ఆ ఒప్పందం వాస్తవం..లబ్ధి ఏ మేరకో?

Posted By: Prashanth

ఆ ఒప్పందం వాస్తవం..లబ్ధి ఏ మేరకో?

 

భారతదేశపు ప్రధాన సెల్యులర్ సర్వీసు ప్రొవైడర్ రిలయన్స్, ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ యూజర్ల కోసం విస్తృత ప్లాన్‌లను అందుబాటులోకి తేనుంది. గుగూల్‌తో భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకున్న రిలయన్స్ ప్రత్యేకించి ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఆకర్షణీయమైన టారిఫ్ ప్లాన్స్ అదేవిధంగా 3జీ డేటా ప్లాన్‌లను సమకూర్చనుంది.

రిలయన్స్ అందిస్తున్న ఈ ప్రణాళిక కింద ఆండ్రాయిడ్ వాడకందారులు నెలకు 1జీబి, 3జీ నెట్‌వర్క్‌ను ఉచితంగా పొందవచ్చు. దింతో పాటు అదనంగా నిష్ణాతమైన కస్టమర్ కేర్, క్యారియర్ బిల్లింగ్, విశష్టమైన అప్లికేషన్స్ డౌన్ లోడ్, ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ జోన్ వంటి అత్యాధునిక సేవలను పొందవచ్చు. ఈ దిగ్గజాలు సంయుక్త ఒప్పందంతో ఆండ్రాయిడ్ వినియోగదారులు ఏ మేరకు లబ్ధి పొందుతారో వేచి చూడాలి మరి.

విస్తరిస్తున్న రిలయన్స్ డిజిటల్స్..!

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ అనుబంధ కంపెనీ రిలయన్స్ డిజిటల్ తన వ్యాపారాన్ని మరింత విస్తరించుకుంటోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ డిజిటల్ రిటైల్ స్టోర్ల సంఖ్య మూడురెట్లు పెరిగింది. గత ఒక్కనెలలోనే కొత్తగా 16 రిటైల్ అవుట్‌లెట్లు తెరచిన ఈ కంపెనీ మొత్తం స్టోర్ల సంఖ్య 75కు చేరంది. గత ఏడాది వరకు వీటి సంఖ్య 27 మాత్రమే. 2012 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా రిలయన్స్ డిజిటల్ కొత్తగా 48 ఎలక్ట్రానిక్ రిటైల్ అవుట్‌లెట్లను ప్రారంభించింది. ఈ సంవత్సరంలోనూ తమ వ్యాపార విస్తరణకు వివిధ కీలక ప్రణాళికలు రూపొందించామని రిలయన్స్ డిజిటల్ సిఇఓ బ్రియాన్ బాడే తెలియజేశారు. రిలయన్స్ రిటైల్‌లో ఒక విభాగమైన రిలయన్స్ డిజిటల్ మొత్తం 150కు పైగా దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన మొత్తం 4,000 ఎలక్ట్రానిక్ వస్తువులను విక్రయిస్తోంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot