Home
News

ఈ రెడ్‌మి ఫోన్‌లను వాడుతున్నారా!!! అయితే MIUI 12 అప్‌డేట్‌ పొందడం కష్టమే

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ సంస్థ షియోమి ఇండియాలో ప్రతి సంవత్సరం కొత్త ఫోన్‌లను విడుదల చేస్తున్నది. అయితే పాత ఫోన్‌లకు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను అందిస్తున్నది. ఇప్పుడు కొత్తగా తన ఫోన్‌లకు MIUI 12 అప్‌డేట్‌ను అందించడం మొదలుపెట్టింది. అయితే కొన్ని పాత రెడ్‌మి ఫోన్‌లను సరికొత్త MIUI 12 అప్‌డేట్‌కు అప్‌గ్రేడ్ చేయబోమని షియోమి ప్రకటించింది. ఈ ఫోన్‌లను అప్‌డేట్ పొందడానికి గతంలో కంపెనీ హామీ ఇచ్చింది కానీ ఇప్పుడు అప్‌డేట్‌ను అందివ్వడం లేదు. ఇది ఈ రెడ్‌మి ఫోన్ వినియోగదారులకు చేదు వార్త కావచ్చు. ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ పొందడానికి అర్హత లేని రెడ్‌మి ఫోన్ ల జాబితాలో రెడ్‌మి 7, రెడ్‌మి Y3, రెడ్‌మి 6A, మరియు రెడ్‌మి 6 వంటివి ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

MIUI 12 అప్‌డేట్‌ను పొందని రెడ్‌మి ఫోన్‌ల వివరాలు

MIUI 12 అప్‌డేట్‌ను పొందని రెడ్‌మి ఫోన్‌ల వివరాలు

షియోమి సంస్థ కొన్ని నెలల క్రితం దశల వారిగా తన పాత ఫోన్‌లకు MIUI 12 అప్‌డేట్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా మొదటి దశలో రెడ్‌మి 7, రెడ్‌మి Y3, రెడ్‌మి 6A , మరియు రెడ్‌మి 6 ఉండగా రెండవ దశలో రెడ్‌మి నోట్ 7, రెడ్‌మి నోట్ 7 ప్రో, రెడ్‌మి నోట్ 8 ప్రో, మరియు పోకో F1 వంటివి ఉన్నాయి. అయితే ఇప్పుడు MIUI 12 అప్‌డేట్‌ను పొందడానికి అర్హత కలిగిన పరికరాల జాబితా నుండి నాలుగు రెడ్‌మి మోడళ్లను తొలగించాలని కంపెనీ నిర్ణయించింది.

రెడ్‌మి ఫోన్‌లలో MIUI 12 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్

రెడ్‌మి ఫోన్‌లలో MIUI 12 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్

షియోమి యొక్క పాత రెడ్‌మి ఫోన్‌లలో MIUI 12 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ అనుకూలత మరియు పనితీరు సమస్యల కారణంగా నాలుగు రెడ్‌మి ఫోన్‌లకు ఈ అప్‌డేట్‌ను అందించడం లేదు కంపెనీ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ విషయంపై దీనికి మించిన మరిన్ని వివరాలను వెల్లడించలేదు. ఈ కంపెనీ కొత్త అప్‌డేట్ గురించి వినియోగదారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నది. ఇటీవల షియోమి సంస్థ భారతదేశంలోని రెడ్‌మి నోట్ 9 ప్రో మరియు Mi 10 5G వినియోగదారుల కోసం ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్‌ను విడుదల చేసింది. అప్‌డేట్ రోల్‌అవుట్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ రెండు ఫోన్‌ల యూజర్లు కొత్త అప్‌డేట్‌ను త్వరలో పొందుతారు అని కంపెనీ ప్రకటించింది.

MIUI 12 బిల్డ్ ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్‌ వివరాలు

MIUI 12 బిల్డ్ ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్‌ వివరాలు

రెడ్‌మి నోట్ 9 ప్రో ఈ ఏడాది ఆండ్రాయిడ్ 10 ఆధారిత MIUI 11 తో విడుదల చేసింది. అయితే MIUI 12 ఆన్‌బోర్డ్‌ అప్‌డేట్‌ను పొందుతుంది అన్న విషయం మీద కంపెనీ ఇంకా ఎటువంటి విషయాన్ని పేర్కొనలేదు. ప్రీమియం Mi10 5G కోసం ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్ MIUI 12 బిల్డ్ ఆధారంగా ఉందని కంపెనీ పేర్కొంది. షియోమి అనేక Mi మరియు రెడ్‌మి ఫోన్ లకు త్వరలో ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్ లభిస్తుందని ధృవీకరించింది. అయితే దీని యొక్క టైమ్‌లైన్ ఇంకా విడుదల చేయలేదు. రాబోయే రోజుల్లో కంపెనీ అధికారిక అప్‌డేట్‌ను విడుదల చేసే వరకు వేచి ఉండాలి.

Best Mobiles in India

English summary
Redmi phones which don't Get MIUI 12 update in 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X