జియో కళ్లు చెదిరే ఆఫర్,యూజర్లకు 4K LED TV, Set-Top-Box ఫ్రీ

By Gizbot Bureau
|

రిలయన్స్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో ఫైబర్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు జియో అధినేత అధికారిక ప్రకటన చేశారు. గిగాఫైబర్‌ సేవల్ని పొందే కస్టమర్లకు రిలయెన్స్ జియో అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. గిగాఫైబర్ యాన్యువల్ ప్లాన్ తీసుకున్నవారికి హెచ్‌డీ 4K ఎల్ఈడీ టీవీతో పాటు సెట్ టాప్ బాక్స్ ఉచితంగా ఇవ్వనున్నట్టు రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ ఎండీ ముకేష్ అంబానీ ప్రకటించారు. 'జియో ఫరెవర్ యాన్యువల్ ప్లాన్స్' పేరుతో ఈ ఆఫర్ ప్రకటించారు.

 జియో కళ్లు చెదిరే ఆఫర్,యూజర్లకు 4K LED TV, Set-Top-Box ఫ్రీ

 

దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 5 నుంచి జియో ఫైబర్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని, టారిఫ్ ప్లాన్ 700 రూపాయల నుంచి మొదలై రూ.10000 వరకూ ఉంటుందని ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఒకే కనెక్షన్‌తో ఇంటర్నెట్, డీటీహెచ్, ల్యాండ్‌లైన్ సేవలను పొందొచ్చని తెలిపారు. దీంతో పాటు ఫ్రీ వాయిస్ కాల్స్, అతి తక్కువ చార్జీతో ఇంటర్నేషనల్ కాలింగ్ సదుపాయం, ఫస్ట్ డే ఫస్ట్ షో స్క్రీనింగ్స్ అంటే థియేటర్‌లో విడుదలయ్యే సినిమాను ఇంట్లోనే కూర్చుని చూసే సదుపాయం అందుబాటులోకి తీసుకురానుంది.

 ఒక్క బాక్స్‌లోనే అనేక సదుపాయాలు

ఒక్క బాక్స్‌లోనే అనేక సదుపాయాలు

కాగా గతంలో ఎన్నడూ లేనివిధంగా దేశంలోనే తొలిసారిగా జియో 4కె సెట్ టాప్ బాక్స్‌ను తీర్చిదిద్దినట్లు ఆకాష్, ఈషా అంబానీ తెలిపారు. ఒక్క బాక్స్‌లోనే అనేక సదుపాయాలను వినియోగదారులకు అందివ్వడం జరుగుతుందన్నారు. ఈ బాక్స్ ద్వారా 4కె అల్ట్రా హెచ్‌డీ నాణ్యత కలిగిన టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.

 ఎంఆర్ పేరిట మరో సదుపాయం

ఎంఆర్ పేరిట మరో సదుపాయం

వర్చువల్ రియాలిటీ, అగ్‌మెంటెడ్ రియాలిటీలను కలిపి నూతనంగా ఎంఆర్ పేరిట మరో సదుపాయాన్ని ఈ బాక్స్‌లోని పలు యాప్స్‌లలో అందిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు షాపింగ్‌కు వెళ్లకున్నా ఇంట్లోనే ఉండి దుస్తులను ట్రై చేయవచ్చని, తమకు నచ్చే దుస్తులను వర్చువల్ రియాలిటీలో చూసుకుని అనంతరం వాటిని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చు.

 ఉచితంగా వీడియో కాల్స్
 

ఉచితంగా వీడియో కాల్స్

జియో 4కె సెట్ టాప్ బాక్సు ద్వారా వినియోగదారులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ఎవరికైనా ఉచితంగా వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఇందుకు గాను జియో కాల్ పేరిట ఓ యాప్‌ను రిలయన్స్ జియో అందిస్తోంది. ఈ బాక్సులో హోమ్ సెక్యూరిటీ, స్మార్ట్‌హోం ఫీచర్లను కూడా అందిస్తున్నారు. జియో గిగాఫైబర్‌తో అందివ్వనన్న బ్రాడ్‌బ్యాండ్‌ కనీసం 100 ఎంబీపీఎస్ మొదలుకొని గరిష్టంగా 1 జీబీపీఎస్ వరకు ఇంటర్నెట్ స్పీడ్‌తో రానుంది. తద్వారా వినియోగదారులు 4కె అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్ ఉన్న వీడియోలను కూడా ఎలాంటి బఫరింగ్ లేకుండా వీక్షించేందుకు వీలు కలుగుతుంది.

 నెలకు రూ.700 నుంచి ప్లాన్

నెలకు రూ.700 నుంచి ప్లాన్

‘Jio forver Annual plans' తో జియో ఉచితంగా 4K/HD TV, 4K set-top box ఆఫర్ చేస్తోంది. జియో గిగాఫైబర్ అందించే డేటా ప్లాన్లు రూ.700 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ప్యాకేజీ కింద జియో తమ డేటా యూజర్లకు 100Mbps వరకు బ్రాడ్ బ్యాండ్ ఆఫర్ చేస్తోంది. రూ. 700 ప్లాన్ నుంచి కనీసం నెలకు రూ.10వేల ప్లాన్ వరకు అఫర్ చేస్తోంది.

 నెలకు రూ.500 చెల్లిస్తే చాలు

నెలకు రూ.500 చెల్లిస్తే చాలు

ఇంటర్నేషనల్ కాలింగ్ కోసం నెలకు రూ.500 చెల్లిస్తే చాలు.. జియో గిగాఫైబర్ Fixed voice calling, fixed line rates పొందవచ్చు. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు ఇంటర్నేషనల్ నెంబర్లకు Unlimited calling చేసుకోవచ్చు. US, Canada దేశాలకు Unlimited వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. Free voice కాల్స్ మాత్రమే కాదు.. జియో గిగాఫైబర్ సర్వీసు అందించే ప్లాన్స్ యాక్టివేట్ చేసుకుంటే OTT ప్లాట్ ఫాం సబ్ స్క్రిప్షన్ల బండెల్ పొందవచ్చు. ఇందులో కొత్తగా రిలీజ్ అయిన మూవీలను చూసి ఎంజాయ్ చేయవచ్చు.

జియో Smart TV

జియో Smart TV

ప్రీమియం కస్టమర్ల కోసం జియో Postpaid Plus అందుబాటులోకి తీసుకోస్తోంది. దీనిద్వారా platinum-grade సర్వీసు పొందవచ్చు. అంటే.. ఇంట్లో SIM సెటప్ సర్వీసుతో పాటు డేటా షేరింగ్, వాయిస్ కనెక్టవిటీ వంటి ఎన్నో ఫ్యామిలీ ప్లాన్లు పొందవచ్చు. ఇతర ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లకు పోటీగా హైస్పీడ్ ఆప్టికల్ ఫైబర్ బేసిడ్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను జియో అందిస్తోంది. జియో గిగాఫైబర్ సర్వీసులో స్మార్ట్ హోం డొమైన్ గా పనిచేయనుంది. jio స్మార్ట్ టీవీలను కూడా ఇండియాలో విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Reliance AGM 2019: Free 4K LED TV, Set-Top-Box available for Jio Forever Plan subscribers

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X