Home
News

Redmi X-సిరీస్ స్మార్ట్ టీవీల మొదటి సేల్స్ లో ఊహించని ఆఫర్లు!! మిస్ అవ్వకండి...

షియోమి అనుబంధ సంస్థగా ఇండియాలోకి అడుగుపెట్టిన రెడ్‌మి సంస్థ స్మార్ట్ ఫోన్ విభాగంలో మంచి విజయాన్ని సాధించింది. ఇటీవల కొత్తగా X-సిరీస్ స్మార్ట్ టీవీలను కూడా విడుదల చేసింది. రెడ్‌మి యొక్క ఈ X-సిరీస్ స్మార్ట్ టీవీలను మూడు వేర్వేరు పరిమాణాలలో విడుదల చేసింది. వినియోగదారులకు అద్భుతమైన వీక్షణ అనుభవాన్ని అందించడానికి 4K హెచ్‌డిఆర్ LED ప్యానల్‌ను కలిగి ఉండడంతో పాటు ఆండ్రాయిడ్ టివి 10 తో రన్ అవుతూ గూగుల్ ప్లే స్టోర్ ను కలిగి ఉన్న ఈ టీవీలు మొదటిసారి నేడు అమ్మకానికి అందుబాటులోకి రానున్నాయి. అమెజాన్ మరియు Mi.com ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులోకి ఉండే ఈ టీవీల లభించే ఆఫర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రెడ్‌మి స్మార్ట్ టీవీ X-సిరీస్ ధరల వివరాలు

రెడ్‌మి స్మార్ట్ టీవీ X-సిరీస్ ధరల వివరాలు

ఇండియాలో రెడ్‌మి సంస్థ యొక్క X-సిరీస్ స్మార్ట్ టీవీలు మూడు వేర్వేరు వేరియంట్లలో విడుదల అయ్యాయి. వీటిలో X50 మోడల్ యొక్క ధర రూ.32,999 కాగా, X55 మోడల్ యొక్క ధర రూ.38,999, చివరిగా X65 మోడల్ యొక్క ధర రూ.57,999. ఈ సిరీస్ లోని అన్ని స్మార్ట్ టీవీలు ఒకే విధమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి కానీ వాటి పరిమాణాలలో మాత్రమే భిన్నంగా ఉంటాయి. ఈ సిరీస్ యొక్క అమ్మకాలు నేడు మధ్యాహ్నం 12PM నుండి అమెజాన్ ఇండియా మరియు షియోమి యొక్క అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా మొదలుకానున్నాయి.

రెడ్‌మి స్మార్ట్ టీవీ X-సిరీస్ లాంచ్ ఆఫర్స్

రెడ్‌మి స్మార్ట్ టీవీ X-సిరీస్ లాంచ్ ఆఫర్స్

రెడ్‌మి స్మార్ట్ టీవీ X-సిరీస్ స్మార్ట్ టీవీల మొదటి అమ్మకాలలో భాగంగా అమెజాన్ లో వీటి కొనుగోలు మీద అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నది. ముఖ్యంగా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను వినియోగించి కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ.2000 వరకు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది.

రెడ్‌మి స్మార్ట్ టీవీ X-సిరీస్ DTS వర్చువల్ స్పెసిఫికేషన్స్

రెడ్‌మి స్మార్ట్ టీవీ X-సిరీస్ DTS వర్చువల్ స్పెసిఫికేషన్స్

రెడ్‌మి స్మార్ట్ టీవీ X-సిరీస్ టీవీలు HDR10 + ఫార్మాట్‌తో పాటు డాల్బీ విజన్ టెక్నాలజీని కలిగి ఉండి వినియోగదారులకు వీడియో యొక్క నాణ్యతను మరింత మెరుగ్గా ఇస్తుంది. ఈ స్మార్ట్ టీవీలలో గల Vivid పిక్చర్ ఇంజిన్ మరియు రియాలిటీ ఫ్లో వంటివి వీక్షణ అనుభవాన్ని మరింత సున్నితంగా చేస్తుంది. దీనికి DTS వర్చువల్: X మరియు డాల్బీ అట్మోస్ పాస్-త్రూ ఓవర్ EARC తో పాటు డాల్బీ ఆడియో మద్దతు ఉంది. రెడ్‌మి స్మార్ట్ టివి X-సిరీస్ ఆండ్రాయిడ్ టివి 10 లో రన్ అవుతూ హ్యాండ్స్ ఫ్రీ అనుభవం కోసం గూగుల్ అసిస్టెంట్‌ను యాక్సెస్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. షియోమి స్మార్ట్ టీవీల్లో మాదిరిగానే యూజర్లు ప్యాచ్‌వాల్ UIని కూడా యాక్సెస్ చేయవచ్చు.

రెడ్‌మి స్మార్ట్ టీవీ X-సిరీస్ Chromecast ఫీచర్స్

రెడ్‌మి స్మార్ట్ టీవీ X-సిరీస్ టీవీలలో కంటెంట్ మిర్రరింగ్‌ను అనుమతించడానికి ఇవి అంతర్నిర్మిత Chromecast తో వస్తాయి. ఇది 64-బిట్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్‌తో రన్ అవుతూ 2GB ర్యామ్ మరియు 16GB ROM‌తో జతచేయబడి వస్తుంది. ఈ రెడ్‌మి స్మార్ట్ టీవీ X-సిరీస్ టీవీలు ఆటో లోటెన్సీ మోడ్ (ALLM) కు మద్దతు ఇస్తాయి. ఇవి రెండు USB పోర్ట్, మూడు HDMI పోర్ట్‌లు, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై మరియు బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ మద్దతును కలిగి ఉండడంతో పాటుగా 3.5mm ఆడియో జాక్ ను కలిగి ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi X-Series Smart TVs First Sale Starts Today 12PM on Amazon and Mi.com: Price, Specs, Sale Discount Offers and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X