరియంట్‌లో ఫ్లాట్ స్క్రీన్‌తో పోలిస్తే ప్రో + వేరియంట్ వంపు డిస్‌ప్లేతో వచ్చింది.

ప్రాసెసర్ పరంగా వివరాలు గమనిస్తే, ఈ రెడ్ మీ నోట్ 13 సిరీస్ ఫోన్లు మీడియా టెక్ డైమెన్సిటీ 6080 SoC ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది, అయితే నోట్ 13 ప్రో స్నాప్ డ్రాగన్ 7s జెన్ 2పై నడుస్తుంది మరియు టాప్ మోడల్ Redmi Note 13 Pro+ లో మీడియా టెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా SoC ప్రాసెసర్ ఉంటుంది.

రెడ్‌మి నోట్ 13 సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం 16MP షూటర్‌తో పాటు 100MP ప్రైమరీ సెన్సార్ మరియు 2MP డెప్త్ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. వీటిలో , Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro+ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నాయి.

Redmi Note 13 Pro మోడల్‌లు శాంసంగ్ HP3 సెన్సార్‌తో 200MP ప్రైమరీ కెమెరాతో వస్తాయి మరియు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 2MP మాక్రో సెన్సార్‌కి మద్దతునిస్తాయి.

అంచనా ధర వివరాలు:
భారతదేశంలో రెడ్‌మి నోట్ 13 సిరీస్ యొక్క అధికారిక ధర జనవరి 4న స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేసిన తర్వాత మాత్రమే తెలుస్తుంది, ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క చైనా ధర కు దగ్గరగానే రెడ్‌మి రాబోయే ఫోన్ యొక్క ఇండియా ధరలు ఉంటాయని అంచనా వేయవచ్చు

Redmi Note 13 చైనాలో CNY 1,199 ధరతో లాంచ్ చేయబడింది, అంటే ఇది భారత కరెన్సీ లో దాదాపు ₹14,000 కి మారుతుంది. ఇంకా, హై-ఎండ్ Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro+ చైనాలో CNY 1,499 (సుమారు ₹17,600) మరియు CNY 1,999 (సుమారు ₹23,500)కి లాంచ్ చేయబడ్డాయి.

ఈ నెలలోనే, షియోమీ సంస్థ నుంచి Redmi 13C 5G స్మార్ట్ ఫోన్ కూడా ఇండియాలో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. Redmi 12C లాంచ్ అయిన ఆరు నెలల తర్వాత ఇది లాంచ్ అయింది. అయితే ఈ ఫోన్ కొన్ని భారీ అప్‌డేట్‌లను అందిస్తుంది. ఈ అప్‌డేట్‌లలో ప్రధానమైనది 5G-కనెక్టివిటీ ఫీచర్. ఇది Xiaomi యొక్క ఎంట్రీ లెవల్ నుండి బడ్జెట్ సెగ్మెంట్‌లో అతి తక్కువ ధరతో వచ్చే 5G ఫోన్ అవుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi Note 13 5G Series Set To Launch On January 4 In India. Expected Price, Specifications Details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X