బిగ్ టివి బంపరాఫర్, ఏడాది పాటు అన్నీ ఫ్రీ, నిర్ణీత మొత్తంతో..
అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ బిగ్ టీవీ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.
అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ బిగ్ టీవీ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. డిష్ టీవీ సేవలు అందించే రియలన్స్ బిగ్ టీవీ యూజర్ల కోసం నిర్ణీత మొత్తంతో ఏడాది పాటు అన్నీ ఉచితంగా లభించేలా సరికొత్త ప్లాన్‌ను తీసుకువచ్చింది. పూర్తి వివరాల్లోకెళ్లితే..రూ.500తో పోస్టాఫీసుకు వెళ్లి రిలయన్స్ బిగ్ టీవీ కనెక్షన్ ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. రిలయన్స్ బిగ్ టీవీ ఇందుకోసం తపాలా శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం దేశాల్లోని చాలా రాష్ట్రాల్లో అందుబాటులో ఉంది.

50 వేల పోస్టాఫీసులతో ..
మొత్తం 50 వేల పోస్టాఫీసులతో కంపెనీ ఈ ఒప్పందం కుదుర్చుకుంది. Rajasthan, Punjab, Uttarakhand, Andhra Pradesh, Karnataka, Arunachal Pradesh, Assam, Manipur, Meghalaya, Mizoram, Nagaland, Sikkim లాంటి రాష్ట్రాలు ఇందులో ఉన్నాయి.

ఏకకాలంలో చానల్స్ recordingతో పాటు viewing సదుపాయం
రిలయన్స్ బిగ్ టీవీ నుంచి వచ్చిన HD HEVC Set-Top-Box లేటెస్ట్ ఫీచర్లను లోడ్ చేసుకుని కొత్తగా మార్కెట్లోకి దూసుకొచ్చింది. scheduled recording, USB port, HDMI port, ఏకకాలంలో చానల్స్ recordingతో పాటు viewing సదుపాయం లాంటి వాటిని జోడించారు.

500 FTA channels
సంవత్సరం పాటు 500 FTA channelsని ఉచితంగా అందిస్తోంది. అయితే తొలుత రూ.500తో బుక్ చేసుకున్న వారు సెట్ టాప్ బాక్స్ ఇన్స్ టలేషన్ సమయంలో మరో రూ.1,500 చెల్లించుకోవాలి. ఇన్స్ టలేషన్ చార్జీలు మరో రూ.250 అదనం. తద్వారా మీరు ఏడాది పాటు ఉచితంగా అన్ని సదుపాయాలను పొందవచ్చు.

ఏడాది దాటిన తర్వాత
ఏడాది దాటిన తర్వాత నుంచి ప్రతీ నెల రూ.300 చొప్పున రీచార్జ్ చేసుకుంటేనే పెయిడ్ చానల్స్ చూడగలరు.

రూ.2,000 ను లాయల్టీ బోనస్
అలా రెండేళ్ల పాటు ప్రతీ నెలా రూ.300 చొప్పున రీచార్జ్ చేసుకుంటే ఆ తర్వాత రూ.2,000 ను లాయల్టీ బోనస్ గా కంపెనీ వెనక్కిచ్చేస్తుంది.

ఈ నెల 20 నుంచి అందుబాటులో..
ఏపీ సహా పలు రాష్ట్రాల పోస్టాఫీసుల్లో ఈ సదుపాయం ఈ నెల 20 నుంచి అందుబాటులో ఉంటుంది. లేదా రిలయన్స్ బిగ్ టీవీ వెబ్ సైట్ నుంచి కూడా ఇంతే మొత్తం చెల్లించి కనెక్షన్ బుక్ చేసుకోవచ్చు.

జూలై 30 నాటికి..
ముందుగా బుక్ చేసుకున్న వారికి జూలై 30 నాటికి వారింటి వద్ద సెట్ టాప్ బాక్స్ లను కంపెనీ ఇన్ స్టాల్ చేస్తుంది.


Click it and Unblock the Notifications








