Home
News

సూపర్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో అమ్మకానికి రెడ్‌మి నోట్ 9

ఇండియాలో ఈ నెల ప్రారంభంలో అద్భుతమైన ఫీచర్లతో విడుదలైన రెడ్‌మి నోట్ 9 స్మార్ట్‌ఫోన్ యొక్క రెండవ సేల్స్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి గొప్ప క్యాష్ బ్యాక్ ఆఫర్లతో అమెజాన్ మరియు సంస్థ యొక్క వెబ్‌సైట్ Mi.Com లలో మొదలయ్యాయి. రెడ్‌మి యొక్క తాజా ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G85 SoC చేత రన్ అవుతుంది. మూడు వేరువేరు ర్యామ్ మరియు స్టోరేజ్ ఆప్షన్లలో లభించే ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అలాగే ఆగస్టు 6 న జరిగే అమెజాన్ ప్రైమ్ డే 2020 లో స్కార్లెట్ రెడ్ కలర్ వేరియంట్ కూడా అమ్మకానికి రానుంది.

రెడ్‌మి నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌ ధరల వివరాలు

రెడ్‌మి నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌ ధరల వివరాలు

రెడ్‌మి నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌ మూడు వేరు వేరు వేరియంట్‌లలో లభిస్తుంది. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.11,999. 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఆప్షన్ ధర రూ.13,499. చివరిది టాప్-ఆఫ్-ది-లైన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.14,999. ఇది ఆక్వా గ్రీన్, ఆర్కిటిక్ వైట్ మరియు పెబుల్ గ్రే అనే మూడు విభిన్న కలర్ ఎంపికలలో లభిస్తుంది.

 

రెడ్‌మి నోట్ 9 ఫోన్ సేల్స్ ఆఫర్స్

రెడ్‌మి నోట్ 9 ఫోన్ సేల్స్ ఆఫర్స్

రెడ్‌మి నోట్ 9 స్మార్ట్‌ఫోన్ ను అమెజాన్ లో కొనుగోలు చేసే కస్టమర్ల యొక్క ఆఫర్ల విషయానికి వస్తే అనేక డెబిట్ / క్రెడిట్-కార్డ్ ల మీద డిస్కౌంట్లను పొందవచ్చు. వీటిలో HSBC కార్డులపై ఐదు శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీద ప్రైమ్ హోల్డర్లకు ఐదు శాతం క్యాష్‌బ్యాక్, అదే ప్రైమ్ కాని కార్డుదారులకు మూడు శాతం క్యాష్‌బ్యాక్ ఉన్నాయి. ఎంచుకున్న కార్డుల మీద అమెజాన్ నో-కాస్ట్ EMI లను కూడా అందిస్తుంది.

 

రెడ్‌మి నోట్ 9 గేమింగ్-ఆధారిత క్వాల్‌కామ్ 7XX  ప్రాసెసర్

రెడ్‌మి నోట్ 9 గేమింగ్-ఆధారిత క్వాల్‌కామ్ 7XX ప్రాసెసర్

రెడ్‌మి నోట్ 9 లో షియోమి క్వాల్‌కామ్ 7XX ప్రాసెసర్‌ను ఉపయోగించడాన్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు.ఇది మెడిటెక్ హెలియో G85 SoC ద్వారా రన్ అవుతుంది. హెలియో G85 ను హెలియో G80 SoC కి అప్ డేట్ వెర్షన్ గా పరిగణించవచ్చు. ఇది 12nm ఉత్పాదక ప్రక్రియపై ఆధారపడి రెండు ARM కార్టెక్స్- A75 కోర్లతో 2.0 GHz వద్ద క్లాక్ చేయబడిన ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇది GPU అప్‌గ్రేడ్‌ను చూస్తు ARM మాలి G52 MC2 చిప్‌ను ఉపయోగిస్తుంది.

రెడ్‌మి నోట్ 9 ఫోన్ 48MP AI క్వాడ్ కెమెరా సెటప్

రెడ్‌మి నోట్ 9 ఫోన్ 48MP AI క్వాడ్ కెమెరా సెటప్

రెడ్‌మి యొక్క బడ్జెట్ హ్యాండ్‌సెట్‌లు అద్భుతమైన కెమెరా సెటప్ లను కలిగి ఉన్నాయి. రెడ్‌మి నోట్ 9 ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 48MP మొదటి కెమెరా f / 1.7 లెన్స్‌తో మరియు 1 / 1.7 ″ CMOS ఇమేజ్ సెన్సార్‌ను ఉపయోగిస్తుంది. అలాగే రెండవ కెమెరా f / 2.2 ఎపర్చరు మరియు 118.2 డిగ్రీల FOV లతో 8MP సెన్సార్‌ను కలిగి ఉండి అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో జతచేయబడి వస్తుంది. ఇందులో గల మరో రెండు కెమెరాలు వరుసగా స్థూల మరియు లోతు సెన్సింగ్ కోసం 2MP సెన్సార్లను ఉపయోగిస్తాయి. అలాగే ముందు భాగంలో 13Mp సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ముందు మరియు వెనుక కెమెరాలలో ఫోటోగ్రఫీ సులభతరం చేయడానికి AI ఫీచర్లను కలిగి ఉన్నాయి.

రెడ్‌మి నోట్ 9 ఫోన్ 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

రెడ్‌మి నోట్ 9 ఫోన్ 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

రెడ్‌మి నోట్ 9 స్మార్ట్‌ఫోన్ 5020 mAh అతి పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది ఒక రోజు మొత్తం నాన్ స్టాప్ గా వాడటానికి వీలుగా శక్తివంతమైన సామర్థ్యం గల బ్యాటరీని కలిగి ఉంది. షియోమి యొక్క సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్లతో బ్యాటరీ వినియోగం విషయానికి వస్తే ఫోన్ చాలా పొదుపుగా ఉంటుంది. ప్రస్తుతానికి ఇది 22.5W ఛార్జర్‌తో వస్తున్నప్పటికి ఫోన్‌ను 18W వద్ద మాత్రమే ఛార్జ్ చేయవచ్చు. కానీ రెడ్‌మి నోట్ 9 లో యూజర్లు పూర్తిగా 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌ను ఆస్వాదించగలరని కంపెనీ ధృవీకరించింది.

Best Mobiles in India

English summary
Redmi Note 9 Second Sale Live on Amazon and Mi.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X