Home
News

Redmi నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్లు.. 200MP కెమెరా, 5100mAh బ్యాటరీ..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ రెడ్‌మీ నుంచి Redmi Note 13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను త్వరలో భారత్‌లో లాంచ్‌ చేయనుందని తెలుస్తోంది. కొన్ని వారాల క్రితం ఈ ఫోన్లు చైనాలో లాంచ్‌ అయ్యాయి. అయితే భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోన్లు లాంచ్‌ కానున్నాయని సమాచారం. ఈ సంవత్సరం చివర నాటికి విడుదల అయ్యే అవకాశం ఉంది.

Gizmochina నివేదిక ప్రకారం రెడ్‌మీ నోట్‌ 13 ప్రో ఫోన్ (Redmi Note 13 series).. సింగపూర్‌ IMDA సర్టిఫికేషన్‌లో లిస్టింగ్‌ అయిన తర్వాత కొరియా నేషనల్‌ రేడియా రీసెర్ట్‌ ఏజెస్సీలో కనిపించినట్లు తెలుస్తోంది. ఈ మోడల్‌ 2312RA50G నంబర్‌తో అక్టోబర్‌ 16న సర్టిఫికేషన్‌ పొందినట్లు సమాచారం. ఈ మోడల్‌ రెడ్‌మీ నోట్‌ 13 ప్రోగా తెలుస్తోంది.

Redmi Note 13 series smartphones

రెడ్‌మీ నోట్‌ 13, నోట్‌ 13 ప్రో, 13 ప్రో ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లు (Redmi Note 13) ఈ సంవత్సరం చివరలోగా లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. చైనాలో విడుదలైన మోడల్‌లోనే భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా లాంచ్‌ కానున్నాయని తెలుస్తోంది. అయితే ఈ ఫోన్‌ 30000 రూపాయల కంటే తక్కువ సెగ్మెంట్‌లో విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే విడుదల తేదీపై రెడ్‌మీ సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

రెడ్‌మీ నోట్‌ 13 ప్రో 5G స్పెసిఫికేషన్లు : ఈ కొత్త రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల 1.5k అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ హ్యండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్ 7s జెన్‌ 2 CPU మరియు అడెన్నో 710 GPU ప్రాసెసర్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు MIUI 14 ఆధారంగా పనిచేయనుందని తెలుస్తోంది.

ఈ ఫోన్‌ 67W ఛార్జింగ్‌ సపోర్టుతో 5100mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు ఈ ఫోన్ వెనుకవైపు 200MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ కెమెరా, 2MP మాక్రో కెమెరాలను కలిగి ఉంటుంది. ముందువైపు 16MP కెమెరాను అమర్చినట్లు తెలుస్తోంది. రెడ్‌మీ నోట్‌ 13 ప్రో ప్లస్‌ తాజాగా BIS సర్టిఫికేషన్‌ పొందినట్లు తెలుస్తోంది.

అయితే ఈ రెడ్‌మీ నోట్‌ 13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు ఎప్పుడు విడుదల కానున్నాయనే కచ్చితమైన సమాచారం లేదు. కానీ ఈ సంవత్సరం చివరలోగా లాంచ్‌ చేస్తారని తెలుస్తోంది. అయితే ఈ స్పెసిఫికేషన్లు సహా ఇతర వివరాలపై రెడ్‌మీ సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ సిరీస్‌ ఫోన్లు ఇప్పటికే చైనాలో విడుదల కాగా.. త్వరలో భారత్‌ సహా గ్లోబల్‌గా విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi Note 13 series smartphones will be launched soon in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X