Android 11 తాజా అప్‌డేట్‌ను స్వీకరిస్తున్న రెడ్‌మి నోట్ 9 ప్రో...

|

ఇండియాలో మిడ్-రెంజ్ ధరలో విడుదల అయిన రెడ్‌మి నోట్ 9 ప్రో స్మార్ట్ ఫోన్ ఇటీవల ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్‌ను స్వీకరించడం ప్రారంభించింది. ఈ కొత్త అప్‌డేట్‌ ప్రారంభంలో ఎంపిక చేసిన కొంత మంది వినియోగదారులకు మాత్రమే పరిమితం చేయబడింది. అయితే రాబోయే రోజుల్లో రెడ్‌మి నోట్ 9 ప్రో వినియోగదారులకు అందరికి ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్‌ను పొందే అవకాశాలు ఉన్నాయి. షియోమి సంస్థ మార్చిలో రెడ్‌మి నోట్ 9తో పాటు రెడ్‌మి నోట్ 9 ప్రోను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ మొదట ఆండ్రాయిడ్ 10 ఆధారిత MIUI 11 తో వచ్చింది. అయితే ఇది సెప్టెంబరులో MIUI 12 కు అప్‌డేట్‌ను అందించింది. ఆ అప్‌డేట్‌ రిఫ్రెష్ చేసిన ఇంటర్‌ఫేస్‌తో సహా మార్పుల జాబితాను తీసుకువచ్చింది.

రెడ్‌మి నోట్ 9 ప్రో తాజా ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్

రెడ్‌మి నోట్ 9 ప్రో తాజా ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్

రెడ్‌మి నోట్ 9 ప్రో కోసం ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్‌ను కొంతమంది వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిందని షియోమి ట్విట్టర్‌లో తెలిపింది. ట్విట్టర్‌లో చాలా మంది వినియోగదారులు పోస్ట్ చేస్తున్న వివరాల విషయానికి వస్తే తాజా రెడ్‌మి నోట్ 9 ప్రో అప్‌డేట్ స్టోరేజ్ 2.3GB గా ఉంది. ఇది ఫర్మ్‌వేర్ వెర్షన్ MIUI V12.0.1.0.RJWINXM పై ఆధారపడి ఉంటుంది. ఈ క్రొత్త సాఫ్ట్‌వేర్ వెర్షన్ స్థిరమైన ఛానెల్ ద్వారా అందుబాటులో ఉందని ఇది చూపిస్తుంది.

 

Also Read: 2020లో విడుదల అయిన అద్భుతమైన డిజైన్ స్మార్ట్ గాడ్జెట్లు ఇవే!!!Also Read: 2020లో విడుదల అయిన అద్భుతమైన డిజైన్ స్మార్ట్ గాడ్జెట్లు ఇవే!!!

రెడ్‌మి నోట్ 9 ప్రో లో ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్ తనిఖీ విధానం

రెడ్‌మి నోట్ 9 ప్రో లో ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్ తనిఖీ విధానం

ఈ తాజా ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్‌ కంటే ముందు రెడ్‌మి నోట్ 9 ప్రో సెప్టెంబరులో ఫర్మ్‌వేర్ వెర్షన్ MIUI V12.0.1.0.QJWINXM అప్‌డేట్‌ను పొందింది. ఆ అప్‌డేట్‌ MIUI 12 ను తీసుకువచ్చింది కాని ఇది Android 10 పై ఆధారపడింది. ఈ అప్‌డేట్‌ను వినియోగదారులు తమ యొక్క ఫోన్ లోని సెట్టింగ్స్> అబౌట్ ఫోన్ ఎంపికకు వెళ్ళడం ద్వారా మీరు రెడ్‌మి నోట్ 9 ప్రో యొక్క కొత్త ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్‌ను తనిఖీ చేయవచ్చు.

రెడ్‌మి నోట్ 9 ప్రో ధరల వివరాలు

రెడ్‌మి నోట్ 9 ప్రో ధరల వివరాలు

షియోమి భారతదేశంలో రెడ్‌మి నోట్ 9 ప్రోను మూడు విభిన్న కాన్ఫిగరేషన్లలో విడుదల చేసింది. ఇందులో రూ. 13,999 ప్రారంభ ధర వద్ద 4GB + 128GB స్టోరేజ్ వేరియంట్‌ను తీసుకువస్తుంది. అలాగే 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ హై-ఎండ్ మోడల్ ను రూ.16,999 ధర వద్ద పొందవచ్చు. ఈ ఫోన్ ను అరోరా బ్లూ, గ్లాసియర్ వైట్ మరియు ఇంటర్స్టెల్లార్ బ్లాక్ వంటి మూడు కలర్ ఎంపికలలో కొనుగోలు చేయవచ్చు.

రెడ్‌మి నోట్ 9 ప్రో 6.67-అంగుళాల డిస్‌ప్లే

రెడ్‌మి నోట్ 9 ప్రో 6.67-అంగుళాల డిస్‌ప్లే

రెడ్‌మి నోట్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ ను కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 మరియు MIUI 11 తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.67-అంగుళాల ఫుల్-హెచ్‌డి + IPS డిస్‌ప్లేను 20: 9 కారక నిష్పత్తితో మరియు 1080x2400 పిక్సెల్స్ పరిమాణంలో వస్తుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ 6GB LPDDR4X RAM మరియు 64GB/128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేయబడి వస్తుంది.

రెడ్‌మి నోట్ 9 ప్రో ISOCELL GM2 లెన్స్ 48-MP కెమెరా సెటప్‌

రెడ్‌మి నోట్ 9 ప్రో ISOCELL GM2 లెన్స్ 48-MP కెమెరా సెటప్‌

రెడ్‌మి నోట్ 9 ప్రో ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో f/ 1.79 లెన్స్‌తో 48 మెగాపిక్సెల్ కెమెరా శామ్‌సంగ్ ISOCELL GM2 ప్రైమరీ సెన్సార్ తో వస్తుంది. కెమెరా సెటప్‌లో మిగిలిన కెమెరాలు 120-డిగ్రీల అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, మాక్రో లెన్స్‌తో 5 మెగాపిక్సెల్ మూడవ సెన్సార్ మరియు డెప్త్ సెన్సింగ్ కోసం 2 మెగాపిక్సెల్ క్వాటర్నరీ సెన్సార్ ఉన్నాయి. అలాగే AI ఆధారిత ఫీచర్ల మద్దతుతో ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్ కూడా ఉంది.

Best Mobiles in India

English summary
Redmi Note 9 Pro Strats Receive Latest Android 11 Update in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X