Redmi Note 9 Pro Max Sale: 6.67-inch డిస్‌ప్లే,8GB RAM ఫీచర్లతో అందుబాటు ధరలో ఫోన్ సేల్
ఇండియాలో చైనా యొక్క వస్తువుల మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ షియోమి సంస్థ యొక్క స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రం డిమాండ్ తగ్గడం లేదు. పైగా ఇవి ఇప్పుడు "మేడ్ ఇన్ ఇండియా" అనే ట్యాగ్ తో అందుబాటులోకి వస్తున్నాయి. లాక్ డౌన్ సమయంలో లాంచ్ అయిన రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ కరోనా మహమ్మారి కారణంగా ఫ్లాష్ అమ్మకాల ద్వారా మాత్రమే కొనుగోలు చేయడానికి వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నది. ఈ రోజు మరోసారి ఇండియాలో ఈ ఫోన్ అమ్మకానికి రానున్నది.

రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ ఫోన్ సేల్
ప్రస్తుతం ఇండియాలో కేవలం ఫ్లాష్ అమ్మకాల ద్వారా మాత్రమే కొనుగోలు చేయడానికి అందుబాటులోకి వస్తున్న రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720G SoC మరియు 5,020mAh అతి పెద్ద బ్యాటరీ, క్వాడ్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ ను కొనుగోలు చేయదలచిన వారు అమెజాన్ మరియు Mi.com ద్వారా మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ ధరల వివరాలు
రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ ప్రస్తుతం ఇండియాలో మూడు వేరియంట్ లలో లభిస్తుంది. ఇందులో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.19,999 కాగా 6GB ర్యామ్ + 64GB ఇంటర్నల్ స్టోరేజ్ బేస్ మోడల్ యొక్క ధర రూ.16,999 అలాగే 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.18,499. వీటిని అరోరా బ్లూ, గ్లాసియర్ వైట్ మరియు ఇంటర్స్టెల్లార్ బ్లాక్ అనే మూడు కలర్ ఎంపికలలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.

రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ 6.67-అంగుళాల IPS డిస్‌ప్లే
రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 10 మరియు MIUI 11 తో రన్ అవుతూ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల ఫుల్-హెచ్‌డి + IPS డిస్‌ప్లేను 20: 9 కారక నిష్పత్తితో మరియు 1080x2400 పిక్సెల్స్ పరిమాణంలో వస్తుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ను కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720G SoC, అడ్రినో 618 GPU ను కలిగి ఉండి 6GB LPDDR4X RAMతో జతచేయబడి వస్తుంది.

రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్
రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720G మొబైల్ ప్లాట్‌ఫామ్‌తో రన్ అవుతూ 8GB LPDDR4X ర్యామ్‌తో మరియు 128GB UFS 2.1 స్టోరేజ్‌తో జతచేయబడి వస్తుంది. ఇందులో గల ప్రత్యేకమైన SD కార్డ్ స్లాట్ మద్దతుతో మెమొరిని మరింత విస్తరించవచ్చు. రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్ తో 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు ఒకదానితో ఒకటి జత చేయబడి ఉంటాయి. అలాగే ఫోన్ ముందు భాగంలో సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ ఫీచర్స్
రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇందులో డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, GPS / A-GPS, NavIC, USB Type-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ సైడ్-మౌంటెడ్ సెన్సార్‌తో వస్తుంది మరియు బాటమ్-ఫైరింగ్ స్పీకర్లతో పాటు శబ్దం రద్దు మద్దతుతో డ్యూయల్ మైక్రోఫోన్‌లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








