రెడ్‌మి నోట్ 8 (2021) కొత్త ఫోన్ ఫీచర్స్ లీక్ అయ్యాయి!! మీరు ఓ లుక్ వేయండి..

|

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఇండియాలో కొత్తగా మరొక ఫోన్‌ను విడుదల చేయడానికి తన యొక్క ప్రయత్నాలను మొదలుపెట్టింది. రెడ్‌మి నోట్ 8 (2021) పేరుతో రాబోతున్న కొత్త స్మార్ట్‌ఫోన్‌ను షియోమి కంపెనీ ఇప్పటికే సోషల్ మీడియాలో భారీగా మార్కెట్ చేస్తోంది. అంతేకాకుండా తాజా టీజర్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ యొక్క డిజైన్ మరియు కీ స్పెసిఫికేషన్ల వివరాలను వెల్లడించింది. ఈ రెడ్‌మి నోట్ 8 (2021) ఫోన్ యొక్క డిజైన 2019 లో లాంచ్ అయిన రెడ్‌మి నోట్ 8 యొక్క డిజైన్ ఫ్రేమ్‌ వలె ఉన్నట్లు అనిపిస్తుంది. ఫోన్ యొక్క కలర్ ఎంపికలు కూడా టీజర్‌లో వెల్లడయ్యాయి. అయితే దాని ఖచ్చితమైన లాంచ్ తేదీ వివరాలను వెల్లడికాలేదు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

గ్లోబల్ లాంచ్‌

షియోమి తన గ్లోబల్ లాంచ్‌కు ముందే రెడ్‌మి నోట్ 8 (2021) యొక్క ముఖ్య ఫీచర్స్ మరియు డిజైన్ వివరాలను ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. షియోమి తెలిపిన వివరాల ప్రకారం రెడ్‌మి నోట్ 8 (2021) మూడు వైపులా సన్నని బెజెల్స్‌ నిర్మాణంను కలిగి ఉండి దిగువ భాగాన వాటర్‌డ్రాప్ తరహా గీతను కలిగి ఉంది. ఈ ఫోన్ వైట్ మరియు బ్లూ వంటి రెండు కలర్ లలో వస్తుంది. టీజర్‌లో చూసినట్లుగా బోర్డులో వెనుకవైపున ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ ఫోన్‌లో కూడా 2019 రెడ్‌మి నోట్ 8 మాదిరిగానే క్వాడ్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది.

రెడ్‌మి నోట్ 8 (2021)

రెడ్‌మి నోట్ 8 (2021) యొక్క టీజర్‌లో చూపిన నాలుగు కెమెరాలు ఒకదానికొకటి పొడుగుచేసిన క్యాప్సూల్ ఆకారపు కెమెరా మాడ్యూల్‌లో ఉంచబడ్డాయి అలాగే వీటి పక్కన ఫ్లాష్ కూడా ఉంది. రెడ్మి నోట్ 8 (2021) క్వాడ్ కెమెరా సెటప్‌లో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉంటుందని టీజర్స్ పేర్కొన్నాయి. ఈ ఫోన్ 6.3-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది.

టీజర్

రెడ్‌మి నోట్ 8 (2021) యొక్క ఇటీవలి టీజర్ ప్రకారం ఈ ఫోన్‌ మీడియాటెక్ హెలియో G85 ఆక్టా-కోర్ Soc ద్వారా శక్తినిపొందుతుంది అని పేర్కొంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 665 SoC చేత శక్తినిచ్చే 2019 మోడల్ కంటే భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు చాలా టీజర్లు విడుదల కావడంతో ఇది త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Redmi Note 8 (2021) Teaser Revealed Features and Specifications Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X