Home
News

200MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌ ధర తగ్గింపు.. ధర, సేల్‌ వివరాలు

ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం Flipkart Month End Mobiles Fest Sale పేరుతో ప్రత్యేక సేల్‌ నడుస్తోంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ ప్రత్యేక సేల్‌లో రెడ్‌మీ నోట్‌ 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. రూ.25,000 ధర సెగ్మెంట్‌లో కొత్త ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తుంటే ఈ కథనం మీకోసమే.

రెడ్‌మీ నోట్‌ 13 ప్రో స్పెసిఫికేషన్లు : రెడ్‌మీ నోట్‌ 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల 1.5k అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. దీంతోపాటు డిస్‌ప్లే రక్షణకు గొరెల్లా గ్లాస్‌ విక్టస్‌ రక్షణను పొందుతుంది.

Redmi Note 13 Pro Smartphone gets price discount on flipkart

ఈ రెడ్‌మీ నోట్‌ 13 ప్రో హ్యాండ్‌సెట్‌ స్నాప్‌ డ్రాగన్‌ 7s జెన్‌ 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ చిప్‌ అడెన్నో A710 GPU తో జతచేయబడుతుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత MIUI 14 OS పైన పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 67W ఛార్జింగ్‌ సపోర్టుతో 5100mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

ఈ రెడ్‌మీ హ్యాండ్‌సెట్‌ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాను కలిగి ఉంటుంది. OIS సపోర్టుతో 200MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్‌, 2MP మాక్రో లెన్స్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు బ్లూటూత్‌ 5.2, వైఫై 6, USB-C పోర్టు, 3.5mm హెచ్‌ఫోన్‌ జాక్‌ సహా భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ను కలిగి ఉంటుంది.

రెడ్‌మీ నోట్‌ 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌ (Redmi Note 13 Pro) 8GB ర్యామ్‌ +128GB వేరియంట్‌ ధర రూ.25,999గా ఉంది. అదే 8GB ర్యా్మ్‌ +256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.27999, 12GB ర్యామ్‌+ 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.29,999 గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆర్కిటిక్‌ వైట్‌, కోరల్‌ పర్పల్‌ మరియు మిడ్‌నైట్‌ బ్లాక్‌ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

ఈ ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేక సేల్‌లో భాగంగా యాక్సిస్‌ బ్యాంక్‌, HDFC, ICICI, SBI బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేసిన లేదా EMI లావాదేవీలు నిర్వహించినా రూ.2000 తగ్గింపును పొందవచ్చు. ఎంపిక చేసిన మోడళ్లను ఎక్చ్సేంజీ చేయడం ద్వారా రూ.2500 అదనపు తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు Spotify ప్రీమియం 12 నెలల ప్లాన్‌ను రూ.699 కే కొనుగోలు చేయవచ్చు.

అదే Mi.com ద్వారా ICICI, HDFC బ్యాంకు కార్డులు సహా ICICI నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా కొనుగోలు చేసిన కస్టమర్లు రూ.2000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు రెడ్‌మీ/ షియోమీ స్మార్ట్‌ఫోన్ల ఎక్స్చేంజీ చేయడం ద్వారా అదనంగా రూ.2500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు రెడ్‌మీ వాచ్‌ 3 యాక్టివ్‌ ను రూ.1999 కే సొంతం చేసుకోవచ్చు. మరియు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లను పొందవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi Note 13 Pro Smartphone gets price discount on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X