Home
News

రెడ్ మీ కొత్త స్మార్ట్ టీవీ, ఈ రోజే లాంచ్ అయింది! ధర కూడా తక్కువే!

By Maheswara

రెడ్ మీ స్మార్ట్ ఫైర్ టీవీ 32 భారతదేశంలో ఈ రోజు విడుదల చేయబడింది. ఈ టీవీ 32 అంగుళాల సైజు వేరియంట్‌లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.13,999 గా ఉంది. రెడ్ మీ నుండి వచ్చిన ఈ కొత్త టీవీ దాని మునుపటి టీవీల సాఫ్ట్‌వేర్ పట్ల బ్రాండ్ యొక్క విధానంలో పెద్ద మార్పును సూచిస్తుంది.

రెడ్ మీ అమెజాన్‌తో కలిసి ఫైర్ OS ఆపరేటింగ్ సిస్టమ్‌ను దాని మొదటి నాన్ ఆండ్రాయిడ్ TV పవర్డ్ టీవీ గా ఇది రానుంది. అమెజాన్ యొక్క ఫైర్ టీవీ, స్ట్రీమింగ్ పరికరాలలో ఫైర్ టీవీ యొక్క సాఫ్ట్‌వేర్ ప్యాకేజీ విస్తృతంగా ప్రజాదరణ పొందింది మరియు రెడ్ మీ టీవీ కొనుగోలుదారులకు అమెజాన్ మరియు అలెక్స స్ట్రీమింగ్ మరియు స్మార్ట్ హోమ్ ఎకోసిస్టమ్‌లో మెరుగ్గా పనిచేసే సరసమైన స్మార్ట్ టీవీ ఆప్షన్ ను అందించాలని భావిస్తోంది.

Redmi Smart Fire TV With 32Inch Screen And Fire OS 7 Launched In India. Price And Specifications Details.

భారతదేశంలో రెడ్ మీ స్మార్ట్ ఫైర్ టీవీ 32 ధర మరియు లభ్యత వివరాలు
రెడ్ మీ స్మార్ట్ ఫైర్ టీవీ 32 ధర భారతదేశంలో రూ.13,999 గా లాంచ్ అయింది. మరియు ఒకే ఒక్క 32 అంగుళాల HD (1366x768-పిక్సెల్) పరిమాణం మరియు రిజల్యూషన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. రెడ్ మీ నుండి లాంచ్ అయిన ఈ కొత్త స్మార్ట్ టీవీ మార్చి 21 నుండి అమ్మకానికి వస్తుంది మరియు ఈ టీవీ అమెజాన్ మరియు Mi ఆన్‌లైన్ స్టోర్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.

Redmi Smart Fire TV With 32Inch Screen And Fire OS 7 Launched In India. Price And Specifications Details.

రెడ్ మీ స్మార్ట్ ఫైర్ టీవీ 32 స్పెసిఫికేషన్లు మరియు ఫీచర్ల వివరాలు
ఈ టీవీ ప్రస్తుతానికి ఒకే సైజులో మరియు రిజల్యూషన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది 32 అంగుళాలు, HD (1366x768-పిక్సెల్) రిజల్యూషన్‌తో లాంచ్ అయింది.ఈ టీవీ ఫైర్ OS 7 ద్వారా పనిచేస్తుంది. మరియు వివిధ బ్రాండ్‌ల నుండి ఇతర ఫైర్ టీవీ ఎడిషన్ టీవీ లలో అలాగే ఫైర్ టీవీ క్యూబ్ వంటి అమెజాన్ స్వంత శ్రేణి ఫైర్ టీవీ స్ట్రీమింగ్ పరికరాలలో చూడగలిగే సుపరిచితమైన ఫైర్ టీవీ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంది.

Redmi Smart Fire TV With 32Inch Screen And Fire OS 7 Launched In India. Price And Specifications Details.

ప్రైమ్ వీడియో మరియు అమెజాన్ మ్యూజిక్ వంటి అమెజాన్ స్వంత యాప్‌లకు మద్దతుతో పాటు, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్ మరియు ఆపిల్ టీవీ వంటి ప్రముఖ ఆప్షన్లతో సహా అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్ టీవీ యాప్‌లు మరియు స్ట్రీమింగ్ సేవలకు ఫైర్ OS మద్దతు ఇస్తుంది. ఇక సౌండ్ సిస్టం వివరాలు గమనిస్తే, రెడ్ మీ స్మార్ట్ ఫైర్ టీవీ 32 టీవీ లో డాల్బీ ఆడియోకు మద్దతుతో 20W స్పీకర్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

ఇక కనెక్టివిటీ పరంగా, రెడ్ మీ స్మార్ట్ ఫైర్ టీవీ 32 లో బ్లూటూత్ 5 మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, అలాగే ఎయిర్ ప్లే మరియు మీరా కాస్ట్ లకు సపోర్ట్ ఉంది. ఈ టీవీలో రెండు HDMI పోర్ట్‌లు, రెండు USB పోర్ట్‌లు, AV ఇన్‌పుట్ సాకెట్లు, వైర్డు హెడ్‌ఫోన్ లేదా స్పీకర్ కనెక్టివిటీ కోసం 3.5mm సాకెట్, వైర్డు ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ఈథర్నెట్ పోర్ట్ మరియు యాంటెన్నా సాకెట్ ఉన్నాయి. ఇంకా, ఇది 1GB RAM మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజీ కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Redmi Smart Fire TV With 32Inch Screen And Fire OS 7 Launched In India. Price And Specifications Details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X