వరాలజల్లులు కురిపించిన జియో అధినేత, మీటింగ్ హైలెట్స్

రిలయన్స్ జియో 41వ వార్షికోత్సవ సమావేశం ముంబైలోని న్యూ మెరైన్ లైన్స్‌లో బిర్లా మధుశ్రీ ఆడిటోరియంలో ప్రారంభమైంది.

|

రిలయన్స్ జియో 41వ వార్షికోత్సవ సమావేశం ముంబైలోని న్యూ మెరైన్ లైన్స్‌లో బిర్లా మధుశ్రీ ఆడిటోరియంలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో జియో అధినేత వరాల జల్లులను కురిపించారు. దేశీయ టెలికాం రంగంలో అతిపెద్ద గేమ్‌ ఛేంజర్‌ ఫైబర్‌ ఆధారిత ఫిక్స్‌డ్‌లైన్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులు' జియోగిగాఫైబర్‌' ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ కూతురు ఇషా అంబానీ, కొడుకు ఆకాశ్‌ అంబానీలు ఈ సర్వీసులను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు. జియోగిగాఫైబర్‌ ద్వారా అందించే ఫీచర్లను ఆకాశ్‌, ఇషా అంబానీలు ప్రజెంటేషన్‌ ద్వారా ఇన్వెస్టర్లకు వివరించారు.

దిగ్గజాలకు జియో మరో షాక్, వైఫైతో వాయిస్ కాల్స్దిగ్గజాలకు జియో మరో షాక్, వైఫైతో వాయిస్ కాల్స్

సెటాప్‌బాక్స్‌ ద్వారా..

సెటాప్‌బాక్స్‌ ద్వారా..

సెటాప్‌బాక్స్‌ ద్వారా టీవీలో కూడా జియోగిగాఫైబర్‌ సేవలను అందించనున్నట్టు తెలిపారు. జియోగిగాఫైబర్ ద్వారా జియోటీవీ కాలింగ్‌ ఫీచర్‌ను కూడా తీసుకొచ్చారు. స్మార్ట్‌ హోమ్‌ టెక్నాలజీ, టీవీ కాలింగ్‌లు జియోగిగాఫైబర్‌ రెండు ముఖ్యమైన ఫీచర్లని తెలిపారు.

జియో ఫోన్‌ యూజర్ల కోసం

జియో ఫోన్‌ యూజర్ల కోసం

జియో ఫోన్‌ యూజర్ల కోసం మూడు ముఖ్యమైన యాప్స్‌ యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, వాట్సప్‌లను ప్రత్యేకంగా రూపొందించినట్టు ఆకాశ్‌, ఇషాలు చెప్పారు. జియో ఫోన్‌లో ఇవి ఎలా పనిచేస్తాయో కూడా ఈ సమావేశంలో చూపించారు.

ఆగస్టు 15 నుంచి..
 

ఆగస్టు 15 నుంచి..

ఆగస్టు 15 నుంచి యూజర్లకి వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్టు ముఖేష్‌ అంబానీ తెలిపారు. జియోఫోన్‌ హైఎండ్‌ మోడల్‌ జియోఫోన్‌ 2ను కూడా ప్రవేశపెట్టారు. 25 కోట్లకు పైగా జియోఫోన్‌ యూజర్లు ఉన్నారని తెలిపారు.

బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు

బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు

దీంతో పాటు బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు కూడా ఆగస్టు 15 నుంచే కస్టమర్ల ముందుకు వస్తున్నాయి. గృహాలకు, వర్తకులకు, చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలకు, పెద్దపెద్ద వ్యాపారాలకు ఫైబర్‌ కనెక్టివిటీని విస్తరించనున్నామని రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ తెలిపారు.

1,100 నగరాలకు

1,100 నగరాలకు

1,100 నగరాలకు అత్యున్నతమైన ఫైబర్‌ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీ సొల్యూషన్స్‌ను ఆఫర్‌చేస్తున్నట్టు తెలిపారు. ప్రపంచంలోనే టాప్‌ - 5 బ్రాడ్‌బ్యాండ్‌ దేశాల్లో భారత్‌ను ఒకటిగా నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు.

2,999 రూపాయలకే జియోఫోన్‌ 2

2,999 రూపాయలకే జియోఫోన్‌ 2

ఇంకో ఆసక్తికర అంశం ఏంటంటే..2,999 రూపాయలకే హై-ఎండ్‌ మోడల్‌ జియోఫోన్‌ 2ను మార్కెట్లోకి తీసుకురానున్నారు. అలాగే రూ.501కే పాత ఫీచర్ ఫోన్ల ఎక్స్చేంజ్‌లో కొత్త జియోఫోన్‌ సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. జియోఫోన్‌కు మాన్‌సూన్‌ హంగామా ఆఫర్‌ కూడా రానుంది.

గంట కంటే తక్కువ వ్యవధిలోనే ..

గంట కంటే తక్కువ వ్యవధిలోనే ..

జియోగిగాపైబర్‌ నెట్‌వర్క్‌ను గంట కంటే తక్కువ వ్యవధిలోనే కంపెనీ సర్వీస్‌మెన్‌ ఇన్‌స్టాల్‌ చేస్తారు. బెస్ట్‌ ఎడ్యుకేషనల్‌ కంటెంట్‌ను జియోగిగాఫైబర్‌ హోమ్‌ ద్వారా యాక్సస్‌ ను వాడుకోవచ్చిన తెలిపారు.

 జియోగిగా టీవీని

జియోగిగా టీవీని

ఈ సమావేశంలో జియోగిగా టీవీని కంపెనీ లాంచ్ చేసింది. దీని ద్వారా 4కే రెజుల్యూషన్‌లో వీడియో ప్లే చేసుకోవచు. ఇవి అందరికీ అందుబాటు ధరలో ఉండేవిధంగా తీసుకురానున్నారు.

Best Mobiles in India

English summary
Reliance AGM LIVE: RIL launches range of smart home products under JioGigaFiber More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X