Home
News

రెడ్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ కీలక వివరాలు లీక్‌.. మార్కెట్లోకి మూడు రోజుల్లో విడుదల..!

రెడ్‌మీ నోట్‌ 13 5G సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు (Redmi Note 13 5G) జనవరి 4న విడుదల కానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్లు ఇప్పటికే చైనాలో విడుదల అయ్యాయి. భారత్‌లో ఈ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు రెడ్‌మీ నోట్‌ 13 5G, రెడ్‌మీ నోట్‌ 13 ప్రో 5G, రెడ్‌మీ నోట్‌ 13 ప్రో+ 5G గా విడుదల కానున్నాయి. ఈ సిరీస్‌ గురించి తాజా వివరాలు లీక్‌ అయ్యాయి.

టిప్‌స్టర్‌ అభిషేక్‌ యాదవ్ X (ట్విట్టర్‌) వేదికగా ఈ రెడ్‌మీ నోట్‌ 13 5G సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల ధర వివరాలను వెల్లడించారు. ఈ ఫోస్ట్ ఆధారంగా 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.20,999గా ఉంది. అదే 8GB ర్యామ్‌ +256GB స్టోరేజీ ధర రూ.22,999 గా ఉంది.

Redmi Note 13 5G series smartphone

12GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ ధర రూ.24,999 గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రిజమ్‌ గోల్డ్‌, ఆర్కిటిక్‌ వైట్‌ మరియు స్టెల్త్‌ బ్లాక్‌ రంగుల్లో అందుబాటులో ఉంటుందని టిప్‌స్టర్‌ అభిషేక్‌ యాదవ్‌ తన X (ట్విట్టర్‌) ఫోస్టులో వెల్లడించారు.

రెడ్‌మీ నోట్‌ 13 ప్రో 5G.. 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.28,999 గా ఉంటుంది. 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.32999గా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ వేరియంట్‌ ఆర్కిటిక్‌ వైట్‌, కోరల్‌ పర్పల్‌, మిడ్‌నైట్‌ బ్లాక్‌ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. అయితే ప్రో + మోడల్‌ ఫ్యూజన్‌ వైట్‌, ఫ్యూజన్‌ పర్పల్‌, ఫ్యూజన్‌ బ్లాక్‌ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

ఇప్పటి వరకు లీకైన స్పెసిఫికేషన్ల ఆధారంగా రెడ్‌మీ నోట్‌ 13 5G స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 2400*1080 పిక్సల్ రిజల్యూషన్‌తో వస్తుంది. మరియు హ్యాండ్‌సెట్‌ 120Hz రీఫ్రెష్ రేట్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంటుంది.

మీడియాటెక్‌ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్‌ 6nm ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఇది Mail G57 MC2 GPUతో జతచేయబడుతుంది. 108MP ప్రధాన కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్‌ లెన్స్‌ మరియు 2MP మాక్రో సెన్సార్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను కలిగి ఉంటుంది.

రెడ్‌మీ నోట్‌ 13 ప్రో 5G స్పెసిఫికేషన్లు: ఈ స్మార్ట్‌ఫోన్‌ 4nm స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్ 2 ప్రాసెసర్‌తో వస్తుంది. గ్రాఫిక్స్‌ కోసం అడెన్నో 710 GPU చిప్‌ను కలిగి ఉంటుంది. అలాగే ప్రో + హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇది Mail G610 MC4 GPU తో జతచేయబడుతుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Redmi Note 13 5G series smartphone key specifications leaked ahead of launch on January 4th
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X