Home
News

రెడ్‌మీ నుంచి రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు! మార్చి 30న లాంచ్

By Maheswara

రెడ్‌మీ ఇటీవల నోట్ 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఈ సిరీస్‌లో నాలుగు మోడల్‌లు ఉన్నాయి. అవి, రెడ్‌మీ నోట్ 12 5G, నోట్ 12 ప్రో 5G, నోట్ 12 ప్రో+ 5G మరియు ఇంకా కొత్తగా లాంచ్ కాబోతున్న రెడ్‌మీ నోట్ 12 4G. ఈ 4G ఫోన్ కాకుండా, అన్ని నోట్ 12 మోడల్స్ ఈ సంవత్సరం ప్రారంభంలో భారతదేశంలో లాంచ్ చేయబడ్డాయి.

అయితే ఇప్పుడు ఈ రెడ్‌మీ నోట్ 12 4G మార్చి 30న భారత మార్కెట్‌లో లాంచ్ అవుతుందని కంపెనీ ధృవీకరించింది. ఇప్పుడు, ప్రస్తుతం తాజా రిపోర్టుల ప్రకారం రెడ్‌మి ఇండియా దీనితో పాటు మరో ఫోన్ రెడ్‌మి 12C కూడా అదే రోజున భారతదేశంలో లాంచ్ అవుతుందని ధృవీకరించింది.

Redmi Set To Launch Two Phones Redmi 12C And Redmi Note 12 4G On March 30. Everything We Know So far.

అధికారిక కంపెనీ సైట్ ల్యాండింగ్ పేజీలో, షియోమీ ఫోన్ గతంలో చైనా మరియు ఇండోనేషియాలో లాంచ్ చేసిన అదే మీడియా టెక్ హీలియో G85 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని వెల్లడించింది. ఇది బడ్జెట్ ఆఫర్ ధర రూ.10,000 లోపు ఉంటుందని కంపెనీ ధృవీకరించింది.

చైనాలో షాడో బ్లాక్, సీ బ్లూ, మింట్ గ్రీన్ మరియు లావెండర్ రంగు ఎంపికలలో ఇది లాంచ్ చేయబడింది. రెడ్‌మీ 12C యొక్క బేస్ 4GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ ధర CNY 699 (సుమారు రూ. 8,400). 4GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ ధర CNY 799 (దాదాపు రూ. 9,600), అయితే హై-ఎండ్ 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర CNY 899 (దాదాపు రూ. 10,800) గా లాంచ్ అయింది.

రెడ్‌మీ 12C స్మార్ట్‌ఫోన్ యొక్క భారతీయ వేరియంట్ 20.6:9 యాస్పెక్ట్ రేషియో, 1500:1 కాంట్రాస్ట్ రేషియో మరియు 500 నిట్‌ల పీక్ బ్రైట్‌నెస్ లెవల్‌తో దాని ఇతర వేరియంట్‌ల మాదిరిగానే 6.71-అంగుళాల LCD HD+(1,650x720) డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

ఇక కెమెరా, ఆప్టిక్స్ వివరాలు గమనిస్తే, భారతదేశంలో లాంచ్ కాబోతున్న రెడ్‌మీ 12C ఫోన్ 50మెగాపిక్సెల్ AI డ్యూయల్ రియర్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది మరియు డిస్ప్లే పైభాగంలో కేంద్రీకృత వాటర్‌డ్రాప్ నాచ్‌లో ఉంచబడిన 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వచ్చే అవకాశం ఉంది.

రెడ్‌మీ ఫోన్ 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుందని మరియు 5GB వర్చువల్ ర్యామ్‌తో సహా 11GB వరకు పొడిగించిన RAMని కలిగి ఉంటుందని ధృవీకరించింది. రెడ్‌మీ 12C యొక్క మునుపటి వేరియంట్‌లు 10W ఛార్జింగ్ సపోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ మరియు మైక్రో-USB పోర్ట్‌తో వస్తాయి.

భారతదేశంలో రెడ్‌మి ఫైర్ టీవీని ఇటీవలే లాంచ్ చేసిన సంగతి మీకు తెలిసిందే, ఈ కొత్త స్మార్ట్ టీవీ ఫైర్ టీవీ OS తో పనిచేస్తుంది. ప్రస్తుత మార్కెట్లోని ఆండ్రాయిడ్ టీవీలతో విసిగిపోయిన వినియోగదారులకు ఇది సరికొత్త మార్పు.ఈ స్మార్ట్ TV స్పేస్‌లో షియోమీ మరియు రెడ్ మీ అందించే చాలా సేవలు ఆండ్రాయిడ్ TV లు ఇవ్వలేవు. ఈ ఫైర్ TV OS అమెజాన్ యాజమాన్యంలో ఉంటుంది మరియు నిర్వహించబడుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi Set To Launch Two Phones Redmi 12C And Redmi Note 12 4G On March 30. Everything We Know So far.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X