5 సంవత్సరాల పాటు ఉచితంగా డీటీహెచ్ సేవలు, రిలయన్స్ ఆఫర్ !

Written By:

అనిల్ అంబానీకి చెందిన డైరెక్ట్-టూ-హోమ్(డీటీహెచ్) సేవల సంస్థ రిలయన్స్ బిగ్ టీవీ ఉచితంగా సేవలు అందించనున్నట్లు ప్రకటించింది. దాదాపు 500 వరకు చానెళ్లను 5ఏళ్ల పాటు అందించనున్న సంస్థ పే ఛానళ్లను మాత్రం ఏడాది పాటు దేశవ్యాప్తంగా ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. అలాగే వీటితో పాటు ఉచితంగా హెచ్‌ఈవీసీ సెట్ టాప్ బాక్స్‌ను కేటాయించనున్నది. స్వల్పకాలం పాటు అమలులో ఉండనున్న ఈ ఆఫర్ మార్చి 1నుంచి ప్రారంభించనున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. కాగా ప్రతి భారతీయుడికి టీవీల ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలను అందించాలనే ఉద్దేశంతో ఈ ఉచిత సేవలకు శ్రీకారం చుట్టినట్లు రిలయన్స్ బిగ్ టీవీ డైరెక్టర్ విజేందర్ సింగ్ తెలిపారు. మరి దాన్ని ఎలా పొందాలనే దానిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

MWC 2018లో కొత్త విషయాలను బయటపెట్టిన జియో , శాంసంగ్ తోడుగా..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రిలయన్స్ బిగ్ టీవీ వెబ్‌సైట్ ద్వారా..

రిలయన్స్ బిగ్ టీవీ వెబ్‌సైట్ ద్వారా సెట్ టాప్ బాక్స్ అలాగే outdoor unit (ODU)కోసం ఫ్రీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. బుకింగ్ సమయంలో దీని ధర రూ.499ను చెల్లించాల్సి ఉంటుంది.

మిగతా బ్యాలన్స్ రూ.1500 ..

ఆ తరువాత మీ ఇంటికి లేక మీరు ఇచ్చిన అడ్రస్ కి సెట్ టాప్ బాక్స్ వస్తుంది. అప్పుడు మీరు మిగతా బ్యాలన్స్ రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు మీకు ఏడాది పాటు కండీషన్లతో కూడిన ఉచిత ఛానల్స్ కి అర్హత పొందుతారు.

ఈ ఆఫర్ పరిధిలోకి మీరు రావాలంటే

ఈ ఆఫర్ పరిధిలోకి మీరు రావాలంటే రెండో సంవత్సరం నుంచి ప్రతినెలా రూ.300 చొప్పున రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మీరు కంటిన్యూ అయితే మీకు రిలయన్స్ బిగ్ టీవీ నుంచి 6 నెలల తర్వాత రూ.1999 క్యాష్ బ్యాక్ రూపంలో మీకు అందుతుంది.

బాక్స్ కొనుగోలు సమయంలో చెల్లించిన మొత్తం ..

కాగా మీరు బాక్స్ కొనుగోలు సమయంలో ఇన్ స్టాలేషన్ ఛార్జీల కింద రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది. ఇక కస్టమర్ 5 బుకింగ్ ల వరకు చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. 

నేటి ఉదయం 10 గంటల నుంచి

కాగా ఈ ఆఫర్ నేటి ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానుంది. అయితే ఇది పరిమిత కాల ఆఫర్ అని కంపెనీ చెబుతోంది. మీరు బుక్ చేసుకున్న నెల రోజులకు బాక్స్ వస్తుంది. ఈ సెట్ టాప్ బాక్స్ రికార్డింగ్, USB port, YouTube, simultaneous recording and viewing channelsలాంటి ఫీచర్లను కలిగి ఉంది. మరిన్ని వివరాలకు కంపెనీ రిలయన్స్ బిగ్ టీవీ వెబ్‌సైట్‌ని సందర్శించగలరు.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Big TV to offer 'effectively free' access to channels for up to 5 years More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot