Redmi Note 9 Launch: సరసమైన ధరలో రెడ్‌మి కొత్త ఫోన్ లాంచ్!!! ఫీచర్స్ బ్రహ్మాండం...

|

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ షియోమి ఈ రోజు సరికొత్త మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మి నోట్ 9 ను భారత్‌లో విడుదల చేసింది. రెడ్‌మి నోట్ 9 సిరీస్‌లో రెడ్‌మి నోట్ 9 ప్రో మరియు రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ తర్వాత విడుదల అయిన మూడవ బేస్ మోడల్ ఫోన్ ఇది.

రెడ్‌మి నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్

రెడ్‌మి నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్

కొత్త రెడ్‌మి నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌ క్వాడ్ రియర్ కెమెరా సెటప్,హోల్-పంచ్ డిస్ప్లే డిజైన్‌, మీడియా టెక్ హెలియో G85 SoC మరియు 6GB RAM వంటి స్పెసిఫికేషన్లను మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లో తీసుకువస్తున్నది. ఈ ఫోన్ శామ్‌సంగ్ గెలాక్సీ A21s, ఒప్పో A9 2020 మరియు వివో S1 ప్రోలకు పోటీగా విడుదల అయింది. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రెడ్‌మి నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌ ధరల వివరాలు
 

రెడ్‌మి నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌ ధరల వివరాలు

ఇండియాలో రెడ్‌మి నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌ మూడు వేరియంట్‌లలో విడుదల చేసారు. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ.11,999 లు కాగా 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఆప్షన్ యొక్క ధర రూ.13,499 కాగా చివరిది టాప్-ఆఫ్-ది-లైన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.14,999. ఇది ఆక్వా గ్రీన్, ఆర్కిటిక్ వైట్ మరియు పెబుల్ గ్రే అనే మూడు విభిన్న కలర్ ఎంపికలలో లభిస్తుంది. రెడ్‌మి నోట్ 9 ఫోన్ యొక్క అమ్మకం మొదటిసారిగా జూలై 24 శుక్రవారం నుండి అమెజాన్, Mi.కామ్, మరియు Mi హోమ్ స్టోర్స్‌ ద్వారా మధ్యాహ్నం 12 గంటల నుండి దేశంలో మొదలు కానుంది.

 

Also Read: Jio-Google ఒప్పందం!!! చైనా బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లకు గడ్డు కాలం మొదలైనట్లే...Also Read: Jio-Google ఒప్పందం!!! చైనా బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లకు గడ్డు కాలం మొదలైనట్లే...

రెడ్‌మి నోట్ 9 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

రెడ్‌మి నోట్ 9 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

రెడ్‌మి నోట్ 9 స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 లో MIUI 11 తో రన్ అవుతుంది. ఇది 6.53-అంగుళాల ఫుల్-హెచ్‌డి + డిస్ప్లేని 1,080x2,340 పిక్సెల్స్ పరిమాణంలో మరియు 19.5: 9 కారక నిష్పత్తితో కలిగి ఉంటుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G85 SoC ను కలిగి ఉండి 6GB వరకు ర్యామ్ తో జతచేయబడి ఉంటుంది.

 

Also Read: Realme X2లో మరో కొత్త వేరియంట్!!! 2రోజులలో సేల్స్ ప్రారంభం...Also Read: Realme X2లో మరో కొత్త వేరియంట్!!! 2రోజులలో సేల్స్ ప్రారంభం...

రెడ్‌మి నోట్ 9 స్మార్ట్‌ఫోన్ కెమెరా సెటప్

రెడ్‌మి నోట్ 9 స్మార్ట్‌ఫోన్ కెమెరా సెటప్

రెడ్‌మి నోట్ 9 స్మార్ట్‌ఫోన్ యొక్క వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా శామ్సంగ్ ఐసోసెల్ బ్రైట్ GM1 సెన్సార్‌తో పాటు ఎఫ్ / 1.79 లెన్స్‌ను కలిగి ఉంటుంది. కెమెరా సెటప్‌లో ఎఫ్ / 2.2 అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, ఎఫ్ / 2.4 మాక్రో లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ కెమెరా మరియు ఎఫ్ / 2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం ఫోన్ యొక్క ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరా అమర్చబడి ఉన్నాయి.

రెడ్‌మి నోట్ 9 స్మార్ట్‌ఫోన్ సెన్సార్లు

రెడ్‌మి నోట్ 9 స్మార్ట్‌ఫోన్ సెన్సార్లు

రెడ్‌మి నోట్ 9 స్మార్ట్‌ఫోన్ 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఎంపికను కలిగి ఉంటుంది. అలాగే ఇందులో గల మైక్రో SD కార్డ్ ప్రత్యేక స్లాట్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించవచ్చు. ఈ ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో 4G VoLTE, Wi-Fi 802.11 a / b / g / n, బ్లూటూత్ v5.0, GPS / A-GPS, USB టైప్-C పోర్ట్ మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. రెడ్‌మి నోట్ 9 లోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, ఇన్‌ఫ్రారెడ్ (IR) బ్లాస్టర్ మరియు సామీప్య సెన్సార్ వంటివి ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.

రెడ్‌మి నోట్ 9 స్మార్ట్‌ఫోన్ డిజైన్

రెడ్‌మి నోట్ 9 స్మార్ట్‌ఫోన్ డిజైన్

రెడ్‌మి నోట్ 9 స్మార్ట్‌ఫోన్ 1216 లీనియర్ స్పీకర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ P2i హైడ్రోఫోబిక్ నానో పూతని కలిగి ఉంది. ఇంకా ఈ ఫోన్ 5,020mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే ఇది 22.5W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. అలాగే ఈ బ్యాటరీ 9W రివర్స్ ఛార్జింగ్ కు కూడా మద్దతు ఇస్తుంది. ఇది 162.3x77.2x8.9mm కొలతల పరిమాణంలో వస్తుంది.

Best Mobiles in India

English summary
Redmi Note 9 Mid-Range Smartphone Launched in India: Price, Specs and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X